ఆ ఇద్దరు

0
4

[box type=’note’ fontsize=’16’] ఇంటినే ఆటలబడిగా మార్చి, ఉద్యోగస్థులైన తల్లిదండ్రుల పిల్లలను రోజంతా సంరక్షిస్తూ, వాళ్ళకి నిశ్చింత కల్పించిన “ఆ ఇద్దరు” గురించి చెబుతున్నారు సింగిడి రామారావు ఈ కథలో. [/box]

[dropcap]“పి[/dropcap]ల్లలంటే ఎవరికిష్టం ఉండదు? లేత బుగ్గలు, బోసి నవ్వులు, కేరింతలు. పసిపిల్లలు పారాడే ఇల్లు దేవుడు తిరిగే లోగిళ్ళు. ‘ఏ పసివాడిని చూసినా చేతవెన్నముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి సందిట తావీదు సరిమువ్వ గజ్జెలు చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతు’ అని పాడాలనిపిస్తుంది. నా మనసు తన్మయత్వం చెందుతుంది. ‘లేతమనషులు’ సినిమాలో ‘పిల్లలూ దేవుడూ చల్లనివారే కల్ల కపట మెరుగని కరుణా మయులే’ అన్న పాట ఎన్నిసార్లు విన్నా తనివితీరదు నాకైతే. పురాణంలో వామన మూర్తిని చూసిన బలిచక్రవర్తి కుమార్తె ‘ఈ బాలుడెంత ముద్దొస్తున్నాడు,ఇటువంటి బాలుడికి స్తన్యం ఇచ్చిన తల్లి ధన్యురాలు. ఆ అవకాశం నాకు కలిగితే ఎంత అదృష్టమో కదా’ అనుకున్నదట. కృష్ణావతారంలో ఆమె పూతనగా జన్మించి అ కోరిక నెరవేరినట్లు భగవంతుడు అనుగ్రహించాడట” అని రాధమ్మతో యశోద ఇంకేదో చెబుతుంది.

అంతలో అక్కడకు మురళి వచ్చి రాధమ్మ చెంగుపట్టుకుని “అమ్మా,అమ్మా అయిసుకీము కొనవా నాకు” అని మారాం చేయసాగాడు. “తప్పు బాబు, అది తింటే జలుబు చేస్తుంది. నీకు మనింట్లో చేసిన మిఠాయి ఇస్తాగా అది తిందువుగాని” అని ఓదార్చింది. మురళి మూడు సంవత్సరాల వయసువాడు.

“అవును ఈ అబ్బాయి…?” అని ప్రశ్నార్ధకంగా చూసిన యశోధకు రాధ ఇలా చెప్పింది.

“ఈ మురళి మూడోనెల పిల్లాడుగా ఉండగా వీడి అమ్మ కాలధర్మం చెందింది. వీడి నాన్నవేరే ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఈ బాబును నేను చేరదీసాను. నాకూ ఎవరూ లేరుగా. వీడి ఆలనాపాలనతో నాకు మంచి కాలక్షేపం అవుతుంది” అని చెప్పింది.

యశోదకు ఇద్దరు కొడుకులు, వారు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లికి డబ్బు పంపిస్తారు. ఆమెను రమ్మన్నా, ఆమెకు అక్కడ ఉండడం ఇష్టం ఉండదు.

“నాశేష జీవితం ఇక్కడనే ఈ మట్టికే అంకితం అయిపోనీ. నేను మాత్రం ఈ ఊరు, ఈ ఇల్లు విడిచిరాను” అని అబ్బాయిలకు చెప్పింది. ఆమె భర్త పోయిన తరువాత లంకంత ఇల్లు, దేనికీ ఇబ్బందిలేని జీవితం. స్వతహాగా ధైర్యవంతురాలు, ఆధ్యాత్మిక జ్ఞానసంపన్నురాలు. శ్రీకృష్ణ భక్తురాలు. శ్రీకృష్ణునిపై పాటలు రాసుకుంటూ, పాడుకుంటూ తన్మయత్వస్థితిలో ఉంటుంది. ఊరిలోఉన్న కృష్ణమందిరానికి ప్రతీవారం వెళ్ళి వస్తూ ఉంటుంది. ఆ మందిరం దగ్గరనే చిన్నప్పుడు ఒకేచోట తనతోపాటు ఆడుకున్నరాధ సుమారు ఏభై సంవత్సరముల అనంతరం కలిసింది. ఒకర్నొకరు మాటలు కలుపుకుని పరిచయాలు చేసుకున్న తరుణంలో వాళ్ళు బాల్య స్నేహితులని తెలుసుకుని చాలా ఆనందించారు.

రాధ వేరే చోట ఇంటి అద్దె కట్టుకుని ఉండడం ఎందుకని యశోద రాధను తనతోనే ఉండమని చెప్పడం వలన వారిరువురు మురళితో ముచ్చట్లతో కాలక్షేపం చేయసాగారు. వాళ్ళు ఉంటున్నది పెద్దపట్నం. భార్యాభర్తలు ఉద్యోగాలకు వెళ్ళి పిల్లలను ఇళ్ళ దగ్గర చూసే పెద్ద దిక్కులేక భాధ పదుతుంటారని అటువంటి వారి  సౌకర్యం కోసం యశోద రాధల ఆలోచనతో – యశోద గారి ఇంటినే ‘యశోద ఆటల బడి’గా మార్చారు. ఈ ఆటల బడిలో చేర్చి నిర్భయంగా, నిశ్చింతగా ఉద్యోగాలకు వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు ఎవరి పిల్లలను వాళ్ళు తీసుకు వెళ్తూ ఉంటారు.

పగటి పూట యశోద ఇల్లు మూడు, నాలుగు సంవత్సరముల వయసు పిల్లలతో కళకళ లాడుతూ ఉంటుంది. సుమారు ఇరవై మంది పిల్లల వరకు ఉన్నారు. వీరి ఆలనా పాలనా చూసుకోవడానికి నలుగురు ఆయాలను ఏర్పాటు చేసారు. ఆ పిల్లలో దేవతామూర్తులను చూసుకుంటూ హాయిగా కాలం గడుప సాగారు యశోద రాధలు.

ఒక సాయింత్రం యశోద రాధలు మార్కెట్‌కు వెళ్తూ దారిలో కారు ఆపి అందులో ఉండగా ఆ ప్రక్కనుంచి వెళ్తున్న ఇరువురి సంభాషణ వీరి చెవుల్లో ఈ విధంగా పడింది.

కమల గౌరితో “మా పాప హేమను యశోద ఆటల బడిలో చేర్చిన తరువాత నిశ్చింతగా ఉంది నాకు” అంది. గౌరి కమలతో “నేను కూడా మా పాపను అక్కడనే చేర్పించాలనుకుంటున్నాను, మన ఊరిలో ఆ యశోద రాధమ్మలు చాలా చక్కగా ఈ ఆటలబడిని నిర్వహిస్తున్నారని మంచిపేరు ఉంది. వారికి ధనాపేక్షలేదు. పిల్లల క్షేమమే వారికి ముఖ్యం. అక్కడ వాతావరణం ఒక ఆశ్రమాన్ని తలపించేలా ఉన్నది” అంది.

యశోద రాధలు సంతృప్తిగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు – చాలదా ఈ ఆనందం మనకు అన్నట్లుగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here