సంచిక విశ్వవేదిక – శబ్ద-అక్షర ఆవిర్భావం – ఒక అసంపూర్ణ ఊహ!

0
2

[సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా ‘శబ్ద-అక్షర ఆవిర్భావం – ఒక అసంపూర్ణ ఊహ!’ అనే రచనని అందిస్తున్నారు శ్రీ సారధి మోటమఱ్ఱి.]

Of late, the whole of Telugu Friends’ walls are filled with discussion on Music (or its sanctity vs. literature, character vs. artistic abilities etc ..).

Several thoughts have been lingering in my mind for decades, I believe, to trace the emergence and hermeneutic evolution of music, language and literature and I hope one day I will find some time from my current over-saturated teaching workload to key down and step-into the complex world!

In the meantime, I would like to share some points, I have jotted on my diary in 2011.

శబ్దం.. శబ్దం నుంచి సృష్టి జరిగిందన్నారు, మన మహా మహర్షులు. అందుకే శబ్దాన్ని పరబ్రహ్మ స్వరూపం అన్నారు. భౌతికవాద ప్రకారంగా, సృష్టి, ‘మహా విస్పోటమ్’ లేదా Big Bang నుంచి ఆవిర్భవించిదంటుంది. మరి విస్పోటమ్ జరిగినప్పుడు శబ్దం రాదా? అ శబ్ద స్వభావం ఏమిటి? బహుశా దానిని వీక్షించిన మంత్రదక్షులు అయిన మహర్షులు, ‘ఓం కారం’ సృష్టికి మూలమని దర్శించి, మనకు చెప్పి ఉండవచ్చు!

సంగీతానికి మూలమైన శబ్దం, పలు విధాలుగా మానవాళిని రంజింప చేసిన పిదప, ఆది మానవుడు, తనకున్న పరిజ్ఞానముతో, వాయిద్యాలు అనబడే వాటిని సృష్టించుకొని, వాటిని, నిర్ణీత పద్ధతిలో వాయిస్తూ, విచిత్ర రీతులలో మిళితం చేస్తూ, ‘సంగీతం’ ఆవిర్భావానికి పునాది వేసిన పిదపనే, అక్షరం, మాట, పాటలతో కూడిన భాష లేదా భాషలు వికసించి ఉండాలి. సంస్కృతం, తెలుగు ఆదిగా భాషలు, శబ్దమునకు అనుగుణంగా: “పలికినది- వ్రాయగలగాలి; వ్రాసినది- పలుక గలగాలి” అనే ప్రాతిపదికపై, ‘మాట, ఉచ్ఛారణ, లిపి’ అనే మూటితో అత్యున్నత స్థాయికి పరిణితి చెంది ఉండాలి.

భాషలో అంతర్లీనమైన సంగీతాన్ని, మూలమైన శబ్దాన్ని ఆవిష్కరింపచేసే ప్రక్రియలే కవితారీతులు: పాటలు, పద్యాలు. సందేశాన్ని అందచేయడం ఒక ప్రధాన లక్షణమైన భాషకు, అంతర్లీనంగా ఉన్న సంగీతాన్ని, తదనుగుణంగా శబ్దాన్ని తిరిగి అందించగల సామర్ధ్యాన్ని, భాష, ఛందస్సుల ద్వారా మనకు అందించారు, మనకు భాషను అందించిన మహర్షులు! ఇక్కడ మహర్షులు అని అంటే అతీత శక్తులు అనికాదు, అతీత దూరదృష్టి, అతి సూక్ష్మదృష్టి అనియే!

పద్యంలో ఒక నడక ఉందని, ఆ నడక వెనుక, శబ్దాన్ని, సంగీతాన్ని, సృజించగల సత్తా ఉందని, మన వాఙ్మయంలో ఏక్కడ చెప్పి ఉండకపోవచ్చు. లేదా మానవాళి, దానవాళిగా నర్తించిన చీకటి క్షణాల్లో, భస్మీపటలమైన సాహిత్య సంపదలో మనం కోల్పోయి ఉండవచ్చు.

(సశేషం)

Some Bing Generated Images of Big Bang, Emergence of Sound and Om

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here