[dropcap]కొ[/dropcap]న్ని దశాబ్దాలుగా, సిడ్నీలో శ్రీరామ నవమి పురస్కరించుకొని (బుధవారం, 17-ఏప్రియల్-24), శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలు, పలు సాంస్కృతిక, మరియు భక్త సమూహాల ఆధ్వర్యములో, గుడులలో గాని, సాంస్కృతిక సత్రాల్లో గాని జరగడం పరిపాటి. సాధారణంగా , ఈ కార్యక్రమాలు శ్రీరామనవమి రోజునే, జరిగే అవకాశం తక్కువ, ఎందుకంటే, స్వదేశంలోలాగా, మన పండుగలకు సెలవు దినాలు ఉండవు కదా. అంతేకాదు, సంవత్సరం మొత్తానికి ఒక 10 దినాలు ప్రభుత్వ సెలవులు ఉంటాయి. అందుచేత మన పండుగలకు దగ్గరలోని శని, ఆదివారాలలో నిర్వహించడం సర్వసాధారణం. అందుచేత, మన పండుగలు, శని, ఆదివారాల్లో వస్తే, ఎంతో ఆనందం, ప్రవాసులు అందరికీ. సింగపూర్లో, మన దీపావళి ఒక సెలవు దినం!
ఈ సంవత్సరం, నాకు అందిన సమాచారం మేరకు, మూడు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తునారు. అందు శ్రీ సాయిబాబా గుడిలోని కార్యక్రమము, ఆదివారం 14-ఏప్రియల్-2024 తేదీన నిర్వహించారు. వాటి వివరాలు, శ్రీమతి భారతి గారు అందించారు. మిగతా రెండు కార్యక్రమాలు, ఒకటి జియ్యర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారి తరపవున శనివారం 20-ఏప్రియల్ తేదీన, మరొకటి శ్రీ శ్రీనివాస శర్మ కొల్లూరి గారి ఆధ్వర్యంలో ఆదివారం 21- ఏప్రియల్ తేదీన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల ఆహ్వాన పత్రాలు క్రింద పొందుపరిచాను.