[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘నీ ప్రేమ..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]లిగిన నా మనసుకు
సేద నీ ప్రేమ
అలిసిన నా తనువుకు
ఊరట నీ ప్రేమ
బరువైన నా హృదయానికి
భరోసా నీ ప్రేమ
విసిగిన నా ఆశలకి
ఆసరా నీ ప్రేమ
చెదిరిన నా ఆలోచనకు
ఆధారం నా ప్రేమ
చితికిన నా గుండెకు
ఆదరణ నీ ప్రేమ
నీ ప్రేమ లేనిదే నా
ఈ జీవితమే లేదు ప్రియా!