సినిమా క్విజ్-87

0
3

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

పరభాషల నుండి డబ్ చేయబడ్డ తెలుగు చిత్రాలపై ప్రశ్నలు.

ప్రశ్నలు:

  1. భారతీరాజా దర్శకత్వంలో కమల్ హాసన్, రాధ, రేవతిలు నటించిన ‘ఒరు కైదియిన్ డైరీ’ (1985) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  2. హరి దర్శకత్వంలో సూర్య, ఆసిన్, ప్రభుదేవా, నాసర్ నటించిన ‘వేల్’ (2007) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  3. పి. నీలకంఠన్ దర్శకత్వంతో ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి, నంబియార్ నటించిన ‘తిరుదతే’ (Thirudathe 1961) చితాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  4. బి. ఆర్. పంతులు దర్శకత్వంలో శివాజీ గణేశన్, పద్మనిలు నటించిన ‘వీర పాండ్య కట్టబొమ్మన్’ (1959) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  5. ఎం. భాస్కర్ దర్శకత్వంలో 1978లో వచ్చిన ‘భైరవి’ చిత్రంలో రజనీ కాంత్, శ్రీప్రియ, వై. విజయ నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు? (ఈ చిత్రం తెలుగులో హిట్ అయింది.)
  6. అట్లీ దర్శకత్వంలో విజయ్, నయనతార, వివేక్ నటించిన ‘బిగిల్’ (2019) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  7. రాజీవ్ మీనన్ 2000లో అజిత్, మమ్మూట్టి, అబ్బాస్, టబు, ఐశ్వర్య రాయ్ లతో తీసిన ‘కండుకొండైన్ కండుకొండైన్’ చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  8. కృష్ణ దర్శకత్వంలో సూర్య, భూమిక, జ్యోతిక నటించిన ‘సిల్లును ఒరు కాదల్’ (2006) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  9. టి.ఆర్ రఘునాథ్ దర్శకత్వంలో ఎం.జి. రామచంద్రన్, ఎస్.ఎస్. రాజేంద్రన్, భానుమతి, పద్మినిలు నటించిన చిత్రం ‘రాజా దేసింగ్’ (1960) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  10. దర్శకుడు మణిరత్నం హిందీలో షారుఖ్ ఖాన్, మనీషా కొయిరాలా, ప్రీతిజింటాలతో తీసిన ‘దిల్ సే’ (1998) చిత్రం తెలుగులో ఏ పేరున డబ్ అయింది?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 మే 07 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 87 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 మే 12 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 85 జవాబులు:

1.అనుమానం (1961) 2. శభాష్ పిల్లా (1959) 3. మహాదేవి (1958) 4. విరిసిన వెన్నెల (1961) 5. అమావాస్య చంద్రుడు (1981) 6. వీరఖడ్గం (1951) 7. మూఢ నమ్మకాలు (1961) 8. బాషా (1995) 9. ప్రేమలేఖ (1996) 10. 24 (2016)

సినిమా క్విజ్ 85 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి. రాజు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • సునీతా ప్రకాష్
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here