ఉపయుక్తమైన పుస్తకం ‘బాలసాహితీ శిల్పులు’

1
3

[శ్రీ పైడిమర్రి రామకృష్ణ వెలువరిచిన ‘బాలసాహితీ శిల్పులు’ అనే పుస్తకాన్ని పరిచయం చేస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]బా[/dropcap]లసాహితీవేత్త, బాలసాహిత్య పరిషత్ కోశాధికారి అయిన శ్రీ పైడిమర్రి రామకృష్ణ ఓ విశిష్టమైన పుస్తకాన్ని వెలువరించారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ, ఇతర ప్రాంతాలలోనూ ఉన్న 101 మంది తెలుగు బాలసాహితీవేత్తల ఫోటో, వారి పరిచయం, వారి కృషి, చిరునామా, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్లతో కూడిన సమాచారాన్ని ‘బాలసాహితీ శిల్పులు’ అనే పేరు పుస్తక రూపంలో అందించారు.

ఈ పుస్తకంలో పాత తరం, నేటి తరం బాలసాహిత్య రచయితల వివరాలు ఉన్నాయి. ఈ పరిచయాల్లో భాగంగా బాల సాహిత్యంలో ప్రచురించబడిన వారి మొదటి రచన వివరాలతో బాటు, వారు ప్రచురించిన పుస్తకాలు, వారికి లభించిన పురస్కారాలు, వారి విద్యార్హతలు, ఉద్యోగం/వృత్తి, వారి పుట్టిన రోజు, కుటుంబ సభ్యుల వివరాలు వంటి కీలకమైన సమాచారం పొందుపరిచారు.

ఈ పుస్తకంలోని బాలసాహితీవేత్తలు (అక్షర క్రమంలో):

1.డాక్టర్ అమరవాది నీరజ 2. డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు 3. అలపర్తి వెంకటసుబ్బారావు 4. ఆకెళ్ళ వెంకటసుబ్బలక్ష్మి 5. ఆర్.సి. కృష్ణస్వామి రాజు 6. అరుపల్లి గోవిందరాజులు 7. ఉండ్రాళ్ళ రాజేశం 8. డాక్టర్ ఎం. హరి కిషన్ 9. డాక్టర్ ఎం.డి. సౌజన్య 10. ఎం.వి.వి. సత్యనారాయణ 11. ఎన్.వి.ఆర్. సత్యనారాయణ మూర్తి 12. ఎన్నవెళ్లి రాజమౌళి 13. ఐతా చంద్రయ్య 14. ఓట్ర ప్రకాష్ రావు 15. కలువకొలను సదానంద 16. కన్నెగంటి అనసూయ 17. కల్లూరి రాఘవేంద్రరావు 18. కిలపర్తి దాలినాయుడు 19. కూచిమంచి నాగేంద్ర 20. కె.కె. రఘునందన 21. కె.వి. రామదాస్ 22. కె.వి. లక్ష్మణరావు 23. కైపు ఆదిశేషారెడ్డి 24. కొల్లూరు స్వరాజ్యం వెంకటరమణమ్మ 25. కోనే నాగ వెంకట ఆంజనేయులు 26. కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి 27. కోలపల్లి ఈశ్వర్ 28. కందర్ప మూర్తి 29. డాక్టర్ కందేపి రాణీప్రసాద్ 30. కంచనపల్లి వేంకట కృష్ణారావు 31. కంతేటి చంద్రప్రతాప్ 32. గరిపెల్లి అశోక్ 33. గీతా సుబ్బారావు 34. గుడిపూడి రాధికారాణి 35. గుర్రాల లక్ష్మారెడ్డి 36. గుడ్ల అమ్మాజి 37. డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ 38. చొక్కాపు వెంకటరమణ 39. చొప్ప వీరభద్రప్ప 40. టి.వి. రామకృష్ణ 41. డి.కె. చదువులబాబు 42. డి.వి.ఆర్. భాస్కర్ 43. డోకల సుజాతాదేవి 44. డాక్టర్ తాటిచర్ల గురురామప్రసాద్ 45. తిరునగరి వేదాంతసూరి 46. డాక్టర్ తిరుమలశ్రీ 47. తురగా జానకీరాణి 48. తుంబలి శివాజీ 49. డాక్టర్ దార్ల బుజ్జిబాబు 50. డాక్టర్ దాసరి వెంకటరమణ 51. దూరి వెంకటరావు 52. డాక్టర్ దేవరాజు మహారాజు 53. నరిశేపల్లి లక్ష్మీనారాయణ 54. నారంశెట్టి ఉమామహేశ్వరరావు 55. పట్రాయుడు కాశీ విశ్వనాధం 56. డాక్టర్ పత్తిపాక మోహన్ 57. సాయల సత్యనారాయణ 58. పుట్టగుంట సురేష్ కుమార్ 59. పుప్పాల కృష్ణమూర్తి 60. పెండెం జగదీశ్వర్ 61. ప్రతాపురం రామానుజాచారి 62. ప్రతాప రవిశంకర్ 63. బి. మాన్సింగ్ నాయక్ 64. బి.వి. పట్నాయక్ 65. బూర్లె నాగేశ్వరరావు 66. బెలగాం భీమేశ్వరరావు 67. బెహరా ఉమామహేశ్వరరావు 68. డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు 69. డాక్టర్ భూపాల్ 70. మళ్ళ ధర్మరాజు 71. మాదుగుండు కృష్ణ 72. మాచిరాజు కామేశ్వరరావు 73. మీగడ వీరభద్రస్వామి 74. ముంజులూరి కృష్ణకుమారి 75. మేకల మదన్ మోహన్ రావు 76. యు. విజయశేఖర రెడ్డి 77. డాక్టర్ రావూరి భరద్వాజ 78. డాక్టర్ రావెళ్ళ శ్రీనివాసరావు 79. రెడ్డి రాఘవయ్య 80. రంగనాధ రామచంద్రరావు 81. వసుంధర 82. వడ్డేపల్లి వెంకటేష్ 83. వాణిశ్రీ 84. వాసాల నరసయ్య 85. డాక్టర్ వాసరవేణి పర్శరాములు 86. వియోగి 87, డాక్టర్ వి.ఆర్. శర్మ 88. వులాపు బాలకేశవులు 89. వురిమళ్ళ సునంద 90. డాక్టర్ వెలగా వెంకటప్పయ్య 91. డాక్టర్ వేదగిరి రాంబాబు 92. శాఖమూరి శ్రీనివాస్ 93. శారదా అశోకవర్ధన్ 94. శాంతా భాస్కర్. టి 95. డాక్టర్ శివ్వాం ప్రభాకరం 96. షేక్ అబ్దుల్ హకీం జాని 97. షేక్ హున్నూర్ 98. సరికొండ శ్రీనివాసరాజు 99. సమ్మెట ఉమాదేవి 100. సంగనభట్ల చిన్నరామకిష్టయ్య 101. డాక్టర్ సిరి

ఒక్కో రచయితకి ఒక్కో పేజీ కేటాయించి వారి వివరాలు సమగ్రంగా అందించే ప్రయత్నం చేశారు రామకృష్ణ.

ఇప్పటి పిల్లలు తమకి పరిచయం ఉన్న బాల సాహితీవేత్తలను, నేటి పెద్దలు – ఒకనాటి బాలలు – చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర, బుజ్జాయి, బొమ్మరిల్లు వంటి పిల్లల పుస్తకాల్లో చదివిన కథకులను గుర్తు చేసుకుని అలనాటి మధుర స్మృతులను తలచుకోవచ్చు.

ఎంతో విలువైన సమాచారం పొందుపరిచిన ఈ పుస్తకం చక్కని రిఫరెన్స్ బుక్‍లా ఉపకరిస్తుందనడంలో సందేహం లేదు. పైడిమర్రి రామకృష్ణ గారి కృషి ప్రశంసనీయం.

***

బాలసాహితీ శిల్పులు
రచన: పైడిమర్రి రామకృష్ణ
ప్రచురణ: నాదర్‍గుల్ ప్రచురణలు
పేజీలు: 112, వెల: ₹ 200/-
ప్రతులకు:
పైడిమర్రి రామకృష్ణ,
ఇంటి నెంబరు 9-86/1,
శ్రీ కృష్ణ టెంపుల్‌ పక్కన, నాదర్‌గుల్‌ – 501510,
బాలాపూర్‌ మండల్‌, రంగారెడ్డి జిల్లా,
హైదరాబాద్‌, తెలంగాణ.
మొబైల్‌ నెంబర్: 92475 64699

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here