[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు ‘సంచిక పదసోపానం’ అనే కొత్త ప్రహేళికకు స్వాగతం.
శ్రీ కోడీహళ్లి మురళీమోహన్ నిర్వహించే ఈ పజిల్‍లో ఐదు అక్షరాల పదాలు 12 ఉంటాయి.
మొదటి పదం చివరి పదం ఇవ్వబడతాయి.
మిగిలిన పదాలు పూరించాలి.
మొదటి పదం చివరి రెండు అక్షరాలతో రెండవ పదం ప్రారంభం కావాలి.
రెండవ పదం చివరి రెండు అక్షరాలు మూడవ పదం తొలి రెండు అక్షరాలు కావాలి.
ఇలా 11వ పదం చివరి రెండు అక్షరాలతో 12 వ పదాన్ని సాధించాలి.
~
ఉపయోగించే పదాలు/పదబంధాలు అర్థవంతంగా ఉండాలి. నిఘంటువులో ఉన్నవి కాని, మనం వ్యవహారంలో వాడే పదాలను కాని ఉపయోగించాలి. వాడే పదం తిరగమరగగా (REVERSE), గజిబిజిగా (JUMBLE) ఉండరాదు. ఒక పదం చివరి రెండక్షరాలు తరువాతి పదంలో ఉపయోగించినప్పుడు వాటి గుణింతాలు మార్చుకోవచ్చు.
ఉదాహరణకు క్రింది నమూనా చూడండి.
వీటి సమాధానం ఒకటి కంటే ఎక్కువగా ఉండవచ్చు.
~
ఆసక్తికరమైన ఈ పజిల్ సంచికలో వచ్చే వారం నుంచే..
సంచిక పదసోపానం..
వచ్చే వారం నుంచే..