[శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘చెట్టు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]భూ[/dropcap]మి పై నిటారుగా నిల్చొన్న
అవని కన్న అందమైన రూపం
వనిలో ఊరిలో దారిలో అంతటా
కనిపించే భూలోక బంధువు వృక్షం
దారిన పోయేవారికి చల్లని నీడ
ఆకలి గొన్న వారికి తియ్యని ఫలం
ప్రతి ఫలమాశించక ఇచ్చే తరువు
ధరణి పై కల్ప తరువు ధ్రుమము
ప్రకృతి సమతుల్యతను కాచి
గాలి వీచి వర్షాలు కురిపించే
కర్షకుల పాలిట ప్రత్యక్ష దైవం
పచ్చని చెట్టు పక్షులకు ఆటపట్టు
గొడ్డలితో నరకి తన దేహమును
చీల్చినా పళ్ళెత్తు మాట ఆడని
పరమ సాధువు కదా ఫలవృక్షము
స్వార్థ మానవుడి కోసం బలిదానం
చెట్టంత చెట్టు కూలిపోయినా
కన్నీరు పెట్టడు దుష్ట మానవుడు
వాడు చచ్చినా దహనానికి తన
దేహమునిచ్చు దయామయి చెట్టు