[ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు రచించిన ‘ఎంత కాలం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఎం[/dropcap]త కాలం
ఇంకెంత కాలం
నీటి గోస రైతుకు
తిండి తిప్పలు
పేదోడికి
ఎంత కాలం
ఇంకెంత కాలం
దోపిడీ దొంగల పాలన
ఎంత కాలం
ఎంత కాలం
పెరిగే ధరల దెబ్బ
ఎంత కాలం
ఎంత కాలం
ఉన్నోడి పెత్తనం
ఎంత కాలం
ఎంత కాలం
పేదోడి బతుకు
ఉన్నోడికి అర్పితం
ఎంత.. కాలం?
ఎంత.. కాలం?
ఇంకెంత కాలం
అన్నార్తుల.అరుపులు
దిక్కు లేని బతుకులు