సినిమా క్విజ్-75

0
4

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. కె.వి. రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., మాలతి, రేలంగి, ఎస్.వి.రంగారావు తదితరులు నటించిన ‘పాతాళబైరవి’ (1951) సినిమా హిందీలో కె. బాపయ్య దర్శకత్వంలో జితేంద్ర, జయప్రద, ప్రాణ్, అంజాద్ ఖాన్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  2. ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ, ఇంద్రజ, మంజుభార్గవి నటించిన ‘యమలీల’ (1994) చిత్రాన్ని హిందీలో కె. మురళీమోహన్‍రావు దర్శకత్వంలో వెంకటేష్, రవీనా టాండన్, కాదర్ ఖాన్, అస్రానీలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  3. తమిళ చిత్రం ‘కాదలిక్క నేరమిల్లై’ ఆధారంగా పి. పుల్లయ్య దర్శకత్వంలో అక్కినేని, జగ్గయ్య, కాంచన, రాజశ్రీ నటించిన ‘ప్రేమించి చూడు’ (1965) సినిమా హిందీలో సి.వి.శ్రీధర్ దర్శకత్వంలో శశికపూర్, కిశోర్ కుమార్, కల్పన, రాజశ్రీ, మెహమూద్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  4. రామ్‍గోపాల్ వర్మ దర్శకత్వంలో జె.డి. చక్రవర్తి, ఆమని, భానుచందర్‍ నటింఛిన ‘మధ్యాహ్నం హత్య’ (2004) చిత్రాన్ని హిందీలో జిజి ఫిలిఫ్ దర్శకత్వంలో అనిల్ కపూర్, సుచిత్రా కృష్ణమూర్తి, బొమన్ ఇరానీలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  5. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో సుధాచంద్రన్ నటించిన ‘మయూరి’ (1984) సినిమా హిందీలో తాతినేని రామారావు దర్శకత్వంలో సుధాచంద్రన్, శేఖర్ సుమర్‍లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  6. బాపు దర్శకత్వంలో అక్కినేని (ద్విపాత్రలు), శోభన్ బాబు, విజయ నిర్మల నటించిన ‘బుద్ధిమంతుడు’ (1969) చిత్రాన్ని హిందీలో బాపు దర్శకత్వంలో మిథున్ చక్రవర్తి, జుహిచావ్లా, అమ్రిష్ పురీలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  7. వేణు శ్రీరామ్, హృశికేశ్ భార్గవ దర్శకత్వంలో నాని, సాయి పల్లవి, భూమికా చావ్లా నటించిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ (2017) సినిమా హిందీలో షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో అభిమన్యు దాసాని, శిల్పా శెట్టి, షిర్లీ సేతియా లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  8. టి. కృష్ణ దర్శకత్వంలో విజయశాంతి, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు నటించిన ‘ప్రతిఘటన’ (1985) చిత్రాన్ని హిందీలో ఎన్. చంద్ర దర్శకత్వంలో సుజాతా మెహతా, చరణ్ రాజ్, అరవింద్ కుమార్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  9. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో హరీష్, మాలాశ్రీ, శారద నటించిన ‘ప్రేమ ఖైదీ’ (1990) సినిమా హిందీలో కె. మురళీమోహనరావు దర్శకత్వంలో కరిష్మా కపూర్ (పరిచయం), హరీష్, పరేష్ రావల్‍తో ఏ పేరుతో రీమేక్ అయింది?
  10. దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని, శ్రీదేవి, జయసుధ నటించిన ‘ప్రేమాభిషేకం’ (1981) చిత్రాన్ని హిందీలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో జితేంద్ర, రీనా రాయ్, రేఖ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 ఫిబ్రవరి 13 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 75 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 ఫిబ్రవరి 18 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 73 జవాబులు:

  1. థానేదార్ (1990) 2. లోక్ పర్‍లోక్ (1979) 3. ఫర్జ్ ఔర్ కానూన్ (1982) 4. జఖ్మీ షేర్ (1984) 5. లవ్ (1991) 6. ఫర్జ్ (1967) 7. ఆద్మీ (1968) 8. సమాజ్ కో బదల్ డాలో (1970) 9. ఖిలోనా (1970) 10. తోఫా (1984)

సినిమా క్విజ్ 73 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి. వి. రాజు
  • పి.వి.ఆర్.మూర్తి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • దీప్తి మహంతి
  • కొన్నె ప్రశాంత్
  • ఠాకూర్ ఉపేందర్ సింగ్
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here