[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘కాలం కొత్తగా..!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]కా[/dropcap]లానికి అంతా కొత్తే
పాత లేనే లేదు
రావడమే తప్ప
ఆగడం అంత కంటే లేదు
వచ్చే కాలం అని
ముచ్చట పడేలోగా
జారి పోయే కాలమవుతుంది
అనంతమైన కాల గమనమది
అందులో మునకేయడమే మన విధి
కాలం చేసే మాయాజాలం
అర్థం చేసుకోవడం కష్టం
మనిషి ఇందులో బిందువు కూడా కాడు
నిన్నా నేడు రేపూ అనుకుంటూ
ముందుకు సాగడమే చేయగలడు