తెలుగు సాహిత్య వైశిష్ట్యాన్ని పట్టి చూపే ‘యోచన- లోచన’

0
4

[డా. నూనె అంకమ్మరావు రచించిన ‘యోచన – లోచన’ అనే పుస్తకాన్ని పరిచయం చేస్తున్నారు శ్రీ చలపాక ప్రకాష్‌.]

[dropcap]డా[/dropcap]క్టర్ నూనె అంకమ్మరావు గతంలో పలు కవితా సంపుటాలు, వ్యాస సంపుటాలు వెలువరించారు. ఇటీవల వెలువడిన ఈ ‘యోచన- లోచన’ సంపుటిలో ప్రచురితమైన 21 వ్యాసాలు తెలుగు సాహిత్య వైశిష్ట్యాన్ని పట్టి చూపుతాయి. పలు సాహిత్య సభల్లో, ప్రత్యేక అంశాలలో పత్ర సమర్పణ చేసినవి, పలు ప్రత్యేక సంకలనాలు, పత్రికలకు రాసి ప్రచురింపబడిన వ్యాసాల గుత్తి ఇవి.

‘తెలుగు సాహిత్యంలో పద్య మధురిమలు, తెలుగు సాహిత్యం -సామాజిక దృక్పథం, హేతువాద ప్రశంస, జానపద గేయాలు – సామాజికత, ఆంధ్రుల సాంస్కృతిక కళావైభవం, గురజాడ – దేశభక్తి – మానవతావాదం, పరిశోధనలో కొమర్రాజు, బుద్ధుడు- జ్ఞాన సిద్ధుడు, చెంచులు – ఎరుకల జీవన విధానం- వైరుధ్యాలు, ప్రకాశం జిల్లా ప్రాదుర్భావ వికాసాలు – తెలుగు మాండలికాలు’ వంటి అంశాలపై రాసిన వ్యాసాలు పాఠకుడికి ఎన్నో విశేషాలు తెలియజేస్తాయి, సాహిత్య పరిశోధకులకు ఎంతో ఉపకరిస్తాయి. కేవలం ఇటువంటి పత్ర సమర్పణలు ఆ సభలకే పరిమితం చేయకుండా ఇలా పుస్తక రూపంలో ప్రచురించడం వల్ల, భవిష్యత్ తరాలకి మన సాహిత్య వైభవం విశిష్టత తెలుసుకొనే అవకాశం కలుగుతుంది.

ఇటువంటి వ్యాసాలు ఎన్ని వచ్చినా ఇంకా పలు కోణాలలో తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. ఎవరి ప్రత్యేకత వాళ్లదే. కావ్య ప్రయోజనం అదే.

***

యోచన – లోచన
రచన: డాక్టర్ నూనె అంకమ్మరావు,
పుటలు: 142;
వెల: 100 రూపాయలు;
ప్రతులకు:
డాక్టర్ నూనె అంకమ్మరావు,
ఇంటి నెంబర్ 241, వీధి నెంబర్ 900,
బుల్లెట్ ఫోరం ముందు వీధి,
శివ ప్రసాద్ కాలనీ, కొత్త డొంక,
ఒంగోలు, ప్రకాశం జిల్లా-523002

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here