[సుభాషిణి వడ్డెబోయిన గారు రచించిన ‘మనసును పూజిద్దాం..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]చి[/dropcap]నుకువే పరిచయంలో
ఊహల్లో వరదలా
సముద్రానివే కవితల్లో
బొట్టు తడవని లోకంలో
జోరుగా కురిసే మనం
ముఖపరిచయం లేకుండానే
లోతు భావాలతో
మనసు శిఖరపంచున
నలుదిక్కులా నమ్మకమే గోడలా
మాటల మేడలో మనసును పూజిద్దాం..