[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘ఎంతెంత దూరం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]నీ[/dropcap]వు నాకు ఎంత దూరం
చేతులు చాచేంత దూరం
చూపుకు చిక్కెంత దూరం
హృదయ లయ వినిపించేంత దూరం
మేను జలదరించేంత దూరం
పెదవులు నవ్వులు చిలికేంత దూరం
బుగ్గలు సిగ్గు పడేంత దూరం
వీనులకు విందైన దూరం
కనులకింపైన దూరం
భారం తీరేంత దూరం
విరహం చల్లారేంత దూరం