అద్వైత్ ఇండియా-7

0
4

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[సీత అద్వైత్ బొమ్మ గీసి, కింద ‘నా వాడు’ అని రాసుకుని దాచుకుంటుంది. ఆ బొమ్మని వాళ్ళమ్మ వసుంధర్ చూసి, నరసింహశాస్త్రికీ, సావిత్రికి చూపించి, వాళ్లకి పెళ్ళి చేయమని అడుగుతుంది. సీతకి ఇష్టమే అని తేలింది కాబట్టి, అద్వైత్‍కి కూడా ఇష్టం ఉంటే, పెళ్ళి జరిపిద్దామని పెద్దలు నిర్ణయించుకుంటారు. ఆ ప్రాంతంలోని సంపన్న కుటుంబమైన్ రామిరెడ్డి కాశీ వెళ్ళదలచి, నరసింహశాస్త్రి కుటుంబాన్ని తమతో రమ్మని ఆహ్వానిస్తారు. అది 1921 సంవత్సరం మాఘమాసం. మహాశివరాత్రి ఉత్సవాన్ని శివాలయంలో నరసింహశాస్త్రి ఘనంగా జరిపిస్తారు. సీత, ఆండ్రియాల నృత్యప్రదర్శన జరుగుతుంది. సాయంత్రం కార్యక్రం ముగిసాకా, ఇంటికి వెళ్తారు ఆండ్రియా, ఇండియాలు. కాసేపయ్యాక, భారతీయ స్త్రీలా తయారై, సుల్తాన్‍ను వెంటబెట్టుకుని గుడి ప్రాంగణానికి బయల్దేరుతుంది ఇండియా. వస్తున్నప్పుడు దారిలో సుల్తాన్‍తో తెలుగులో మాట్లాడుతూ – తన తండ్రి రాబర్ట్ మీద అతని అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. తన తండ్రి చెడ్డవాడనీ, తన గురువు నరసింహశాస్త్రి, అద్వైత్ మంచివారని అంటుంది. రాత్రి జాగరణ సందర్భంగా, అద్వైత్, రాఘవ తదితరులు అనేక భక్తిగీతాలు ఆలపిస్తారు. ఇండియాను చూసి అసూయ పడుతుంది సీత. సావిత్రి ముచ్చట పడుతుంది. తెల్లవారుతుండగా, లేచి నరసింహశాస్త్రి అనుమతి తీసుకుని బయల్దేరుతుంది ఇండియా. కారుని నది ఒడ్డుకు పోనీమని సుల్తాన్‍కి చెబుతుంది. కాసేపు ఇద్దరూ కారులోనే కూర్చుని మాట్లాడుకుంటారు. ఆంగ్లేయులకీ, భారతీయులకీ ఉన్న మౌలికమైన తేడాను తెలుసుకుంటుంది. కాసేపయ్యకా, ఇద్దరూ నదిలో స్నానం చేస్తారు. ఈలోపు అద్వైత్, రాఘవ, పాండురంగలతో అక్కడికి వచ్చిన నరసింహశాస్త్రి సుల్తాన్ ద్వారా జరిగినది తెలుసుకుని, ఇండియాని ఆశీర్వదిస్తారు. ఇంటికి వెళ్ళిన ఇండియాపై కేకలు వేస్తాడు రాబర్ట్.  ఎనిమిదిన్నరకి రమ్మని చెప్పి సుల్తాన్‍ని పంపేస్తాడు. – ఇక చదవండి.]

అధ్యాయం 13:

[dropcap]అ[/dropcap]ది 1922వ సంవత్సరం…

ఆశ్వీయుజమాసం. ఇంగ్లీషు నెల అక్టోబర్. దేవీ నవరాత్రులు. యావత్ భారతదేశపు హైందవులు.. జగన్మాతను అత్యంత శ్రద్ధాభక్తితో ఆరాధించే పర్వదినములు,

నరసింహశాస్త్రి శ్రీమహాలక్ష్మమ్మ ఆలయంలో తొలి రోజున సాయంత్రం ఆరుగంటలకు శాస్త్రయుక్తంగా కలశమును అమర్చి.. దేవీ సహస్రననామార్చన కుంకుమ పూజను ప్రారంభించారు. మాతా ఆరాధన తొమ్మిది రోజులు ఎంతో ఘనంగా జరిగింది. ఆ ప్రాంతపు ప్రజలు ఆలయానికి వచ్చి మాతను దర్శించి, తీర్థ ప్రసాదాలను ఆరగించి ఎంతో ఆనందంగా వారివారి నిలయాలకు వెళ్ళేవారు.

నరసింహశాస్త్రిగారికి కుమారుడు అద్వైత్.. చెల్లెలి తనయుడు పాండురంగశర్మ భక్తిశ్రద్ధలతో ప్రక్కన కూర్చొని నరసింహశాస్త్రిగారి అనంతరం వారు.. అష్టోత్తర శతనామావళిని రాగలయబద్ధంగా పలుకుతూ.. పరవశంతో మాత చరణాలపై కుంకుమార్చనను చేసేవారు. ప్రతిరోజూ ఇండియా ఆలయానికి వచ్చి వారు చేసే పూజా విధానాన్ని ఆశ్చర్యంతో చూచేది.

ఆ రోజున.. కలశ నిమజ్జనకు ముందు జరగవలసిన పూజా విధానాన్ని సక్రమంగా నరసింహశాస్త్రిగారు కొడుకు అల్లుడితో నిర్వహించారు. నివేదనలు జరిగిన తర్వాత.. ఉద్వాసన మంత్రోచ్చారణ ముగిసిన తదనంతరం.. నరసింహశాస్త్రి కలశమును వుంచిన వెండి పళ్ళాన్ని తన చేతుల్లోకి తీసుకొన్నారు. రెడ్డిరామిరెడ్డిగారు.. ఆ ప్రాంతపు ఇతర పెద్దలు.. ఆడా మగా పిల్లలు, నరసింహశాస్త్రి.. వారి ప్రక్కన కుమారుడు అల్లుడు కొందరు బ్రాహ్మణులు నడువగా.. మిగతా వారంతా వారి వెనుకన నడక ప్రారంభించారు.

నిత్యనిష్ఠాగరిష్ఠుడు.. సత్యాన్నే పలికేవాడు.. అందరి మేలు కోరేవారు.. అర్చనా పూజా ఆరాధనా విధానాల మీద ఎంతో నమ్మకం.. దైవం మీద భక్తి శ్రద్ధలు, భయం, గౌరవం, ప్రేమ, అభిమానం కలవారు నరసింహశాస్త్రిగారు. తన కూతురు ఇండియా చెప్పిన మాటలను విని నమ్మిన.. ఆండ్రియా ఇండియాతో కలిసి ఆ గుంపులో ముందుకు నడవసాగింది.

ఇండియా చూపులు తన గురువుగారైన నరసింహశాస్త్రి గారిపైన.. వారి ప్రక్కనే వున్న అద్వైత్ మీద వున్నాయి. వారంతా ఆలయాన్ని చుట్టి.. వీధివైపున వున్న ద్వారాన్ని దాటి వీధిలో ప్రవేశించారు.

నరసింహశాస్త్రి ముఖంలో ఎంతో గాంభీర్యం.. ముఖానికి శరీరానికి చెమట పట్టింది. అడుగులు తడబడుతున్నాయి. కళ్ళు మూతలు పడ్డాయి.

“రేయ్!.. మీరంతా నన్ను ఎంతో గొప్పగా.. నాకు పరమానందం కలిగేలా నన్ను సేవించారా.. నాకు ఎంతో ఆనందంగా వుందిరా!.. ఎంతో ఆనందంగా వుంది.. ఎంతో ఆనందంగా వుంది” ఆవేశంగా.. నరసింహశాస్త్రి నోటి నుండి వెలువడిన ఆ మాటలను విని.. అందరూ.. ఆశ్చర్యంతో నిలబడిపోయారు.

ఆ సమయంలో నరసింహశాస్త్రిగారికి వారివురికి ఎరక లేదు. తొమ్మిది రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో వారు నిర్వహించిన పూజలకు సంతసించి.. మాత వారిని ఆవహించింది. ఆ మాటలను పలికింది. జరుగుతున్నది ఏదీ నరసింహశాస్త్రికి తెలియదు.

నవరాత్రుల పూజలు ముగిసిన తర్వాత కలశాన్ని గోదావరీ నదిలో నిమజ్జనం చేయడం వారి ఆచారం.. ఆ కార్యాన్ని ముగించేటందుకే వారంతా బయలుదేరింది. కానీ.. నరసింహశాస్త్రిగారికి స్పృహ లేదు. కళ్ళల్లో కన్నీరు.. కళ్ళు తెరవబడి లేదు. మనిషి తూలిపోతున్నాడు.

‘అమ్మ నరసింహశాస్త్రి గారిని ఆవహించింది..’ అని అనుకొన్నారు అందరూ.

‘గణాచారి.. గణాచారి.. మహాలక్ష్మమ్మ గణాచారి..’ అని అనుకొన్నారు కొందరు.

అందరి వదనాల్లో భయాందోళనలు రేకెత్తించింది నరసింహశాస్త్రిగారి ఆ అసాధారణ రూపం.. ఆ మాటల వలన. తూలిపోతున్న నరసింహశాస్త్రిగారిని.. అద్వైత్, పాండురంగ పట్టుకొని ముందుకు నడిపించారు. జనం అంతా ఆశ్చర్యంతో మౌనంగా వారి వెనకాల నడిచారు.

కర్నల్‌ని కలసి మాట్లాడి రాబర్ట్ ఇంటికి చేరాడు. పనిమనిషి వారికి ఆండ్రియా ఇండియా మహాలక్ష్మమ్మ గుడికి వెళ్ళారని చెప్పింది.

ఆ మాటలను వినగానే రాబర్ట్‌కు అలవిమాలిన కోపం.. ఆవేశం.. వేగంగా వచ్చి కార్లో కూర్చున్నాడు. “సుల్తాన్!.. కారును గుడి దగ్గరకు పోనీ..” అన్నాడు.

సుల్తాన్ అతని ముఖంలోకి కొన్నిక్షణాలు చూచి కారును స్టార్ట్ చేశాడు.

‘ఆ తల్లీకూతుళ్ళు మానవతావాదులు. వీడు మానవులను చంపి తినే రాక్షసుడు. ఆ ప్రాంతానికి యీ రాక్షసుడి ప్రవేశం.. ఆవేశం.. ఫలితం ఎలా వుంటుందో!..’ అనుకొన్నాడు సుల్తాన్.

ముందుకు సాగివస్తున్న మాతా నిమజ్జన బృందాన్ని వారి కారు సమీపించింది. సుల్తాన్ కారును దారికి ప్రక్కగా నిలిపాడు.

ఆవేశంతో రాబర్ట్ కారు దిగాడు. అతని రాకను గమనించిన ఆండ్రియా ఇండియా అతన్ని సమీపించారు.

“వాట్ ద హెల్ యు టు ఆర్ డూయింగ్ హియర్..” కసిగా అడిగాడు రాబర్ట్ భార్య ముఖంలోకి చూస్తూ.

“యిట్ యీజ్ నాట్ హెల్.. గ్రేట్ హుమ్యానిటీ. డోంట్ బార్క్..” ఆండ్రియా కూడా తన జవాబును అతని స్థాయిలోనే చెప్పింది.

“వాట్ యు మీన్ టు సే.. అయాం బార్కింగ్ లైక్ డాగ్..”

“నో డౌట్ మిస్టర్ రాబర్ట్..” చిరునవ్వుతో వ్యంగ్యంగా చెప్పింది ఆండ్రియా.

“యు మీన్…” నరసింహశాస్త్రి చూపుడు వేలితో చూపుతూ.. “హి యీజ్ గ్రేట్ హ్యుమన్..” వికటంగా నవ్వాడు.

“యస్.. హి యీజ్.. నో డౌట్..”

తల్లి.. తండ్రి సంభాషణను విని ఇండియా బెదిరిపోయింది.

“మామ్!… వుయ్ విల్ గో హోం…” అంది మెల్లగా

రాబర్ట్ ఆవేశంగా ముందుకు నడిచాడు.

ముందుకు నడుస్తున్న నరసింహశాస్త్రి.. అద్వైత్.. పాండురంగలను సమీపించాడు.

“నరసింహ!.. వాట్ యీజ్ దిస్..” వెటకారంగా అడిగాడు.

“మిస్టర్ రాబర్ట్ సార్.. ప్లీజ్ సైడ్.. లెట్ అజ్ మూవ్!..” వినయంగా చెప్పాడు అద్వైత్.

వికటంగా నవ్వాడు రాబర్ట్.

“వాట్ హ్యాపెండ్ టు యువర్ ఫాదర్.. వై హి యీజ్ నాట్ టాకింగ్!” వ్యంగ్యంగా అడిగాడు రాబర్ట్.

“హి యీజ్ నాట్ యిస్ కాంక్షస్.. ప్లీ మూవ్!…” అద్వైత్ జవాబు.

“యు మీన్… హి యీజ్ బికమ్ గాడెస్ నౌ!..” పరిహాసాస్పదంగా నవ్వుతూ అడిగాడు రాబర్ట్,

“వాట్ యు సెడ్ యీజ్ రైట్.. ప్లీస్ బి సైడ్..” అభ్యర్ధనగా చెప్పాడు అద్వైత్.

“ఐ వాంట్ ఎవిడెన్స్!..”

అద్వైత్.. రాబర్ట్ మధ్యన జరుగుతున్న సంభాషణను అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు.

సుల్తాన్ రాబర్ట్‌ను సమీపించి.. “సార్.. ప్లీజ్ గివ్ దెమ్ వే..” వినయంతో చెప్పాడు.

“రేయ్ సుల్తాన్.. ఐ వాంట్ ది విట్నెస్!..” రెచ్చిపోయి పలికాడు రాబర్ట్.

నరసింహశాస్త్రి కళ్ళు తెరిచారు. వారి నయనాలు చింతనిప్పుల్లా వున్నాయ్. “రేయ్!.. నీకు సాక్ష్యం కావాలిరా!..” అన్నారు నరసింహశాస్త్రి.

“యస్.. యస్..”

ప్రక్కనే వున్న అద్వైత్ చేతుల్లోకి తన చేతుల్లోని కలశపు వెండి పళ్ళాన్ని నెట్టారు శాస్త్రిగారు.

వారి సంభాషణ జరుగుతున్న చోట వారికి ప్రక్కన వున్న వేప చెట్టు శాఖలు పైన వాలి వున్నాయి. రెండు అడుగులు ముందుకు వేసి నరసింహశాస్త్రి పైకి ఎగిరి వేప చెట్టు శాఖలకున్న వేపాకును దూసి తన కుడి చేతి లోనికి తీసుకొన్నారు. క్షణంలో నేలమీద నిలిచారు. రాబర్ట్‌కు ఎదురుగా నిలచి..

“సాక్ష్యం కోరావు గదా!.. చేయి పట్టరా పట్టు..” తీవ్ర స్వరంతో శాసించారు నరసింహశాస్త్రి.

శాస్త్రిగారి వాలకాన్ని చూచి రాబర్ట్ జంకాడు.

“చేయి పట్టరా!.. పట్టు..” నరసింహశాస్త్రిగారు గద్దించారు.

రాబర్ట్ ప్రక్కనే వున్న సుల్తాన్ వారి చేతిని తన చేతిలోనికి తీసుకొని ముందుకు సాచాడు.

నరసింహశాస్త్రిగారు తన పిడికిలిని రాబర్ట్ చేతిపైన వుంచి తెరిచాడు.

రక్తవర్ణం సింధూరం రాబర్ట్ చేతిలో రాలింది. అతను, సుల్తాన్ ఆశ్చర్యపోయారు. సుల్తాన్ రాబర్ట్‌ను ప్రక్కకు లాగాడు.

నరసింహశాస్త్రి కలశాన్ని అందుకొని ముందుకు సాగారు. అందరూ మంత్రముగ్ధులై వారి వెనకాల నడిచారు. తన చేతిలోని కుంకుమ చూచిన.. రాబర్ట్కు చేష్టలు వుడిగిపోయాయి. మ్రాన్పడి శిలలా నిలబడ్డాడు. ఆండ్రియా ఇండియా అతన్ని సమీపించారు.

రాబర్ట్ చేతిని కుంకుమను చూచి తమ నొసటన ఆ సింధూరాన్ని దిద్దుకొన్నారు ఆండ్రియా ఇండియాలు. ఏ క్షణాన నరసింహశాస్త్రి చేతి నుండి కుంకుమ రాబర్ట్ చేతిలో పడిందో.. అదే క్షణంలో, రాబర్ట్ ఎక్కి వూరేగే గుఱ్ఱం.. పెద్దగా సకిలించి నేలకూలి చనిపోయింది.

సత్యం.. ధర్మం.. న్యాయం.. నీతి.. నిజాయితీ కలవారి పక్షంలో దైవం అండగా వుంటుందనే దానికి యిది ప్రత్యక్ష సాక్ష్యం. దైవ దూషణ తగదు.

తాను మహమ్మదీయుడైనా.. హైందవతను గౌరవించి అభిమానించే సుల్తాన్ భాయ్ రాబర్ట్ చేతిలో సింధూరాన్ని తన నొసటన పెట్టుకొన్నాడు.

అచేతనంగా నిలబడి వున్న రాబర్ట్ను చూచి..

“సార్!.. పదండి యింటికి వెళదాం” అన్నాడు.

రాబర్ట్ తేరుకొని తన చేతిలో వున్న కుంకుమను నేల విసిరాడు.

అతని చర్యకు సుల్తాన్.. ఆండ్రియా.. ఇండియా బాధపడ్డారు.

నేల చిందరవందరగా రాలిన కుంకుమ వారి కళ్ళకు మిణుగురు పురుగుల వలె మెరుస్తూ కనిపించింది. రాబర్ట్ మౌనంగా కార్లో కూర్చున్నాడు. ఆండ్రియా ఇండియా సుల్తాన్ కారు ఎక్కారు. ఆ కారు రాబర్ట్ నిలయం వైపుకు బయలుదేరింది. గేటు ప్రక్కనే వాలుగా వున్న వరండాలో నిలబడి వుండవలసిన గుర్రం నేలకూలి చచ్చిన దృశ్యాన్ని చూచి వారు ఎంతగానో ఆశ్చర్యపోయారు.

కలిశ నిమజ్జనం జరిగింది. అందరూ దరికి చేరి వూర్లోకి ప్రవేశించి, ఆలయాన్ని సమీపించారు. నరసింహశాస్త్రి శిలారూపంలో వున్న జగన్మాతకు నమస్కరించి వడివడిగా తన నిలయం వైపుకు బయలుదేరాడు. పాండురంగ వారిని అనుసరించాడు.

ఆలయంలో నివేదన చేయబడ్డ ప్రసాదాలను అద్వైత్ అతని సన్నిహితులూ అందరికీ పంచారు. అందరూ పరమానందంగా కార్యక్రమం సవ్యంగా ముగిసినందుకు ఆనందించారు.

కానీ!.. రాబర్ట్ కోరిక.. దానికి నరసింహశాస్త్రి గారు ఇచ్చిన కుంకుమ సాక్ష్యాన్ని జనం తలుచుకొని ఆశ్చర్యంలో మునిగిపోయారు. అది కల.. నిజమా!.. అనుకొన్నారు. అందరికీ.. ఆ సాక్ష్యం.. దైవం మీద ఎంతో ఆరాధనా భావాన్ని.. నమ్మకాన్ని.. భక్తిశ్రద్దలను కలిగించింది. కార్యక్రమాన్నంతా ముగించి అద్వైత్ ఇంటికి చేరాడు. వరండాలో ఒళ్ళు తెలియని స్థితిలో పడి వున్న తండ్రిని ప్రక్కన వున్న తల్లి సావిత్రిని పాండురంగలను చూచాడు.

“ఏరా!.. అంతా సవ్యంగా ముగిసిందా.. అందరూ సంతోషించారా!..” కళ్ళు తెరవకనే.. అడిగిన నరసింహశాస్త్రి మాటలకు.. “అందరికీ ఆనందమే తల్లీ!..” భక్తితో జవాబు చెప్పాడు అద్వైత్.

అధ్యాయం 14:

చచ్చిపడివున్న గుర్రాన్ని కొన్ని క్షణాలు చూచి ఆండ్రియా ఇండియాలు మౌనంగా యింట్లోకి వెళ్ళిపోయారు. రాబర్ట్ వరండాలో సాలోచనగా కూర్చున్నాడు.

‘వేప ఆకు కుంకుమగా ఎలా మారింది?.. నేను ఇంటికి వచ్చేసరికి నీటుగా నిలబడి వుండవలసిన నా గుర్రం చచ్చి నేల పడి వుంది!.. యీ రెండింటికి సంబంధం వుందా!.. నేను నరసింహను సాక్ష్యం కోరడం తప్పా!.. ఆ తప్పు కారణంగానే గుర్రం చచ్చిపోయిందా!..’

ఎంత ఆలోచించినా పై ప్రశ్నలకు రాబర్ట్‌కు జవాబు దొరకలేదు. వరండాలో నిలబడి తన్నే చూస్తున్న సుల్తాన్ ముఖంలోకి చూచాడు రాబర్ట్. అతను తన వైపుకు చూడగానే సుల్తాన్ తలను ప్రక్కకు త్రిప్పుకొన్నాడు.

“సుల్తాన్!…”

“సార్!..”

“గుర్రం ఎలా చనిపోయింది?..”

“యీ విషయంలో మీకు ఎంత తెలుసో.. నాకూ తెలిసింది అంతే. అంతా అయోమయం!..” అన్నాడు సుల్తాన్.

“వేపు ఆకు కుంకుమగా ఎలా మారింది!..”

“అది దైవమహిమ.. శక్తి..”

“అంటే!.. ఆ నరసింహ మీ దేవునికి అంత సన్నిహితుడా!..”

“సార్!.. దేవుడు అనేవాడు ఒక్కడే.. అందులో మీ మా అనే భేధం లేదు. నమ్మి మనం పలికే పలుకే మీ మా.. దేవుడౌతాడు. దేవుడు కరుణామయుడు. మంచివారికి.. నమ్మినవారికి.. కళ్ళకు కనబడకుండానే అండగా వుంటాడు. ఇది యీ దేశపు వాసుల నమ్మకం” అన్నాడు సుల్తాన్.

“నరసింహకు మంత్ర తంత్రాలు తెలుసా!..”

“నా దృష్టిలో వారు మామూలు మనిషి కాదు. మహోన్నత మానవుడు. వారికి తన సాటివారికి తన శక్తి కొద్ది సాయం చేయడం తప్ప.. ఎవరిని గురించి తప్పుగా ఆలోచించండం.. అసహ్యియంచుకోవడం తెలియదు. యీ ప్రాంతంలో వారిని ఎరిగి వున్న వారు.. వారు కనబడితే దైవంగా భావిస్తారు. గౌరవిస్తారు. కానీ మీరు..” ఆగిపోయాడు సుల్తాన్.

“ఏం ఆగిపోయావ్..”

“నేను చెప్పబోయేది నిజం. అది మీకు నచ్చదు. నన్ను మీరు తిడతారు”

“ఆ నిజం ఏమిటో చెప్పు.. నేను నిన్ను ఏమీ అనను..”

“మనకు నచ్చితే ప్రీతిగా పలకరించడం న్యాయం. ధర్మం. నచ్చకపోతే.. వారి బాటన మనం పోకుండా.. వారికి దూరంగా వుండటం వివేకవంతుల లక్షణం సార్!..”

“అంటే నేను అవివేకినా!..”

“సావధానంగా ఆలోచించుకొంటే.. నిజానిజాలు మీకే తెలుస్తాయి సార్. ఇక నేను ఇంటికి వెళతాను. శలవు” రాబర్ట్ సాలోచనగా మౌనంగా వుండి పోయాడు. కొన్నిక్షణాలు సుల్తాన్ ముఖంలోకి చూచి.. “సుల్తాన్!.. డిస్పోజ్ యిట్..” నేల పడివున్న గుర్రాన్ని చూస్తూ చెప్పాడు రాబర్ట్.

“ఒకే సార్!..” చెప్పి సుల్తాన్ వెళ్ళిపోయాడు.

రాబర్ట్ కొన్ని నిముషాల తర్వాత లేచి ఇంట్లోకి ప్రవేశించాడు. హాల్లో కూర్చొనియున్న ఆండ్రియా ఇండియాలు లేచి ఆండ్రియా గదిలోనికి వెళ్ళిపోయారు. వారు తనను చూచిన తీరు రాబర్ట్‌కు నచ్చలేదు. ఇరువురి మీదా కోపం.. కొన్నిక్షణాలు హాల్లో నిలబడి.. ఆండ్రియా గదిని సమీపించి..

“ఆండ్రియా!…” పిలిచాడు.

ఆండ్రియా నుండి జవాబు లేదు.

మరోసారి కాస్త హెచ్చు స్థాయిలో పురుష ఆధిక్యత ధ్వనించేలా పిలిచాడు. ఆండ్రియా వచ్చి వాకిట నిలబడింది.

“పిలిస్తే పలకవేం?..”

“విషయం ఏమిటి?..” ఎదురు ప్రశ్న వేసింది ఆండ్రియా.

“నేను నీ భర్తనన్న విషయాన్ని మరచిపోకు..”

“ఆ విషయాన్ని గత కొన్ని నెలల క్రిందటే నేను మరచిపోయేలా నీవు నడచుకొన్నావు. నా నుండి నీకు త్వరలో విడాకులు లభిస్తాయి. అంటే.. నేను నీకు దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకొన్నాను. నా నిర్ణయంలో మార్పు లేదు. రాదు” వెనుతిరిగి.. గది తలుపులను మూసింది ఆండ్రియా. ఆమె చర్యకు ఆశ్చర్యపోవడం.. రాబర్ట్ వంతు అయింది.

మౌనంగా తన గదిలోనికి నడవబోయాడు.

మూన్ కారు వరండా ముందున్న పోర్టికోలో ఆగింది.

మూన్ కారు దిగి వరండాలో ప్రవేశించాడు.

“రాబర్ట్!..”

మూన్ పిలుపు విని.. గదిలో ప్రవేశించబోయిన రాబర్ట్ వెను తిరిగి చూచాడు.

“మిస్టర్ మూన్.. గుడ్ యీవినింగ్” యాంత్రికంగా అన్నాడు రాబర్ట్.

‘యీ సమయంలో వీడు ఎందుకు వచ్చినట్లు!..’ మనస్సున అనుకొన్నాడు.

“నీకో గుడ్ న్యూస్!.. చెబుతాను రా!..” వరండాలో కూర్చున్నాడు మూన్.

మూన్ గొంతు వినగానే.. ఆండ్రియా తన గది తలుపులను తెరిచింది.

“గుడ్ యీవినింగ్ ఆండ్రియా ప్లీజ్ కమ్!..” నవ్వుతూ చెప్పాడు మూన్.

“గుడ్ యీవినింగ్ మిస్టర్ మూన్..” చిరునవ్వుతో చెప్పి అతని వైపుకు నడిచింది ఆండ్రియా.

ఇరవైరెండు సంవత్సరాల క్రింద మూన్ ఆండ్రియాలు బ్రిటన్‍లో ఒకే వూర్లో వుండేవారు. వారి ఇరువురి యిళ్ళూ ప్రక్క ప్రక్కనే. ఆండ్రియా ఫాదర్ రాబిన్ మిలటరీ ఆఫీసర్.. తల్లి మేరీ.. కాలేజ్ ప్రొఫెసర్. వారికి ఆండ్రియా ఒకే సంతానం. ఎంతో గారాబంగా పెంచారు. ఆండ్రియా లా చదివే రోజుల్లో మూన్ ప్రక్క యిల్లే ఆయిన కారణంగా.. ఆ ఇరువురూ ప్రేమలో పడ్డారు. మూన్ డిగ్రీ ముగించి మిలటరీ ట్రైనింగ్‍లో వున్నాడు. మూన్ ఫాదర్ లింకన్ పేదవాడు. చిన్న రెస్టారెంట్ యజమాని. తల్లి జిని నర్స్.

రాబిన్‌కు లింకన్ మీద చిన్నచూపు. ఆండ్రియా లా ముగియగానే తన నిర్ణయాన్ని తండ్రికి తెలియజేసింది. లింకన్ పేదవాడనే కారణంగా.. తన కుమార్తెను మూన్‍కు ఇచ్చి వివాహం చేయదలచుకోలేదు. ‘నన్ను ఆలోచించుకోనీ..’ అనే సమాధానాన్ని కూతురుకు చెప్పి.. నెల రోజుల లోపలే ట్రాన్స్‌ఫర్ మీద కుటుంబంతో కలసి మరో నగరానికి వెళ్ళిపోయాడు.

మూన్ మిలిటరీ ట్రైనింగ్ ముగించి అతనూ మరోవైపుకు వెళ్ళిపోయాడు. మూన్ ఆండ్రియాల ప్రేమకథ.. అసంపూర్ణంగానే మిగిలిపోయింది. ఇరువురూ దూరమైపోయారు.

ఆ నగరంలో పేరున్న వ్యక్తులలో రాబర్ట్ ఫాదర్ ఆంటోని జిల్లా కోర్టు జడ్జి.. ప్రముఖులు. తరచూ ఆంటోనీని.. రాబిన్ క్లబ్లో కలసి కొనేవారు. రాబిన్.. ఆంటోని కుటుంబ వివరాలను తెలిసికొన్నాడు. వారి యింటికి వెళ్ళి పెళ్ళి కాని రాబర్ట్‍ను చూచాడు, అతని అందచందాలు రాబిన్‍కు బాగా నచ్చాయి. రాబర్ట్ అప్పుడు రెవిన్యూ డిపార్టుమెంటులో పని చేసేవాడు. అతని ఉద్యోగం.. మాటతీరు బాగా నచ్చిన రాబిన్.. తన కూతురు ఆండ్రియాను రాబర్ట్‌కు యిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకొన్నాడు. తన నిర్ణయం ప్రకారమే.. ఆండ్రియా వివాహం.. రాబర్ట్ చర్చిలో జరిపించాడు.

వివాహానంతరం.. ఆండ్రియా కొద్ది నెలల్లోనే గ్రహించింది రాబర్ట్ ఆవేశపరుడని.. స్వార్థపరుడని.. ముందు ఒక వివాహం అయినవాడని గ్రహించింది. సంవత్సరం లోపలే ఆండ్రియా గర్భవతి అయింది. రాబర్ట్ ఇండియాకు బయలుదేరాడు. అతనితో ఉద్యోగాన్ని మాని ఆండ్రియా ఇండియాలోని కలకత్తాకు వచ్చింది. అక్కడే ప్రసవించింది. పుట్టిన బిడ్డకు ఇండియా అని పేరు పెట్టింది. ఆమెను మూడేళ్ళ వయస్సున తన తల్లి మేరీ దగ్గరకు ఇంగ్లాండ్‍కు పంపి చదివించింది. సంవత్సరంలో ఒకటి రెండుసార్లు తాము ఇంగ్లాండ్‌కు వెళ్ళి తల్లీ కూతుళ్ళను చూచి కొద్దిరోజులు వుండి వచ్చేది. సెలవుల్లో ఇండియా ఇండియాకు వచ్చి తల్లి తండ్రి వద్ద వుండి వెలవలు ముగిసే సమయానికి ఇంగ్లాండ్‍లో పున్న గ్రాండ్ మదర్ వద్దకు వెళ్లిపోయేది. తల్లిలాగే ఇండియా లా చదివింది. ప్రజలకు న్యాయం చేయాలనేది ఆ తల్లికూతుళ్ళ ఆశయం. ప్రస్తుతం ఇండియా వయస్సు యిరవై రెండు.

ఈ యిరవై మూడు సంవత్సరాల సహచర్యంతో ఆండ్రియా తన భర్త రాబర్ట్.. ఎంతో సహనంగా సంసారం సాగించింది. రాబర్ట్ రాజమండ్రికి కలకత్తా నుంచి వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయింది. యీ ఒకటిన్నర సంవత్సరంలో రాబర్ట్ తత్వంలో ఎంతో మార్పు. అతనికి తన పై అధికారులను తృప్తి పరిచి.. వారి మెప్పు పొంది.. పైపైకి ఎదగాలనే ఆశ తప్ప.. తన చుట్టూ వుంటున్న యీ భారతీయులు మనుషులేనని.. వారికి మనస్సు.. గౌరవాభిమానాలు వుంటాయనే భావన లేకుండా.. బానిసలుగా చూచే అతని తత్వాన్ని ఆండ్రియా జీర్ణించుకోలేక పోయింది.. సాటి మనుషులను చీడ పురుగుల్లా చూనే రాబర్ట్ తత్వం అంటే ఎంతో అసహ్యం ఏర్పడింది. ఆ కారణంగానే అతనితో తెగతెంపులు చేసికోవాలని నిర్ణయించుకొంది.

మిస్టర్.. మూన్‌ను ఆమె కలకత్తాలో ఐదేళ్ళ క్రిందట కలిసింది. ఆండ్రియా.. తన తొలి ప్రేమను మరువలేదు. ఆమె కాదు ఎవరూ ఎన్నటికీ మరువలేదు. అది మనస్సుకు వున్న బలహీనత.. ప్రేమకు వున్న పవిత్రత..

మూడేళ్ళ క్రిందట మూన్ ఆ ప్రాంతానికి కర్నల్‍గా వచ్చాడు. గడచిన ఒకటిన్నర సంవత్సర కాలంలో ఆండ్రియా.. మూన్లు ఆరుసార్లు కలిశారు. యీనాటి యీ కలయిక ఏడవది, ఆండ్రియా తనకు మిగిల్చిన జ్ఞాపకాలతో మిస్టర్ మూన్ అవివాహితుడుగానే వుండిపోయాడు. బహుశా ఆ తత్వాన్నే అసలు సిసలైన ప్రేమ అంటారేమో కదా!.. తన్ను సమీపించిన ఆండ్రియాను ప్రీతిగా చూస్తూ.. “హౌ ఆర్ యు ఆండ్రియా!..” మెల్లగా అడిగాడు మూన్.

ఆ క్షణంలో మూన్ అన్న ఆ మాటను విన్నందువల్లనో ఏమో ఆండ్రియా కళ్ళల్లో కన్నీరు నిండాయి. క్షణం సేపు కళ్ళు మూసుకొని తెరచి.. చూస్తూ..

“ఓ.కే. మిస్టర్ మూన్” అంది ఆండ్రియా మెల్లగా.

వారిరువురినీ పరీక్షగా చూస్తూ నిలబడ్డాడు రాబర్ట్. ఇండియా తల్లిని సమీపించి చిరునవ్వుతో మూన్‌ను

“అంకుల్.. హౌ ఆర్ యు!..” అడిగింది.

“అయాం నెరీ ఫైన్ బేబీ!.. హౌ అబౌట్ యు!..” నవ్వుతూ అడిగాడు మూన్.

“వెరీ ఫైన్ అంకుల్!..” అంది ఇండియా.

“ఆఁ.. రాబర్ట్.. కమాన్ మ్యాన్.. లెటజ్ సిట్..”

విరక్తిగా నవ్వుతూ రాబర్ట్ వరండాలో ప్రవేశించారు. మిగిలిన ముగ్గురూ వరండాలో కొచ్చారు. అందరూ కూర్చున్నారు.

వాకిట్లో ఒక ఓపెన్ వ్యాన్ ఆగింది. అందునుండి ఆరుగురు వ్యక్తులు దిగారు. గృహప్రాంగణంలో ప్రవేశించారు. ఒక వ్యక్తి వరండా వైపుకు నడిచాడు.

“ఏయ్!.. గో బ్యాక్ అండ్ టేకిట్ ఔట్..” అన్నాడు రాబర్ట్ గుర్రాన్ని చూపుడు వ్రేలితో చూపుతూ,

అతను తన తోటి వారిని సమీపించాడు. వ్యాన్ ఆవరణ లోకి వచ్చింది. ఆ ఆరుగురూ కలసి అతికష్టం మీద గుర్రాన్ని వ్యాన్లో పడేశారు. వారు వెళ్ళిపోయారు.

“వాట్ హ్యాపెండ్ టు యువర్ హార్స్ రాబర్ట్!..” అడిగాడు మూన్.

“డైడ్!..” ముక్తసరిగా జవాబు చెప్పాడు రాబర్ట్,

“యిట్ ఈజ్ నాట్ డైడ్, కిల్డ్..” కసిగా చెప్పింది ఆండ్రియా.

“హు!…” అడిగాడు మూన్.

“హి..” అంది ఆండ్రియా.

ఆవేశంతో లేచి రాబర్ట్ లోనికి వెళ్ళిపోయాడు.

జరిగిన విషయాన్నంతా ఆండ్రియా మూన్‍కు తెలియజేసింది. మూన్ ఆమె మాటలకు జరిగిన సంఘటనలకు ఆశ్చర్యపోయాడు. అంతా విని..

“నో డౌట్.. మిస్టర్ నరసింహశాస్త్రి యీజ్ గ్రేట్ పర్సన్!..”

“వేర్ యాజ్ దిస్ ఫెలో యీజ్ మోస్ట్ వర్‌స్ట్ పర్సన్..” ఆ క్షణంలో మూన్‍కు ఆండ్రియా ముఖంలో రాబర్ట్ పైన వున్న అసహ్యం.. స్పష్టంగా గోచరించింది.

“ఇండియా!.. కాల్ యువర్ ఫాదర్. ఐ హ్యావ్ టు సే సంథింగ్ టు హిమ్” అన్నాడు మూన్.

ఇండియా.. “ఓకే అంకుల్..” అంది. లేచి లోనికి వెళ్ళిపోయింది.

“ఆండ్రియా!.. డోంట్ బీ యిన్ ఎమోషన్. హి యీజ్ యువర్ హజ్బెండ్.. యు నో!..”

“ఐ లాస్ట్ మై పేషన్స్.. విత్ దిస్ మ్యాన్స్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ మిస్టర్ మూన్!..” దీనంగా చెప్పింది ఆండ్రియా.

“ప్లీజ్ కూల్.. కూల్..” చిరునవ్వుతో చెప్పాడు మూన్.

రాబర్ట్ ఇండియా వరండాలోకి వచ్చారు.

“కమాన్ రాబర్ట్. ప్లీజ్ సిట్..” రాబర్ట్‌ను చూచి చెప్పాడు మూన్.

రాబర్ట్ కూర్చున్నాడు. నోరు మెదపలేదు.

“రాబర్ట్!.. ఐ విల్ లీవ్ ఇండియా షార్ట్లీ.. హై కమ్యాండ్స్ ఆర్డర్.. దట్ యు హ్యాటు టేక్ మై చార్జి..” నవ్వుతూ చెప్పాడు మూన్.

“వాట్..” ఆశ్చర్యపోయాడు రాబర్ట్.

“వాట్ ఐ సెడ్ యీజ్ ట్రూ..” మూన్ సమాధానం.

ఆండ్రియా.. ఆమె వెనకాలే ఇండియా లోనికి వెళ్ళిపోయారు. కారణం.. కిరాతక తత్వంతో వున్న రాబర్ట్.. హోదా పెరిగితే.. మరీ కిరాతకుడుగా.. నియంతగా మారిపోతాడనే బాధ. మూన్ చెప్పిన మాటలు వారికి ఆనందాన్ని కలిగించలేదు. విచారాన్ని కలిగించాయి.

“వెన్ ఆర్ యు లీవింగ్ మిస్టర్ మూన్!..” అతని స్థానం తనకు లభించనున్నందుకు రాబర్ట్ మనస్సున ఎంతో సంతోషం. అందుకే ఎంతో ప్రశాంతంగా అడిగాడు.

“నెక్స్ట్ మంత్ యండ్!..”

“వెన్ ఐ హ్యావ్ టేక్ చార్జి!..”

“ఎ డే బిఫోర్ ఐలీవ్..”

“థ్యాంక్యూ!.. మిస్టర్ మూన్!..” ఆనందంగా చెప్పాడు రాబర్ట్.

“యు నీడ్ నాట్ సే మీ థ్యాంక్స్. వన్ అడ్వైజ్. టేక్ కేర్ ఆఫ్ ఆండ్రియా అండ్ ఇండియా. దె ఆర్ టూ గుడ్ మిస్టర్ రాబర్ట్..” అనునయంగా చెప్పాడు మూన్.

మూన్ నోటి వెంట ఆండ్రియా పేరు వెలువడగానే అతని ముఖ భంగిమ మారిపోయింది.

“ఐ హ్యావ్ ప్రొవైడెడ్ ఆల్ టు దెమ్!..”

“మిస్టర్ రాబర్ట్!.. వాట్ షి వాంట్స్ ఫ్రం యు.. దటీజ్ మిస్సింగ్!..”

“ఐ నో వెరి వెల్ ది రోల్ ఆఫ్ యిన్ హజ్బెండ్..”

“యిన్ దట్ దేరీజ్ నో హుమ్యానిటీ!.. స్పెండింగ్ మనీ ఫర్ దెమ్ కెన్ నాట్ కాల్డ్ యాజ్ హుమ్యానిటీ.. హ్యుమానిటీ ఓన్లీ కాల్ యాజ్ హుమ్యానిటీ.. హోప్ యు హ్యావ్ అండస్టుడ్ రాబర్ట్.. కెన్ యు గెస్ వై అయాం లీవింగ్..” ప్రశ్నార్థకంగా చూచాడు మూన్ రాబర్ట్ ముఖంలోకి.

రాబర్ట్ వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. దిక్కులు చూస్తూ మౌనంగా వుండిపోయాడు.

“మిస్టర్ రాబర్ట్.. అయాం నాట్ హ్యాపీ దివే హవ్ అవర్ పీపుల్సు.. సో కాల్డ్ బ్రిటీష్ ఆఫీసర్స్ ట్రీటింగ్ దీస్ కంట్రీ హుమన్స్. దే ఆల్సో.. లైక్ అజ్ హుమన్స్. వుయ్ షుడ్ నాట్ ట్రీట్ దెమ్ యాజ్ అవర్ స్లేవ్స్. ఐ హేట్ దిస్ పాలసీ.. కిల్లింగ్ మై మొరాలిటీ ఐ నీడ్ నాట్ డు దిస్ సర్వీస్ వెరీ మచ్ డిజిస్టెడ్. దట్స్ పై అయాం లీవింగ్..” ఆవేశంగా చెప్పాడు మూన్.

అతని మాటలకు రాబర్ట్ జవాబు చెప్పలేకపోయాడు.

ఇండియా రెండు కాఫీ కప్పులతో వచ్చి ఒకటి మూన్‍కు మరొకటి తండ్రికి అందించింది.

చిరునవ్వుతో ప్రీతిగా ఇండియాను చూస్తూ మూన్ కాఫీ కప్పును అందుకొన్నాడు. కాఫీ త్రాగి మూన్ లేచి.. “ఓకే రాబర్ట్.. గుడ్ లక్.. బై..” వేగంగా వరండా మెట్లు దిగి కారును సమీపించి లోన కూర్చున్నాడు మూన్.

ఇండియా అతను కూర్చున్న వైపుకు వెళ్ళి.. “అంకుల్.. ది డే వెన్ యు ఆర్ లీవింగ్ ఇండియా వుయ్ బోత్ కమ్ విత్ యు. దిసీజ్ మమ్మీస్ సేయింగ్!..” ఇండియా ముఖంలోకి చూచి నవ్వుతూ.. “ఓకే బేబీ.. సేటు మదర్..” అన్నాడు మూన్. అతని కారు వెళ్ళిపోయింది. ఇండియా లోనికి పరుగెత్తింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here