[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్.టి.ఆర్., కాజల్ అగర్వాల్ నటించిన ‘టెంపర్’ (2015) సినిమా హిందీలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణవీర్ సింగ్, సోనూ సూద్, సారా ఆలీఖాన్, అజయ్ దేవగన్‍లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
- చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో జగపతి బాబు, ఛార్మి నటించిన ‘అనుకోకుండా ఒక రోజు’ చిత్రాన్ని హిందీలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవగన్, ఆయేషా టకియా లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- శ్రీకాంత్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., సావిత్రి, రామ్మోహన్, కాంచన నటించిన ‘తల్లిప్రేమ’ (1968) సినిమా హిందీలో కె. బాపయ్య దర్శకత్వంలో జితేంద్ర, మిథున్ చక్రవర్తి, జయప్రద, పద్మినీ కొల్హాపురి లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
- పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు, ఇలియానా, బ్రహ్మానందం నటించిన ‘పోకిరి’ (2006) చిత్రాన్ని హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, ఆయేషా టకియా లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కృష్ణ, శారద, శ్రీదేవి నటించిన ‘ఖైదీ రుద్రయ్య’ (1986) సినిమా హిందీలో కె. బాపయ్య దర్శకత్వంలో మిథున్ చక్రవర్తి, శ్రీదేవి, మౌసమీ చటర్జీ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
- కోడి రామకృష్ణ దర్శకత్వంలో వెంకటేష్, విజయశాంతి, కోట శ్రీనివాసరావు నటించిన ‘శత్రువు’ (1990) చిత్రాన్ని హిందీలో కె. మురళీమోహన్ రావు దర్శకత్వంలో సంజయ్ దత్, రవీనా టాండన్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున, నూతన తార గిరిజ నటించిన ‘గీతాంజలి’ (1989) సినిమా హిందీలో దీపక్ ఆనంద్ దర్శకత్వంలో ఆదిత్య పంచోలి, రుక్సర్ రహమాన్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
- తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్, అనిత నటించిన ‘నువ్వు నేను’ (2001) చిత్రాన్ని హిందీలో తేజ దర్శకత్వంలో తుషార్ కపూర్, అనిత లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, రిచా, సుమన్, సుహాసిని నటించిన ‘లీడర్’ (2010) సినిమా హిందీలో సయ్యద్ అహ్మద్ ఫజల్ దర్శకత్వంలో జాకీ భగ్‍నాని, నేహా శర్మ, ఫారుక్ షేక్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
- బి. భాస్కరరావు దర్శకత్వంలో కృష్ణంరాజు, జయసుధ నటించిన ‘ధర్మాత్ముడు’ (1983) చిత్రాన్ని హిందీలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో జితేంద్ర, రాజీవ్ కపూర్, జయప్రద లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 మార్చి 05 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 78 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 మార్చి 10 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 76 జవాబులు:
1.ఖైదీ (1984) 2. సర్ఫరోష్ (1985) 3. శక్తి: ది పవర్ (2002) 4. జుడ్వా(1997) 5. శిక్ష (1979) 6. శివ (1990) 7. సింఘాసన్ (1986) 8. సుల్తాన్ (2000) 9. సునెహ్రా సంసార్ (1975) 10. సంతాన్ (1976)
సినిమా క్విజ్ 76 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- జి. స్వప్నకుమారి
- దీప్తి మహంతి
- కొన్నె ప్రశాంత్
- కె. లోకేష్
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]
[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]