షేక్‌స్పియర్‌తో నేను

0
3

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘షేక్‌స్పియర్‌తో నేను’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]“జీ[/dropcap]వితమే ఒక నాటక రంగం. ఇక్కడున్న మనుష్యులందరూ పాత్రధారులే. జీవిత కాలంలో ఒక్కో మనిషి చాలా పాత్రలు పోషిస్తాడు.” అన్న షేక్‌స్పియర్‌ మాటల్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు గుర్తు చేసుకోవలసిందే. ప్రపంచాన్ని ఒక్క ఊపు ఊపిన షేక్‌స్పియర్‌ నాటకాలు అన్ని దేశాల విద్యార్థులూ చదువుకున్నారు. పిరికివాళ్ళు తమ మరణానికి ముందే చాలా సార్లు చచ్చిపోతారు, ఒక మూర్ఖుడు తనని తాను జ్ఞాని అనుకుంటాడు అంటూ షేక్‌స్పియర్‌ చెప్పిన ఎన్నో కోట్స్ ప్రజల నాలుకల మీద ఉన్నాయి.

నేను 2010లో హాంగ్‌కాంగ్ దేశానికి వెళ్ళాను. అక్కడ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌ను చూశాం. అందులో దాదాపు వందమందికి పైగా అంతర్జాతీయ ప్రముఖుల మైనపు విగ్రహాలున్నాయి. గాంధీజీ, మావో, అమితాబ్ బచ్చన్ వంటి వారి విగ్రహాల వద్ద నిలబడి ఎంతో మంది ఫోటోలు తీసుకుంటున్నారు. మేము కూడా చాలా విగ్రహాల వద్ద ఫోటోలు తీసుకున్నాం. ఆ సమయంలో షేక్‌స్పియర్‌ విగ్రహం కనిపించగానే ఆనందంతో వెళ్ళాను. ఆ విగ్రహం ప్రక్కనే కూర్చుని ఆయన రాస్తున్న కవితలు చూస్తున్నట్లుగా పోటో తీసుకుని దాచుకున్నాను. సాహిత్యాన్ని ప్రేమించే కవయిత్రిగా నాకు గొప్పగా అనిపించింది. అప్పుడే ఒక వ్యాసం రాయాలనుకున్నాను కానీ ఇన్నీ సంవత్సరాలకు కుదిరింది.

యాంటోనీ అండ్ క్లియోపాత్రా, ఒథెల్లో, హామ్లెట్, ద మర్చంట్ ఆఫ్ వెనిస్ వంటి నాటకాలను చదువులో భాగంగా చదువుకుని పరీక్షలు రాశాం. కొంతమంది ఈ నాటకాల్లో బాగా మునిగి తేలేవాళ్ళు. కానీ నాకు అంత బాగా పట్టులేదు. ఆ తర్వాత డిగ్రీ అయిపోయాక పెళ్లి అయ్యాక ఏదో చదవాలనీ తాపత్రయంతో ఎమ్.ఏ ఇంగ్లీషు చదవాలనుకున్నాను. ఆంధ్రా యూనివర్శిటీలో ఎమ్.ఏ. చదవాలని అప్లికేషన్ పెట్టాను. అప్పటి సిలబస్‌లో మొదటగా షేక్‌స్పియర్‌ నాటకం ‘యాజ్ యు లైక్ ఇట్’ ను చదివాను. ఇంకేమి చదివానో ఇప్పుడు గుర్తులేదు గానీ ఈ పుస్తకాన్ని లైబ్రరీ నుంచి ఇంటికి తెచ్చుకుని చదవడం వల్ల పేరు బాగా గుర్తున్నది. మిగతా పుస్తకాలు లైబ్రరీలో కూర్చునే చదువుకున్చాను. నేను షేక్‌స్పియర్‌ పుస్తకాలను లైబ్రేరియన్‌ను అడిగి చదువుతుంటే అందరూ గొప్పగా చూసేవారు. అప్పుడు ఆ నాటకాలు ఏమీ అర్థం కాలేదు. పరీక్షలు రాయాలి కాబట్టి బట్టి పట్టి చదివి రాసి పాసవ్వడమే తెలుసు. అలాగే మొదటి సంవత్సరం ఎమ్.ఏ పరీక్షలు రాసి, ఆ తర్వాత షేక్‌స్పియర్‌నూ, ఎమ్.ఏ ఇంగ్లీషునూ వదిలి పెట్టేశాను. పాత ఫోటోలు చూస్తున్నపుడు షేక్‌స్పియర్‌తో తీసుకున్న పోటో కనిపించింది. అందుకే ఒక వ్యాసం రాయాలనుకున్నాను.

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కవులలో 15వ శతాబ్దం నుంచీ ఒకే పేరు వినిపిస్తున్నది. ప్రముఖ కవి, నాటక రచయిత, నటుడు ఐన షేక్‌స్పియర్‌. షేక్‌స్పియర్‌ 1564 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో జన్మించారు. మరణం మాత్రం 1616 సంవత్సరంలో ఏప్రిల్ 23వ తేదీన జరిగింది. ప్రచంచ పుస్తక దినోత్సవం జరుపుకోవటానికి షేక్‌స్పియర్‌ మరణ తేదీకి ఎటువంటి సంబంధం లేదు. అయినా ఒకేరోజు రెండూ జరగటం అద్భుతం అనవచ్చు.

షేక్‌స్పియర్‌ గురించి చదవని విద్యార్థి ఉంటాడా! ఇంటర్ లోనూ డిగ్రీ లోనూ షేక్‌స్పియర్‌ నాటకాలు చదివి రోమియో జూలియట్‌లుగా భావించుకుని కాలేజీలో తిరిగేవాళ్ళు ఎందరో. కాలేజీ స్టేజిలపై షేక్‌స్పియర్‌ నాటకాలను ప్రదర్శించి నటులుగా ప్రైజులు తెచ్చుకుని మురిసిపోయేవాళ్ళు కూడా తక్కవేమీ కాదు. నేను కూడా ‘ద మర్చంట్ ఆఫ్ వెనిస్’ నాటకాన్ని డిగ్రీలో చదివినదాన్నే. హామ్లెట్ వంటి షేక్‌స్పియర్‌ విషాదాంత నాటకాలకు దుఃఖించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. షేక్‌స్పియర్‌ మూడు రకల నాటకాలు రాశారు. హాస్యం, దుఃఖాంతం, చారిత్రాత్మక మూడు విభాగాల్లోనూ నాటకాలు రచించారు.

ట్రాజెడీ నాటకాలే అందరికీ గుర్తున్నాయి. షేక్‌స్పియర్‌ రాసిన జూలియస్ సీజర్, రోమియో జూలియట్, హామ్లేట్, ఒథెల్లొ, యాంటోని అండ్ క్లియోపాత్రా, మాక్ బెత్, వంటి నాటకలు ట్రాజెడీగా ముగిసినవే. యాజ్ యు లైక్ ఇట్, ద కామెడీ ఆఫ్ ఎర్రర్స్, అల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్, ఎమిడ్ సమ్మర్ నైట్ట్స్ డ్రీమ్, ట్వేల్త్ నైట్, ద టూ జెంటిలెమన్ ఆఫ్ వెరోనా, ద వింటర్స్ టేల్ వంటివి హాస్యప్రధానమైనది. హాస్యరస ప్రధానమైనవీ, చారిత్రకమైనవీ అయిన రచనల్ని షేక్స్ స్పియర్ తొలినాళ్ళలోనిని రచనలు. 1590 సంవత్సరం నుంచి 1613 సంవత్సరాల మధ్య కాలంలో రాసినట్లుగా మనకు ఆధారాలు లభిస్తున్నాయి. షేక్‌స్పియర్‌ రచనల్లో కళాత్మకత, నాణ్యత అద్భుత స్థాయిలో ఉండడం వల్లే ఐదు శతాబ్దాల తర్వాత కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. పంపoచ ప్రఖ్యాత నాటకకర్త అని ఇప్పుడు మనం కీర్తిస్తుప్పటికీ షేక్‌స్పియర్ జీవించి ఉన్నప్పుడు ఇంతగా ఆదరణ లభించలేదట. కవులు రాసిన రచనలకు వారు బతికి ఉండగా గుర్తింపు లంభించకపోవడమన్నది ఆ కాలoలోనూ ఉండటం దురదృష్టకరం. కవుల సాహిత్యాలలోని గొప్పదనాన్ని సహ రచయితలు ఒప్పుకోలేకపోవడం వాళ్ళలోని ఈర్ష్యా  ద్వేషాలకు తార్కాణం.

గొప్ప ఆంగ్ల రచయితగానూ, ప్రపంచ నాటక రచయితలలో ప్రముఖుడిగానూ గుర్తించబడుతున్న షేక్‌స్పియర్ ఇంగ్లండు లోని స్ట్రాట్ ఫోర్టులో అపాన్-అవాన్‌లో జన్మించారు. దాదాపు 37 నాటకాలు, 154 సోనెట్‌ లు, చాలా కవితలు రాశారు. షేక్‌స్పియర్‌ నాటకాలు ప్రపంచం లోని దాదాపు అన్ని ముఖ్య భాషల్లోకీ అనువదించబదడాయి. షేక్‌స్పియర్‌ నాటకాలు కళావేదికల మీద లెక్కలేనన్నిసార్లు ప్రదర్శించబడ్డాయి.

షేక్‌స్పియర్‌ తన పద్దెనిమిదో ఏట ‘అన్నా హాత్వే’తో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. ఆ తర్వాత కాలంలో అంటే 1585-1592 ల మధ్యన లండన్‌లో జీర్ణించినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత తిరిగి తన స్వగ్రామం లోనే నివసించినట్లుగా తెలుస్తుంది. కొంతమంది మిత్రులు షేక్‌స్పియర్‌ రచనలన్నిటినీ కలిపి ఒక పుస్తకంగా ప్రచురించారు. ప్రస్తుతం ఆ పుస్తకమే అందరికీ అందుబాటులో ఉన్నది. ఇందులోని దాదాపు షేక్‌స్సియర్ రచనలన్నీ దొరుకుతున్నాయి. షేక్‌స్పియర్‌ గురించి జీవిత చరిత్రలు ఎంతోమంది రాశారు అయినప్పటికీ సరయిన ఆధారాలు లభించలేదు. అందుకే ఎవరికి నచ్చిన కల్సితాలను వారు సృష్టించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here