[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. రాజశేఖరుడు, సత్యవతి, చంద్రమతి గార్ల చరిత్రలు వ్రాసిన రచయిత గారి ఇంటిపేరు (4) |
4. ప్రస్తుత తెలుగు మాసం తరువాతి మాసం, తపోనుకూలమైనది (4) |
7. పెద్ద దోస మొక్క (5) |
9. సమవర్తి (3) |
11. ఒక దేశస్థుడు/ఒక భాష (3) |
13. బుద్ధదేవుడు (2) |
14.స్ఫటిక శిలా భేదము (3) |
16. తోకలేని మొసలి (2) |
17. శస్త్రవిద్యాదక్షుడు (3) |
18. దోచుకోబడిన సొమ్ము (3) |
19. కొర్రు (2) |
20. చక్కని రూపం (3) |
22. తిరగబడిన స్వప్నం (2) |
24. యుక్తాయుక్త పరిజ్ఞానంతో (3) |
26. సరాసరి (3) |
27. శ్రీచందనము (5) |
30. శ్రీకృష్ణుని పొట్టలో సారా ఉందేమిటీ? (4) |
31. విష్ణువును తనలో నింపుకున్న రాగం – అటునించి ఆలాపించండి (4) |
నిలువు:
1. సంవత్సరమునందు జ్యేష్ఠము మొదలు నాలుగేసి మాసముల కాలము (4) |
2. కాచిన కలి (3) |
3. తలక్రిందులైన వృద్ధుడు (2) |
4. వాదము (2) |
5. నేర్పు – కాస్త అడ్డం 14 లాగానే వినిపిస్తుంది (3) |
6. త్రిపురములు (4) |
8. పుర్రె (3) |
10. కాంతం కథల సృష్టికర్త (5) |
12. తెలుగు టమోటా (5) |
14. మిక్కిలి పల్లమైన నేల (3) |
15. కలుసుకో (3) |
19. లోకసంబంధము కానిది (4) |
21. పప్పు బియ్యము కలిపి వండిన అన్నము (3) |
23. చేదు సొరకాయ (4) |
25. చదరంగంలో చివరలేని ఆటకట్టు (3) |
26. నవ్వు అటుఇటు అయిపోయింది (3) |
28. తొలుత కురచనైన పధ్ధతి (2) |
29. తీరము (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 మార్చి 12 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 105 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 మార్చి 17 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 103 జవాబులు:
అడ్డం:
1.హ్రీ 2. పదివేలకు 7. మే 8. పిలువని పేరంటం 10. ముదిత 12. నలువ 14. ఊరక 16. క్తము 17. ళ్లుక 18. కక్ష్య 19. రిపువు 21. పాక 22. కోకిలాదేవి 24. ఆప 25. జలం 27. కాంచనపల్లి కనకమ్మ
నిలువు:
2.పలు 3. దివము 4. వేనిదిక 5. లపేత 6.కురం 9. మానసికము 11. వికటకవి 13. వక్త 14. ఊక 16. మురికి 17. ళ్ళువుదే 20. పులా 22. కోపన 23. విజన 24. ఆచ 26. లంక
సంచిక – పద ప్రతిభ 103 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి. బృందావన రావు
- దేవగుప్తాపు ప్రసూన
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
- కర్రి ఝాన్సీ
- కరణం రామకుమార్
- కాళిపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి కస్తల
- పి.వి. రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]