[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోహన్ బాబు, మీనా, రమ్యకృష్ణ నటించిన ‘అల్లరి మొగుడు’ (1992) సినిమా హిందీలో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో గోవిందా, టబూ, కరిష్మా కపూర్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
- కె. విశ్వనాథ్ దర్శకత్వంలో శోభన్ బాబు, వాణిశ్రీ నటించిన ‘జీవన జ్యోతి’ (1976) చిత్రాన్ని హిందీలో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో జితేంద్ర, జయప్రద లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- దాసరి నారాయణ రావు దర్శకత్వంలో సుజాత, సురేష్, దాసరి నారాయణ రావు నటించిన ‘సూరిగాడు’ (1992) సినిమా హిందీలో దాసరి నారాయణ రావు దర్శకత్వంలో జితేంద్ర, మౌసమీ చటర్జీ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
- ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో (దర్శకుడిగా మొదటి సినిమా) రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించిన ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ (1993) చిత్రాన్ని హిందీలో టి.ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో మిథున్ చక్రవర్తి, ఆదిత్య పంచోలీ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో ఉదయ్ కిరణ్, రీమా సేన్ నటించిన ‘మనసంతా నువ్వే’ (2001) సినిమా హిందీలో తలత్ జానీ దర్శకత్వంలో తుషార్ కపూర్, కరీనా కపూర్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
- ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వర రావు, జమున, శోభన్ బాబు నటించిన ‘పూల రంగడు’ (1967) చిత్రాన్ని హిందీలో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రణధీర్ కపూర్, బబిత లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- ఎ. మురుగదాస్ దర్శకత్వంలో చిరంజీవి, త్రిష నటించిన ‘స్టాలిన్’ (2006) సినిమా హిందీలో సోహైల్ ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, టబూ, డేనీ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
- సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలినీ పాండే నటించిన ‘అర్జున్ రెడ్డి’ (2017) చిత్రాన్ని హిందీలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో షాహిద్ కపూర్, కైరా అద్వానీ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- బి. గోపాల్ దర్శకత్వంలో అక్కినేని, నాగార్జున, శారద, రజని నటించిన ‘కలెక్టర్ గారబ్బాయి’ (1987) సినిమా హిందీలో బి. గోపాల్ దర్శకత్వంలో దిలీప్ కుమార్, నూతన్, సంజయ్ దత్, మాధురీ దీక్షిత్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
- సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ, ఇలియానా నటించిన ‘కిక్’ (2009) చిత్రాన్ని హిందీలో సాజిద్ నడియాద్‍వాలా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 మార్చి 26 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 81 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 మార్చి 31 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 79 జవాబులు:
1.మేరే సప్నోంకీ రాణీ (1997) 2. మేరీ బీవీ కా జవాబ్ నహీ (2004) 3. మిత్రోఁ (2018) 4. మిస్టర్ అండ్ మిసెస్ ఖిలాడీ (1997) 5. ముద్దత్ (1986) 6. ముఝే కుఛ్ కెహనా హై (2001) 7. ముఝ్‍సే ఫ్రెండ్‌షిప్ కరోగే (2011) 8. ముల్జిం (1988) 9. ముకాబలా (1993) 10. ముస్కురాకే దేఖ్ జరా (2010)
సినిమా క్విజ్ 79 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి. రాజు
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- వనమాల రామలింగాచారి
- జి. స్వప్నకుమారి
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]
[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]