[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘నిరీక్షణ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ప్రి[/dropcap]యా..!
నా హృదయపు అంచులలో
నీ జ్ఞాపకాల దొంతరలు
తొణికిసలాడుతూ..
నా మస్తిష్క నాడులలో
నీ ప్రతిరూపం
ఊగిసలాడుతూ..
నను వీడిన క్షణాలు
అణువణువునా
నను వెంటాడుతూ..
ఏమౌతానో తెలియని
నిరాశ, నిస్పృహలలో
కొట్టుమిట్టాడుతూ…
నీ తియ్యని పిలుపుకై
క్షణమొక యుగంలా
గడిపేస్తూ..
నీ ధ్యాసతో, నీ ధ్యానంతో
కాలం గడుపుతూ..
నీకై, నీ రాకకై
ఆశల పల్లకిలో
ఊహల ఊయలలో
మరలా వస్తావని
ఎదురు చూస్తూ..
నా ఈ నిరీక్షణ..!