[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘ఆధ్యాత్మిక ఆనందం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఓ[/dropcap] నిజాన్ని
బలంగా ప్రేమించే కాలంలో
రాముడు ఒక ఇష్టం..
ఏ నిజాన్ని
భరించని కలికాలంలో
రాముడే ఒక కష్టం..
ఆదర్శానికి
అపవాదులను అంటగట్టిన
ఆపద వేళకు
మది మదిలో
గుడి కట్టుకున్న
ఆధ్యాత్మిక ఆనందమే
దేశ సంసృతికి
శ్రీరామరక్షను నొసగే
అయోధ్య మందిరం.