[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
1. కర్తవ్యం
సమస్యల తోరణం
పచ్చగానే ఉంది
ఎన్నికలు పలకరిస్తున్నాయి
ఇకనైనా చూపుడు వేలుకు
కర్తవ్యం తెలియాలి!
~
2. పెనుగులాట
పాచిపోయిన లడ్డూలు
పాత వాసన మరచి
పరిమళిస్తున్నాయి
పొత్తుతో పెనుగులాడుతూ
~
3. స్నానం
కులం మలం
మతం మకిలి
పట్టించిన దేశానికి
సిరాచుక్కతోనే శుద్ధి!
~
4. ఎన్నిక
ఎంపిక ఎన్నిక
కళ కళ లాడితేనే
దేశం కళ కళ!