[శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘శల్య సింహాసనం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. ]
[dropcap]ఊ[/dropcap]రి చివర గుడిసెలో
ఊపిరి పోసుకుందో శిశువు
రాజ మందిరమున వెలసె
రాచ బిడ్డగ వేరొకరు
పెరిగి పెద్దవారగుచు పెనుగులాట
ఆకలి తీరుట ఒకని ఆరాటం
అధికారము కోసం ఒకని పోరాటం
జీవిత గమ్యంలో తారతమ్యం
మనిషి జన్మనెత్తిన జీవులంతా
మరు భూమిని మరచిపోతారు
చివరి శ్వాస వరకు కొట్టుకుంటారు
ఆశ చావదు కాని శ్వాస ఆగును కదా
కడకు కాలుని పిలుపు అందుకొని
కాష్టమునకు చేరతారు ఇరువురు
భేద భావము లేదు మృత్యు దేవతకు
ఇద్దరినీ ఎక్కించు శల్య సింహాసనం