ప్రేమించడం!

1
4

[ఆల్బర్ట్ కామూ రచించిన కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of Albert Camus’s poem ‘Loving You’ by Mrs. Geetanjali.]

~

[dropcap]నే[/dropcap]ను ముసలివాడినయ్యే కొద్దీ
అర్థం అవుతూ వస్తున్నదేంటంటే..
నీకు స్వేచ్ఛని ఇస్తూ.,
నువ్వు భరించేంత తేలికగా ఉంటూ..
నీకే మాత్రమూ భారం కాకుండా
నిన్ను ప్రేమించే వాళ్లతో మాత్రమే జీవించగలవని!
ఆ స్వేచ్ఛ, ప్రేమ చాలా బలంగా కూడా ఉండాలి సుమా!
షరతులు లేని ప్రేమ అన్నమాట!
కానీ ఈ కాలపు జీవితం ఉందే.,
చాలా దుర్భరమైనది, చేదైనది కూడా.
సరే ఇక., మనం ప్రేమించే వారితో
మళ్లీ సరి కొత్త బంధాల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి?
ఈ జీవితం
పూర్తిగా రక్తహీనమై పాలిపోయిందే మరి?
నీ సంతోషాన్ని.. స్వేచ్ఛని..
ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే
జీవించడంలోని నీ అద్భుతమైన సాహసాన్ని
నేను అమితంగా ప్రేమిస్తాను.
నా స్వేచ్ఛని ఏమాత్రం అడ్డుకోని
నీతో జీవన సాహచర్యాన్ని ఇష్టపడతాను..
నిన్ను ప్రేమిస్తున్నాను!

~

మూలం: ఆల్బర్ట్ కామూ

అనుసృజన: గీతాంజలి


గొప్ప తత్త్వవేత్తగా పేరుగాంచిన ఆల్బర్ట్ కామూ 7 నవంబరు 1913న అప్పటి ఫ్రెంచి వలసరాజ్యమైన అల్జీరియాలో జన్మించారు. బాల్యంలో పేదరికం, జీవితంలో అనేక యాతనలను అనుభవించిన కామూ స్వయంకృషితో చదువుకుని తత్త్వశాస్త్రంలో ఎం.ఎ. చేశారు. The Stranger, The Plague, The Fall, A Happy Death వంటి నవలలు రాశారు. కథలు, నాటకాలు, వ్యాసాలు కూడా రాశారు. చిన్న వయసులో నోబెల్ బహుమతి పొందిన రెండవ రచయిత. 4 జనవరి 1960 నాడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here