[శ్రీ సాహితి రచించిన ‘హృదయంలో మొలిస్తేనే..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ప్రే[/dropcap]మను
మనిషి కన్నా మమత పలికితే
అర్థం అమృతం..
మనిషి నాలుకపై కన్నా
మనసు గొంతుకలో వింటే
ఆ శబ్దం స్వర్గం..
పెదవిపై కన్నా
హృదయంలో మొలిస్తే
జీవితంలో ఘనం