సిరివెన్నెల పాట – నా మాట – 34 – జీవితాన్ని సుసంపన్నం చేసుకోమనే పాట

0
3

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

ముసుగు వెయ్యొద్దు మనసు మీద

~

చిత్రం: ఖడ్గం

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

గానం: కల్పన

~

పాట సాహిత్యం

పల్లవి:
ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో @2
ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా మనసు చెప్పిందే మనకు వేదం కాదనేవారే లేరురా మనకు తోచిందే చేసి చూద్దాం ఎవడు ఏమంటే ఏంటిరా ॥ ముసుగు వెయ్యద్దు॥

చరణం:
సూర్యుడైనా చూపగలడా రేయిచాటున్న రేపుని చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దనీ
పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని
దేవుడెనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ
ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళముందుండగా అందుకోకుండా ఆగిపోతూ ఉసూరు మంటే ఎలా
ఈ ఉడుకూ ఈ దుడుకూ ఈ వెనక్కి తిరగని పరుగు ఉండదుగా కడవరకూ ఈ వయస్సునిలాగే కరిగిపోనీకు ॥ ముసుగు వెయ్యద్దు ॥

చరణం:
కొంత కాలం నేలకొచ్చాం అతిథులై వుండి వెళ్ళగా కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా నిన్నలేవైనా గురుతుకొస్తే తీపి అనిపించనీ ఉన్నకొన్నాళ్ళు గుండెనిండా సరదాలు పండించనీ నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలసి నడుద్దాం సావాసం సంతోషం ఇవి అందించి అందర్లో నవ్వు నింపుదాం ॥ ముసుగు వెయ్యద్దు ॥

‘ఊ అంటావా మామ, ఊహూ అంటావా..’ అన్న  ఐటమ్ సాంగ్ ఈ మధ్య యువతను ఉర్రూతలూగించింది. చలనచిత్రం ఉన్నదే కాలక్షేపం కోసం, ఆనందం కోసం, మరి ఇలాంటి పాటలు అలరిస్తే ఆశ్చర్యం ఏముంది? సినిమాలలో కథ నేపథ్యానికి సంబంధించినవి కొన్ని, కమర్షియల్ సక్సెస్ కోసం (అసందర్భోచితమైనా) యుగళగీతాలు కొన్ని, మార్కెటింగ్ కోసం ఐటెం సాంగ్స్ కొన్ని కలిపి సినిమా పాటల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి.

ముంబై చిత్రరంగ పరిభాషలో, యాసలో ‘ఐటెం’ అంటే ‘సెక్సీ ఉమన్’, అని అర్థం. అందుకే ఐటెం సాంగ్ అంటే, sensual pleasure కోసం, దానికి అనుగుణమైన సాహిత్యంతో, భంగిమలతో ప్రదర్శించే ఒక provocative song అని అర్థం. సినిమా విడుదలకు ముందే హల్చల్ సృష్టించడానికి ఉద్దేశించిన పాట ఇది. ఆ పాట బీట్ hot గా వుంటూ, పదజాలం, మ్యూజిక్, catchy గా ఉంటూ, నవరసాల్లో అలాంటి రసాన్ని అనుభవించాలనుకునే స్థాయి ప్రేక్షకులకు, తగిన ఆనందాన్ని ఇస్తూ, ఊపేస్తూ ఉంటుంది.

An item song, by definition “is a big budget song and dance number” that often features a popular heroine and is released in order to generate buzz surrounding the release of a film. It’s a marketing tool that’s used to get people talking about the movie before it’s released in theatres.

ఐటెం సాంగ్స్ ను విశ్లేషిస్తే వారి దుస్తులు, నగలు, మేకప్, శరీర కదలికలు, హావభావాల ప్రదర్శన రెచ్చగొట్టే తరహాలో ఉంటూ మహిళలు లైంగికంగా ఆబ్జెక్ట్ చేయబడుతున్నారని మనకు అర్థమవుతుంది. ఇలాంటి ఐటెం గర్ల్స్‌ను ముద్దుగా, ‘Sizzling Beauties’, అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు.

బాలీవుడ్‌లో మొదటి ఐటెం సాంగ్‌గా, తరచుగా, 1954లో విడుదలైన ‘ఆర్ పార్’ చిత్రంలో నటి వైజయంతిమాల ప్రదర్శించిన, ‘బాబూజీ ధీరే చల్నా’ పాటగా పరిగణిస్తున్నారు. ఈ పాట భారతీయ చలనచిత్రంలో ‘ఐటెమ్ నంబర్’ తొలి ఉదాహరణలలో ఒకటిగా భావిస్తున్నారు.

ఇలాంటి పాటలకు నృత్యాన్ని ప్రదర్శించే తారలను Item Girls అని పిలుస్తారు. సినిమాలలో మనకు Item Boys కూడా కనిపిస్తారు. ఒక ఐటెం గర్ల్ ప్రధాన భూమికగా,  పెద్ద బృందంతో ఇలాంటి పాటల  చిత్రీకరణ జరుగుతుంది. పాత సినిమాలలో మనకు హలం, జయమాలిని, జ్యోతిలక్ష్మి, విజయలలిత వంటి ప్రత్యేక డాన్సర్లు ఈ పాటలకు డాన్సులు చేస్తూ ఉండేవారు.

సినిమా కమర్షియల్ సక్సెస్ కోసం ఎంటర్టైన్మెంట్ చిత్రాల్లో నూటికి నూరు శాతం ఒక ఐటమ్ సాంగ్ మనకు తప్పనిసరిగా కనిపిస్తుంది. కాకపోతే ఈ మధ్య బాగా పేరు పొందిన హీరోయిన్‌లు తమ ‘special appearance’ తో ఇలాంటి పాటలకు మరింత గుర్తింపు పెంచుతున్నారు. ఇక ఈ పాటల్లో వినిపించే సాహిత్యం గురించి ఒకసారి చర్చిద్దాం. ముందుగా అలనాటి ఐటెం పాటల సాహిత్యాన్ని గమనిద్దాం.

~

//నాలోన వలపుంది.. నీలోన వయసుంది హా
ఈ రేయెంత సొగసైనదీ.. ఆచార్య ఆత్రేయ – బంగారు కలలు..
// ఆడదాని ఓరచూపుతో, జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్@2 నిజానికి జిగేలని, వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్, ఆరుద్ర- ఆరాధన
// వయసుకుర్రది, ఐసు చేస్తది.. – టక్కరి దొంగ చక్కని చుక్క..
//మసక మసక చీకటిలో.. మల్లె తోట వెనకాల, మాపటేళ కలుసుకో.. నీ మనసైనది దొరుకుతుంది.. నీ మనసైనది దొరుకుతుంది.. దొరుకుతుంది.., ఆరుద్ర- దేవుడు చేసిన మనుషులు
// తీస్కో కోకకొలా.. వేస్కో రమ్ముసార.. చూస్తే మజా.. గుటకేస్తే నిషా.. కలిపికొట్టు మొనగాడా.., ఆరుద్ర- రౌడీలకు రౌడీలు

లాంటి పాటలు అప్పటికి, ఎంతో ఉత్తేజితంగా ఉండేది. వేటూరిలాంటి మేటి కవులు కూడా ‘వంగతోట వలపు కాడ’, ‘ఆ! అంటే అమలాపురం’.. వంటి లెక్కకు మిక్కిలి శృంగార సాహిత్యాలను తెలుగు తెరకు అందించారు.

ఈ ఐటెం సాంగ్స్‌లో చాలావరకు శృంగారపరమైన సాహిత్యం, కొన్ని పాటల్లో నేరుగా బూతు ప్రయోగం,  మరికొన్ని పాటల్లో symbolic గాను సాహిత్యం మనకు కనిపిస్తుంది. జీవన తరంగాలు చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ రచించిన ఈ పాటలో మనకు వేదాంత తత్వం కూడా ప్రతిబింబిస్తుంది. ఇలాంటి పాటల కూడా ఈ సాహిత్యంలో అక్కడక్కడ, మనకు దొరుకుతాయి.

~

నందామయా గురుడ నందామయా
ఉందామయా తెలుసుకుందామయా
నందామయా గురుడ నందామయా
ఉందామయా తెలుసుకుందామయా

మెరిసే సంఘం మేడిపండు
దాని పొట్ట విప్పి చూస్తే పురుగులుండు
మెరిసే సంఘం మేడిపండు
దాని పొట్ట విప్పి చూస్తే పురుగులుండు
ఆ కుళ్ళు లేని చోటు ఇక్కడే..
కుళ్ళు లేని చోటు ఇక్కడే అనుభవించు రాజా ఇప్పుడే
ఆనంద సారం ఇంతేనయా ఆనంద సారం ఇంతేనయా
ఆనంద సారం ఇంతేనయా ఆనంద సారం ఇంతేనయా..

~

తన పాటలకు ఒక సాంఘిక ప్రయోజనం ఉండాలనీ, తన పాటలలో అశ్లీలాన్నీ, బూతును ప్రయోగించకూడదనీ, తెలుగు చిత్ర గీతాలకు సాహితీ విలువలు దిగజారకుండా చూడాలనీ, కంకణం కట్టుకున్న సిరివెన్నెల, ఇటువంటి ఐటెం సాంగ్స్ రాసే అవకాశం వచ్చినప్పుడు కూడా తన దృక్పథాన్ని మార్చుకోలేదు. తను చెప్పాలనుకున్న సిద్ధాంతాన్నీ, వేదాంతాన్నీ ఎక్కడైనా సరే, ‘స్పేస్ తీసుకుని’, పాటలోకి చూపించగల సిద్ధహస్తుడు ఆయన. మనసుకు కళ్ళాలు వేయొద్దనీ, కలలను బంధించకూడదనీ, ఎవడి ఆనందం అనుభవం వాడిదే కాబట్టి మనసుకు తోచినట్టు నడుచుకుంటూ ఆనందించాలనీ, చక్కటి ప్రబోధాన్ని పాట పల్లవిలో మనకు అందిస్తున్నారు.

ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో @2
ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా మనసు చెప్పిందే మనకు వేదం కాదనేవారే లేరురా మనకు తోచిందే చేసి చూద్దాం ఎవడు ఏమంటే ఏంటిలా ॥ముసుగు వెయ్యద్దు॥

Speak the Language of your Heart అనే poemలో.. Practicia.A.Fleming కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Each day we wake is such a gift;
No moment’s guaranteed.
Tomorrow isn’t promised,
But to fate we must concede.
We cannot know our futures,
How long or short our lives.
We simply do the best we can
Until the end arrives.

సూర్యుడైనా చూపగలడా రేయిచాటున్న రేపుని చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దనీ
పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని
దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ
ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళముందుండగా అందుకోకుండా ఆగిపోతూ ఉసూరు మంటే ఎలా
ఈ ఉడుకూ ఈ దుడుకూ ఈ వెనక్కి తిరగని పరుగు ఉండదుగా కడవరకూ ఈ వయస్సునిలాగే కరిగిపోనీకు ॥ముసుగు వెయ్యద్దు॥

‘అంతా బావుంటే, సంతోషం అనే మాటకు అర్థం లేదు. దీపానికి విలువ చీకటి పడినప్పుడే, సంతోషానికి, చిరునవ్వుకి ఉనికి ఎప్పుడంటే చుట్టూ సమస్యల చీకటి వలయంలా అల్లుకున్నప్పుడు, ఆ చీకటి వలయాన్ని ఛేదించడానికి దీపంలా వినియోగించుకోవడానికే’, అని నమ్ముతారు సిరివెన్నెల. అవమాన భయాన్నీ వ్యతిరేక పరిస్థితుల్ని ఎదుర్కోలేని మనస్థితిని నిరసిస్తూ, వ్యక్తిలోని ఆత్మ విశ్వాసం పెంపొందించే లక్ష్యంతోనూ జీవితంలోని వాస్తవ పరిస్థితులను స్వీకరించడం ఎలాగ?  అనేది చెప్పడం కోసం ఈయన కలం నిరంతరం తహతహలాడింది.‌ అలాంటి ఉద్దీపనే మనకు ఈ పాటలో కూడా కనిపిస్తుంది.

జీవితం మనకు ఎన్నో అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయినా మనం అందని వాటిని, కోల్పోయిన వాటిని గురించి దుఃఖిస్తూ చేతిలో ఉన్న జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. పిరికితనంతో జీవితపయనంలో వెనక పడిపోతున్నాం. అలాంటి వాటి నుండి బయటపడి, అందిన అవకాశాలతో జీవితాన్ని సుసంపన్నం చేసుకోమంటారు సిరివెన్నెల.

దాదాపు ఇదే రకమైన ప్రతిపాదనను మనం Louis… పోయెమ్‌లో చూడవచ్చు.

Embrace who you are,
And love like a fool.
Try not to judge,
And never be cruel.
Hold your head high,
And never look back,
Give all you can,
And never hold back.
Laugh like a clown,
And cry like the rain…

కొంత కాలం నేలకొచ్చాం అతిథులై వుండి వెళ్ళగా కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా నిన్నలేవైనా గురుతుకొస్తే తీపి అనిపించనీ ఉన్నకొన్నాళ్ళు గుండెనిండా సరదాలు పండించనీ నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలసి నడుద్దాం సావాసం సంతోషం ఇవి అందించి అందర్లో నవ్వు నింపుదాం ॥ముసుగు వెయ్యద్దు॥

Life is too short to be lived,
Life is too short to be wasted as well,

అతిథులుగా ఈ భూమి మీదకు వచ్చిన వాళ్ళం మనం. అందుకే, కనపడే ఆస్తులు ఎన్ని పెంచుకున్నా, కోటలైనా, కొట్టాలైనా.. చివరికి మనది అస్థికల రూపమే. ఈ విషయాన్ని మనం గుర్తించగలిగితే, మన జీవితం ఆనందమయం చేసుకుంటాం. కాసిన్ని తీపి గుర్తుంది పోగేసుకుంటాం. గతాన్ని మధురంగా మలుచుకుంటాం. భవిష్యత్తును ఆనందంగా ఊహించుకుంటాం. సహనంతో జీవితాన్ని సాగిస్తూ, స్నేహ బంధాన్ని పెంచుకుంటూ, సరదాల్ని పండించుకోమనీ, ఈ చిన్ని జీవితాన్ని అద్భుతంగా మలుచుకోమని మనకు ఉద్బోధిస్తున్నారు సిరివెన్నెల. అందరిని కలుపుకొని పోతూ, ఆనందాన్ని అందించమనీ, నలుగురితో కలిసి నడవమనీ, జీవిత సత్యాన్ని గుర్తెరిగి బ్రతకమనీ, ఈ పాట మనకు సందేశమిస్తుంది.

Practicia.A.Fleming, అందించే ఈ సందేశం కూడా తోడుగా అందుకుందాం.

Live in the moment,
Just take it all in.
Pay attention to everything,
Right there and right then.
……….
Live life to its fullest,
And have a reason for everything,
Even if it’s totally insane.
Find your purpose in life,
And live it!

సిరివెన్నెల తరంగాలు’, అనే తన స్వీయ రచనలో, తాను రాసిన పాటల్ని, వివిధ విభాగాల్లోకి పొందుపరిచారు సిరివెన్నెల. ఆశాంతరంగంలో వచ్చే పాటలలో తన జీవిత దృక్పథం స్పష్టంగా తెలుస్తుందనీ, భావ తరంగంలో తానొక కవిగా ఆవిష్కరించుకున్నాననీ, కల్లోల తరంగం విభాగంలో తన చుట్టూ ఉండే పరిస్థితుల్లో తన మనసు యొక్క రియాక్షన్ పలికించాననీ, ఈ ఆశాంతరంగం తన తాలూకు Philosophic Outlook of Life కు ప్రతిబింబమని సిరివెన్నెల చెప్పారు. ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద’, అనే పాట మనకు ఆ పుస్తకంలో, ఆశాతారంగం అనే విభాగంలో కనిపిస్తుంది.

క్లబ్బు సాంగుల్లో కూడా మబ్బుల్ని తాకే ఉత్తమమైన సాహిత్యాన్ని అందించగలగడం ఆయన ఘనత. ఐటెం సాంగులకు కూడా కాషాయం కట్టించగల నేర్పరి ఆయన. అమృతం లాంటి ఆ సాహిత్యాన్ని విభిన్న కోణాల్లో, విభిన్న విభాగాల్లో, విభిన్న విధానాల్లో అందుకుని ఆనందించడమే మనకు మిగిలిన పని. తనివి తీరా సాహిత్యాన్ని ఆస్వాదిద్దాం.

Images Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here