[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘స్వేచ్ఛా విహారివి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]ఓ[/dropcap] నా మనసా
పరుగు తీయకే
పరువు తీయకే
చేదైనా తీపే
వగపైనా వలపే
బాధైనా హాయే
కల అయినా నిజమే
వూహనైన ఆహా అంటావు
లేవు కదా రేపూ, మాపు
అసలుందా ముందు చూపు
స్వేచ్ఛా విహారివి
సకల లోక సంచారివి
మాయల మారివి
మారని దారివి
మనిషిలోనే వుంటూ
అతనికే ద్రోహం
చేయడం నీకే సాధ్యం
అనాదిగా ఇదేగా
నీ నిత్య కృత్యం