సినిమా క్విజ్-77

0
4

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఈశ్వరరావు, మోహన్ బాబు, అన్నపూర్ణ, దాసరి నారాయణరావు నటించిన ‘స్వర్గం – నరకం’ సినిమా హిందీలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో సంజీవ్ కుమార్, జితేంద్ర, మౌసమీ చటర్జీ, షబానా ఆజ్మీలతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  2. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., జయసుధ, కాంచన, సత్యనారాయణ, మోహన్ బాబు నటించిన ‘డ్రైవర్ రాముడు’ (1979) చిత్రాన్ని హిందీలో రవికాంత్ నగాయిచ్ దర్శకత్వంలో మిథున్ చక్రవర్తి, రంజిత, శక్తికపూర్‍లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  3. క్రాంతికుమార్ దర్శకత్వంలో అక్కినేని, రోహిణి హట్టంగడి నటించిన ‘సీతారామయ్య గారి మనవరాలు’ సినిమా హిందీలో కె.వి.రాజు దర్శకత్వంలో జితేంద్ర, మౌసమీ చటర్జీ, కాజల్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  4. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్‍పుత్ నటించిన ‘RX 100’ (2018) చిత్రాన్ని హిందీలో మిలన్ లూత్రియా దర్శకత్వంలో అహన్ శెట్టి, తారా సురియా లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  5. క్రాంతికుమార్ దర్శకత్వంలో సుహాసిని, భానుచందర్, శారద, జగ్గయ్య నటించిన ‘స్వాతి’ (1984) సినిమా హిందీలో క్రాంతికుమార్ దర్శకత్వంలో శశి కపూర్, షర్మిలా టాగోర్, మాధురీ దీక్షిత్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  6. గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు, భూమిక, ప్రకాశ్ రాజ్ నటించిన ‘ఒక్కడు’ (2003) చిత్రాన్ని హిందీలో అమిత్ రవీంద్ర నాథ్ దర్శకత్వంలో అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా, మనోజ్ బాజ్‍పేయి లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  7. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సునీల్, సలోని నటించిన ‘మర్యాద రామన్న’ (2010) సినిమా హిందీలో అశ్విని ధిర్ దర్శకత్వంలో అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, జుహీ చావ్లా లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  8. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, అమీషా పటేల్, రేణు దేశాయ్ నటించిన ‘బద్రి’ (2001) చిత్రాన్ని హిందీలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తుషార్ కపూర్, గ్రేసీ సింగ్, ప్రకాశ్ రాజ్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  9. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించిన ‘అల వైకుంఠపురంలో’ (2020) సినిమా హిందీలో రోహిత్ ధవన్ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  10. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి, సుమలత, సుధాకర్ నటించిన ‘శుభలేఖ’ (1982) చిత్రాన్ని హిందీలో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రాకేష్ రోషన్, రతి అగ్నిహోత్రి, వినోద్ మెహ్రా లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 ఫిబ్రవరి 27 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 77 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 మార్చి 03 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 75 జవాబులు:

1.పాతాల్ భైరవీ (1985) 2. తక్‌దీర్‌వాలా (1995) 3. ప్యార్ కియే జా (1966) 4. మై వైఫ్స్ మర్డర్ (2005) 5. నాచే మయూరీ (1986) 6. పరమాత్మ (1994) 7. నికమ్మా (2022) 8. ప్రతిఘాత్ (1987) 9. ప్రేమ్ ఖైదీ (1991) 10. ప్రేమ్ తపస్యా (1983)

సినిమా క్విజ్ 75 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి. వి. రాజు
  • పి.వి.ఆర్.మూర్తి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • దీప్తి మహంతి
  • కొన్నె ప్రశాంత్
  • ఠాకూర్ ఉపేందర్ సింగ్
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here