[dropcap]అ[/dropcap]తనో సైన్స్ లెక్చరర్.
అతనో సామాజిక కార్యకర్త.
ఓ రచయిత, జర్నలిస్ట్, నాటక రంగ కళాకారుడు.
రేడియో అంటే పిచ్చి. ఆకాశవాణిలో వార్తలు చదవడమే కాదు, నాటికలు రూపకాలను రాసి శ్రోతలను ఆకట్టుకున్న ఘనుడు.
వెబ్ సైట్స్ లో వందలాది వ్యాసాలతో ఫాలోయిర్స్ పెంచుకున్న చతురుడు.
టివీ మీడియాలో అవార్డులు, రివార్డుల మోత మోగించిన ‘మీడియా గురు’.
సోషల్ మీడియాలో ఎంటరై సొంత ఛానెల్ పెట్టి 90 ఏళ్ళ తెలుగు సినిమాకు ఘనంగా పట్టాభిషేకం చేయించిన వి‘చిత్ర’ దర్శకుడు.
మంచిమాట – మనసులోని మాట అంటూ తెలుగు సినిమా పాత పాటలను గుర్తు చేసుకుంటూ మురిసిపోయిన సంగీత అభిమాని.
ఉద్యోగుల సంఘాలలో కీలక పదవుల్లో ఉంటూ తోటివారి కష్టసుఖాలు ఎరిగి సాయం చేసిన సున్నిత మనస్వి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత తెలుగు భాషారత్న జీవన సాఫల్య పురస్కారం అందుకున్న భాషాభిమాని.
విదేశాల్లో సైతం తెలుగు ప్రసంగాలు, రచనలతో చైతన్యం కలిగించిన దీపిక.
ఘనాపాటిగా ఎదిగిన తుర్లపాటి నాగభూషణ రావు ‘జీవన సాఫల్య యాత్ర’ విశేషాలను ‘సంచిక’లో వారం వారం అందించబోతున్నాము.
***
త్వరలో.. అతి త్వరలో
తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర