[box type=’note’ fontsize=’16’] చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అమల జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కుని, మోసపోయి, తప్పటడుగు వేయబోయినా… మళ్ళీ సన్మార్గంలో నడిచి ఎందరికో ఆదర్శంగా నిలిచిన వైనాన్ని”అమల విజయం” అనే పద్యరూపంలో చెబుతున్నారు జె.బి. తిరుమలాచార్యులు. [/box]
[dropcap]సి[/dropcap]గ్గు బుగ్గుల చేరు సరికే
తల్లి దండ్రులు దూరమాయిరి
వెలుగు తోవను నిసియు కమ్మిను
అమల తల్లికి నిప్పుడున్
ఒక్కగానొక కూతు విడచీ
నింగి కేగిన అమ్మనాన్నల
తలచి కుమిలెడి అమల నేలనొ
అంటి నంటదు లోకమే
వయసు పూచెను పున్నమందం
ఒకడు చూపెను స్నేహగంధం
జీవితమ్మును నిత్తుననియెను
మాయ మాతల పేటులన్
పెళ్ళి పీటలు సిద్ధమాయెను
పొంగిపోయెను పెళ్ళికూతురు
నాదు బతుకే బంగరమ్మని
ఉల్లసిల్లను మల్లెయై
తల్లి ఆయెను పొంగిపోయెను
పొద్దు గుంకెను నిదుర పోయెను
ఆడపిల్లని తెలిసి పెనిమిటి
వదలి వెళ్ళెను ఎచటికో
భయము పొందెను భీతి చెందిన
రాయి నడిగెను రప్పనడిగెను
జగతి నందు ఒంటరాయెను
నింగి పూవగు ఆశతో
బిడ్దనెత్తుకు తిరుగుచుండెను
బిచ్చ మెత్తుకు తిరుగుచుండెను
దయను కాంచని కథను నాయిక
వేశ్యగా మారెన్
ఊరి చివర పూరి గుడిసెను
కందు నుంచెను గడప దాటెను
తనువు నమ్మగ చూచుచుండగ
ఏడు ఊచలు బిగిసెనె
బిడ్డ గుర్తుకు వచ్చు చుండెను
గడ్డ కట్టెను పాల రొమ్ములు
బతిమి లాడిన వదల రాయను
తీర్పు ముంగిట నాపిరి
ఖైదు చేయుడు ఐదు దినములు
బుద్ధి కుదురని పలికె తీర్పరి
అంత నమలయె తల్లడిల్లెను
తల్లితనమును తలచుచున్
నన్ను విడిచిన పాప ఆకలి
విన్నవించెను అంజలించెను
కరుణ కలిగిన న్యాయ పతియే
బోధ చేసీ వదలె పో
పరుగు పరుగున గుడిసె కేగీ
బిక్క చచ్చిన పట్టి చూచీ
పాలు కుడిపీ పడుపు పనినే
విసిరి గొట్టెను వేకువై
వద్దు నా వలె ఎవ్వరచును
ఛిద్రమై చితుకుతున్న బతుకుల
దీప మెట్టగ నుద్యమించెను
దీక్ష నాభిని దోపుచున్
పడుపు డబ్బుల కాశపడుతూ
ఏడ్సు రోగపు బారిపడుతూ
కన్నవారికి దుఃఖమెందుకు
ఈయవలెననియెన్
మాటలాడెను పాట పాడెను
ధైర్యమిచ్చెను తోవ చూపెను
వెఱ్ఱి కాంతిని ఆర్పివేసెను
చీకటుల్ తఱిమెన్
వేశ్య వృత్తిని తూల నాడెను
మగువ బలిమిని ఎరుక జేసెను
తాను మారెను గారవమ్మున
జనత మెచ్చంగన్
పరవశమ్మున ప్రజలు వచ్చిరి
పరిమళమ్మున సభను కూర్చిరి
బిరుదులాదికి బిరుదు నిచ్చిరి
“నారి శక్త”ను చున్
ముందు సంకెల వేసినట్టీ
నరుల రక్షక భటులె యప్పుడు
తనను మొక్కగ ఉబ్బి తబ్బెను
తన తనయ తలనే నిమురుచున్