చక్రవర్తి పునరవతరణ

1
3

[శ్రీ కోవెల సంతోష్‍కుమార్ రచించిన ‘చక్రవర్తి పునరవతరణ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]యు[/dropcap]ద్ధానికి శక్యం కాని మహానగరంలో
మహారాజ చక్రవర్తి పునరవతరణం
ఒకచేత్తో ధనుస్సు.. మరో చేత్తో బాణాన్ని తిప్పుకుంటూ
విజయఘోష చేస్తున్నాడు పురుషోత్తముడు
ఇక బుల్లెట్టు ధ్వనులు వినిపించవు
ఇక సరయులో శవాలు తేలవు
ఇక రైలు బోగీలు తగులబడవు
అనవరతం జరిగేది దీపోత్సవాలే
ప్రతి దినమూ కొత్త సంవత్సరమే
ప్రతి మాటా ఆనంద పర్వమే
ప్రతి నోటా రామాయణమే
ప్రతి నదీ గంగమ్మే..
ప్రతి రాతి కణమూ శంకరుడే
ప్రతి గుండెలో ప్రతిధ్వనించేది రామ తారకమే
రావణ సంహారం తరువాత రాముడి జయనినాదం
ప్రతి మట్టి రేణువులోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నది
ఈ ప్రకంపనల నడుమ కాలుష్య ధ్వనులు
ముఖ పుస్తకాల్లో ‘కొట్టుకు’పోయాయి
శునకాలు అరిచీఅరిచీ అలసిపోయాయి
మళ్లీ ఏదో ఒక ఎముక దొరికే దాకా.. కామ్ గానే ఉంటాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here