రెండు కళ్ళు – పుస్తక పరిచయం

0
3

[dropcap]దూ[/dropcap]రి వెంకటరావు సుప్రసిద్ధ రచయిత. ఇప్పటివరకు 550 కథలు, 10 నవలలు, 300కు పైగా బాలలకథలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు రాశారు.

“రెండు కళ్ళు” వారి ఆరో కథా సంపుటి. ఈ సంపుటిలో 14 కథలు, మరో 19 చిన్న కథానికలున్నాయి.

***

ప్రముఖ దిన, వార, మాస పత్రికల్లో ప్రచురితమైన వందలాది కథల్లోంచి ఇప్పటికె ఐదు కథా సంపుటాల్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడిది ఆరో కథల సంపుటి. 2012 నుంచి 2017 వరకు ప్రచురితమైన కథల నుంచి కొన్నింటిని ఎంచుకుని ఈ కథల సంపుటిని మీ ముందుకు తెస్తున్నాను” అన్నారు రచయిత దూరి వెంకటరావు “నా మాట”లో.

***

ఈ కథలెలా ఉంటాయో గ్రహించేందుకు ఈ పుస్తకంలోని కొన్ని కథల నుంచి కొన్ని వాక్యాల ద్వారా తెలుస్తుంది.

“ఈ ఇల్లు మీ నాన్న స్వార్జితం. అమ్ముకున్నా, ఆర్చుకున్నా వాడిష్టం. అడగడానికి లేదు. పైగా పరమేశం దాన్ని ఏనాడో సాధువులకి రాసేసి రిజిస్టర్ చేయించేసాడు. ఈ విషయంలో మనం పరమేశాన్ని తప్పు పట్టలేం. నిజానికి మీ నాన్నని చూసుకున్నది ఆ సాధువులే” అన్నాడు రఘురాం. (అనాథప్రేత కథ నుంచి)

 

“నిజమే నేను చేసింది తప్పే. నా దుందుడుకు చర్య వల్లే కావ్య చచ్చిపోయింది. కాదు నేనే చంపేసాను. నా పాపానికి నిష్కృతి లేదు. నేనే కాదు నా కూతుర్ని కట్టుకున్నందుకు అల్లుడు కూడా ఆ పాపాన్ని అనుభవిస్తున్నాడు.”  (మనసు – మనువు కథ నుంచి)

 

“తొందరేం లేదు! ఇంటికి పట్టుకెళ్ళి చదువు. అవసరమనిపిస్తే మార్పులు చేర్పులు చేసి పట్టుకురా” ఆదేశించాడు హర్షవర్ధన్. తల ఆడిస్తూ లేచాడు ప్రదీప్.
కథ శీర్షిక ‘అయోమయం’. పేరే కాదు రచనా అలాగే ఉంది. బాస్ ఆర్డర్. పాపం ఏం చేస్తాడు? తలా తోకా లేని ఆ కథకో రూపం ఇవ్వడానికి ఆ రాత్రంతా బుర్ర బద్దలు కొట్టుకున్నాడు.” (షాక్ కథ నుంచి)

***

రెండు కళ్ళు (కథల సంపుటి)
రచన: దూరి వెంకటరావు
ప్రచురణ: విజయ్ పబ్లికేషన్స్, విజయనగరం
ధర: 90 రూపాయలు
పేజీలు: 140
ప్రతులకు:

  1. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్, అన్ని శాఖలు,
  2. కల్లూరు రాఘవేంద్రరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, 26-4-982, త్యాగరాజ నగర్, హిందూపురము 515201
  3. దూరి వెంకటరావు, 25-10-30, దాసన్నపేట, విజయనగరం – 535002. సెల్‌ 9666991929

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here