శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.
***
“మీది ఏ ఊరు?”
“ప్రస్తుతానికి హైదరాబాద్”
“మాది నెల్లూరు”
“అలాగా!”
“బిజీగా ఉన్నాను అన్నారు. మీరు సాఫ్ట్‌వేర్ ఇంజనీరేగా!”
“అవునండి! అదొక్కటే కాదు. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. ప్రస్తుతం ఓ షార్ట్ ఫిలింకి మ్యూజిక్ చేస్తున్నాను. అందుకని బిజీ.. బిజీ..”
“వావ్! గ్రేట్! మీ మ్యూజిక్ నేను వినొచ్చా!?”
“వై నాట్.. పూర్తి కాగానే పంపుతాను”
“ఇంకేంటి సంగతులు?”
“నిద్ర వస్తోందండీ”
“అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడుతుంటే నిద్రొస్తోందంటారేంటి?”
“అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, నిద్ర నిద్రే కదండీ! క్యాచ్ యు లేటర్. బై. గుడ్ నైట్” అని ఫోన్ కట్ చేశాడు.
మేఘన నిరాశగా ఫోన్ పక్కన పడేసింది.
~
త్వరలో – అతి త్వరలో –
మీ అభిమాన ‘సంచిక’లో శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ధారావాహికం ‘ఫస్ట్ లవ్’.