[శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘కాలం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]భూ[/dropcap]త వర్తమాన భవితలు
కాలానికి మూడు కోణాలు
భూత కాలం తలచుకుంటే
భూతంలా వెంటాడుతుంది
నా మది తలుపులు తడుతుంది
వర్తమానం అస్తమానం అదుగో
అంటూ భవిత వైపు చూపిస్తుంది
నా నీడలా ఉన్నా నాకు చిక్కకుంది
గోడలా ఎదురుగ అడ్డంగా ఉంది
ఇక భవిత కలల కవితలు పాడుతుంది
ఆకాశంలో చందమామలు ఒక
వంద చూపిస్తుంది అందుకో అంటుంది
ఈ మూడు కోణాల బాణాలు గుచ్చుకుంటాయెప్పుడూ