[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.
టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. బులాకి (4) |
3. బోర్లపడని పసిబిడ్డ (5) |
6. ఏకమొత్తం, ఖరారు (2) |
7. తల (2) |
8. ఏనుగు దంతాలకు వేసే పొన్ను, పిడికిలి (4) |
10. నమూనాగా తీసుకొనుట (3) |
12. వస, ఒక మందు దినుసు (3) |
13. అటుగా వచ్చిన స్నేహితుడు (3) |
15. వైకుంఠం (3) |
18. గట్టు, సమీపం (2) |
20. అటు నుండి వచ్చిన ఇలవేల్పు (5) |
23. మేలు కోరి చేసే వ్యక్తి (4) |
24. అమంగళమైన మాట (3) |
26. తాళం (3) |
27. చెవి కమ్మ (2) |
28. మోకాలు (2) |
32. బోయ, ఎరుకలవాడు (4) |
33. తప్పిదం (4) |
నిలువు:
1. సున్నిపిండి (4) |
2. పొలం కాపలా కాసే తలారి (3) |
3. శ్రేష్ఠమైనది (4) |
4. బావ, సోదరి భర్త (4) |
5. బాణం, రెల్లు (2) |
9. లక్క (3) |
11. మత్తు కలిగించే ద్రవం (3) |
14. చివరకు (3) |
16. తిరుగులేని మాట (4) |
17. ఆజ్ఞ, ఉపదేశం (4) |
19. మూర్ఛ, సొమ్మసిల్లడం (4) |
21. ఎండిపోవు (4) |
22. నువ్వులు అటుగా ఏకవచనంలో (2) |
25. గురజాడ వారి కథానిక (4) |
29. దూది ఏకే కొయ్య పనిముట్టు (2) |
30. గుర్రాన్ని నడిపించేవాడు (2) |
31. ఎడమ, వామ (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2024 ఏప్రిల్ 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక ఏప్రిల్ 2024 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 మే 2024 తేదీన వెలువడతాయి.
ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో సంప్రదించగలరు. వారి ఈమెయిల్ ఐడి: ramalingaihtadikonda@gmail.com