[ఏప్రిల్ 10 ‘ప్రపంచ హోమియోపతి దినోత్సవం’ సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు కొమ్మలూరు ప్రణవి.]
[dropcap]హో[/dropcap]మియోపతి వైద్య విధాన పితామహుడు హానిమాన్. క్రిస్టియన్ ఫ్రెడ్రెరిక్ శామ్యూల్ హానిమన్ జర్మనీలో 1755 ఏప్రిల్ 10వ తేదీన జన్మించాడు. హానిమాన్ పుట్టిన రోజు ఏప్రిల్ 10 వ తేదీని ప్రపంచ హోమియోపతి దినోత్సవంగా జరుపుకుంటారు.
హానిమాన్ మొదట అల్లోపతి డాక్టర్. ఆయన మొదట అల్లోపతి వైద్య విధానంలో వైద్యం చేసేటప్పుడు అదే జబ్బుతో మళ్ళీ మళ్ళీ పేషెంట్ రావడం చూసి చాలా బాధపడ్డాడు. ఈ అల్లోపతి వైద్య విధానంలో ఎక్కడో ఎదో పొరపాటు జరుగుతోంది అని ఆలోచించాడు. ఈ విధానం కేవలం జబ్బులకే మందులు ఇస్తున్నాం కానీ అది వచ్చే వ్యక్తులను దృష్టిలో పెట్టుకోవడం లేదని కనిపెట్టాడు. ఎంతో ధైర్యంతో సింకోనా బార్క్ అనే ములిక ద్వారా స్వయంగా తయారు చేసిన మందును తనపైనే ప్రయోగించుకున్నాడు. ఆ ప్రయోగం విజయవంతమయి మలేరియాకు ఒక కొత్త విధానంలో మందును కనిపెట్టగలిగింది. తను కనిపెట్టిన ఈ హోమియోపతి విధానం ద్వారా తన బంధువులు, మిత్రుల సహకారంతో 99 మందులను ప్రయోగించి కనుగొన్నాడు.
వ్యక్తిని బట్టి మందు:
హోమియోపతి విధానంలో శరీర తత్వాన్ని బట్టి మందు ఇస్తారు. వ్యాధి ఒకటే అయినా వ్యక్తిని బట్టి మందులు ఇస్తారు. హోమియోపతిలో చాలా రకాల మందులు ఉన్నాయి. అల్లోపతి వైద్య విధానంలో లాగా ఒకే జబ్బుకు ఒకే మందు ఉండదు. అల్లోపతి విధానంలో డోసేజ్ మాత్రమే మారుస్తారు. కానీ హోమియోపతిలో సింప్టమాటిక్ ఆధారంగా శారీరక, భౌతిక, మానసిక అంశాలను బట్టి మందులను మారుస్తారు. అంతేకాదు ఒకే మందును వివిధ వ్యక్తులకు వివిధ వ్యాధుల నివారణలో కూడా ఉపయోగిస్తారు.
హోమియోపతి విధానం నిదానం కాదు:
చాలా మందికి ఒక అపోహ ఉంది. హోమియోపతి చాలా నిదానంగా పనిచేస్తుందని. అంది నిజం కాదు. అక్యూట్ కేసులలో తొందరగా ట్రీట్మెంట్ చేయడానికి హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయి. అయితే ఎక్కువగా అల్లోపతి విధానంలో వాడి తగ్గకుండా పోయిన క్రానిక్ డిసీజెస్‌కే ఎక్కువ మంది హోమియోపతికి వస్తారు. అటువంటి క్రానిక్ డిసీజెస్‌కు వైద్యం ఎక్కువ కాలం పడుతుంది. అంతేకానీ హోమియోపతి స్లో మెడిసన్ కాదు.
శాశ్వత పరిష్కారం:
వ్యాధులు రెండు రకాలు. మెడికల్ మరియు సర్జికల్. మెడికల్ వ్యాధులకు హోమియోపతిలో శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. వివిధ వైద్య విధానాలలో జీవితకాలమంతా మందులు వేసుకోవాలి. లేకపోతే ప్రమాదం. కానీ హోమియోపతి ఆ వ్యాధి మూలాన్ని కూడా తీసివేసి శాశ్వత పరిష్కారం చూపిస్తుంది.
సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు:
చేస్తే మంచి చేయి కానీ చెడు చేయకు అనేది నానుడి హోమియోకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే హై యాంటీబయోటిక్స్ వాడటం వల్ల మన శరీరంలో బ్యాక్టీరియా చనిపోయినా వైరస్, ఫంగస్ వంటివి వాటి ద్వారా ఇన్ఫెక్షన్ కలగవచ్చు. శరీరంలోని ఇతర భాగాలు, రక్తకణాలు దెబ్బతినవచ్చు. లేదా మందులకు అలవాటు పడిన ఆ బ్యాక్టీరియా మరింత బలపడవచ్చు. కానీ హోమియోపతి విధానంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వ్యాధికి కారణమైన దానిని గుర్తించి దానిని మాత్రమే నాశనం చేస్తుంది.
నేడు ప్రపంచ వ్యాప్తంగా అనేకమందికి హోమియోపతి వైద్య విధానం ద్వారా వ్యాధులకు పరిష్కారం లభిస్తోంది. దీనికి కారణమైన హోమియోపతి పితామహుడు హానీమన్‌కు మనమెంతో ఋణపడి ఉన్నాము.