[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
1. శత్రువు
అధికారానికి
ధిక్కారం
తొలి శత్రువు
~
2. దీపం
భయం గుప్పెట్లో మనం
మన గుండెల్లో
ఆకర్షణ వలయం
వెలిగిన దీపం
భయం చీకటిని చీల్చింది
~
3. పుట్టుక
సంయోగ వియోగాల
సమ్మేళనం
పరిమళమే
పుట్టుక పరమార్థం
~
4. పుట్టిల్లు
క్రోధం
కోర్కెల దాహం
అశాంతికి పుట్టిల్లు