[dropcap]డా|| [/dropcap]శాంతి నారాయణ 2016 – 2017 సంవత్సరాలలో రాసిన పది కథానికల సంపుటి ‘బతుకు బంతి’. ఏడు పదుల స్వతంత్ర్యం మీద ప్రశ్నల గుర్తులే బతుకు బంతి కథలు అన్నారు. ముందుమాటలో “ఈ పది కథలను జాగ్రత్తగా చదివితే సంప్రదాయాల పేరిటగాని, ఆధునికత పేరిట గాని నష్టపోతున్న వాళ్ళూ, వంచనకు గురవుతున్న వాళ్ళూ స్త్రీలేనని శాంతి నారాయణ చిత్రించినట్టు అర్థమవుతోంది” అని రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు.
శాంతి నారాయణ ప్రశ్నించే కథలు రాయడంలో సిద్ధహస్తుడని వ్యాఖ్యానించి, ‘నష్టపోయిన, మోసపోయిన, వంచనకు గురైనవారి పక్షం వహించారు (శాంతి నారాయణ)’ అని ప్రకటించారు.
ఇందులోని కొన్ని కథల పేర్లు: ఓబయ్య, అసలయినవి లేనప్పుడు, మైల పడుతున్న మనుషులు, చన్నుకట్టు జాతర, ముట్టు గుడిసెలు, అంగడి సరుకై…
బతుకు బంతి
డా|| శాంతి నారాయణ కథలు
ధర 150 రూపాయలు
పేజీలు 166
ప్రతులకు:
ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలు,
శ్రీమతి ఆర్. విమల, 202, ఎస్, ఎస్. అపార్ట్‌మెంట్స్, మారుతీనగర్, అనంతపురం –01, ఫోన్ 9916671962