[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
1. చీకటి
సామంత రాజుల
చెరలో
ఆంధ్రావని
~
2. జలగ
హద్దుల్లేని
పన్నుకు
ప్రతిరూపం
~
3. కళ్లెం
గెలుపు గుర్రానికి
బలమయ్యే నువ్వు
బలవుతున్నావెందుకు
కళ్లెం ఉంది కళ్ళు తెరువు!
~
4. అజ్ఞానం
ఆరడుగుల
గోతి లోకే పోయేదని
తెలిసి తెలిసి
అరాచకాలకు పాల్పడడం