[21 మార్చ్ – ప్రపంచ కవిత్వ దినోత్సవం సందర్భంగా ఈ కవిత రాశారు ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు.]
[dropcap]ప[/dropcap]సి పాప ఏడుపులో
ఆలి అరుపులో
అమ్మ పిలుపులో
పారే ఏరులో
వీచే గాలిలో
ఉరిమే మేఘాలలో
కురిసే వానలో
కవాతు చేసే జవాన్
నడకలో
కర్షకుని పాటలో
కార్మికుల పనిలో
ఎక్కడ లేదు కవిత్వం
సత్యభామ అలక
కృష్ణుడి వేడుక
అవతరించింది
అజరా కవితగా
అల్లసాని వరూధిని
సినారె లకుమ
నండూరి యెంకి
విశ్వనాథ కిన్నెర
కవులకు చిక్కి
అయ్యారు చరితార్థులు
కవిత్వం ఒక మత్తు
దానికి చిక్కితే
అవుతారు చిత్తు చిత్తు