[dropcap]తె[/dropcap]లుగు సాహిత్యంలో ఉత్తమ వచన కవిత్వాన్ని ఆవిష్కరిస్తున్న కవులకు ప్రతి సంవత్సరం పాలమూరు సాహితీ అవార్డులను ప్రదానం చేస్తున్న సంగతి సాహితీవేత్తలందరికి తెలిసిందే.
గతంలో ఈ అవార్డులను ప్రముఖ కవులు డా. రాధేయ, డా. కాసుల లింగారెడ్డి, డా. పెన్నా శివరామకృష్ణ, కందుకూరి శ్రీరాములు, అంబటి నారాయణ, ఎస్.హరగోపాల్, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, చిత్తలూరి సత్యనారాయణ, తగుళ్ళ గోపాల్, డాక్టర్ జెల్ది విద్యాధర్ రావులు అందుకున్నారు.
ఈ పురస్కారం కోసం 2023 సంవత్సరంలో ముద్రితమైన వచన కవితా సంపుటాలను మాత్రమే మూడేసి ప్రతులను పంపించాల్సిందిగా కోరుతున్నాము.
కావున కవులు తమ ప్రతులను డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ఇ.నం. 8-5-38, టీచర్స్ కాలని, మహబూబ్ నగర్ – 509001, తెలంగాణ రాష్ట్రం అనే చిరునామాకు జనవరి 31 లోపున పంపాలి. బహుమతి పొందిన ఉత్తమ వచన కవితా సంపుటికి రూ. 5,116/- నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందజేస్తాము.
– డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
వ్యవస్థాపకులు
పాలమూరు సాహితి అవార్డ్
మహబూబ్ నగర్ – 509001
9032844017