[డా. కె. ఎల్. వి. ప్రసాద్ రచించిన ‘జీవచ్ఛవాలు..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]పి[/dropcap]ల్లలపై
ప్రేమలేనిదెవరికి!
పిల్లలను ప్రేమించని
తల్లిదండ్రులుంటారా?
అయితే
ప్రేమంటే
గారాబం అవుతుందా?
గారాబాన్ని
ప్రేమగా జమకట్టవచ్చా?
చిక్కంతా –
ఇక్కడే ఉంది సుమా..!
గారాబం
ప్రేమగా భావించే పెద్దలు ..
మితిమీరిన గారాబాన్ని
పిల్లలకు ఆపాదించి,
వాళ్ల అల్లరిని
అనందంగా ప్రేరేపించి
ఆనక – పిల్లలు
పట్టాలు తప్పిన బళ్ళుగా
మారినప్పుడు..
కూతురిని –
అదుపుచేయలేక,
కొడుకు విచిత్ర వేషాలను
నియంత్రించలేక..
బయటికి చెప్పుకోలేక
మూగజీవాలై –
జీవచ్ఛవాల్లా బ్రతుకుతున్న
తల్లిదండ్రులెందరో..!
హద్దులుమీరిన
ప్రేమ – గారాబం..
ఎప్పటికీ ప్రమాదమే సుమా!!