తల్లివి నీవే తండ్రివి నీవే!-32

0
3

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

సర్వం విష్ణుమయం జగత్ – 3

మున్మూర్ధ్ని కాళీయఫణే వికటాటవీషు

శ్రీ వేంకటాద్రి శిఖరే శిరిసి శ్రుతీనామ్

చిత్తే ప్యనన్య మనసాం సమమాహితౌ తే

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

(శ్రీవేఙ్కటేశ్వర ప్రపత్తి 12)

ఓ వేంకటేశ్వరా! నా తలపైన, కాళీయుని పడగపైన, దుర్గమారణ్యములందును, శ్రీ వేంకటాచలము యొక్క శిఖరముపైన, ఉపనిషత్తుల యందును, వేఱే ఆలోచన లేక నిన్నే స్మరించువారి మనస్సునందున, నీ పాదములు భేదభావము చూపక సమానముగనే ఉండును. అట్టి నీ పాదములనే శరణు వేడెదను.

ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప,

మాత్తాదే పాల్ శొరియుమ్ వళ్ళల్ పెరుం పశుక్కళ్,

ఆత్త ప్పడైత్తాన్ మగనే! అఱివుఱాయ్,

ఊత్త ముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్

తోత్తమాయ్ నిన్ఱ శుడరే! తుయిలెழாయ్,

మాత్తారునక్కు వలి తొలైందు ఉన్ వాశఱ్కణ్,

ఆత్తాదు వన్దు ఉన్నడి పణియుమాపోలే,

పోత్తియామ్ వన్దోమ్ పుకழ்న్దేలో రెమ్బావాయ్!

(తిరుప్పావై 21వ పాశురము)

ఏత్త కలంగళ్ – ఆలమందల నుంచీ ధారగా సహజముగనే (పితుకనవసరం లేకుండా) కారే క్షీరము కొరకు ఉంచిన పాత్రలు

ఎదిర్ పొంగి – అంచులదాకా నిండి (పొంగి పొర్లి పోతాయి అనేంత)

మీదళిప్ప – పొందిపోతాయి

మాత్తాదే – నిరంతరాయంగా

పాల్ చొరియుం – పాలు వర్షధారల లాగా

వళ్ళల్ – ఉదారంగా (అడ్డూ అదుపు లేనంత) అందించే

పెరుం పశుక్కుళ్ – పెద్ద పెద్ద ఆవులు (కలిగిన)

ఆత్త ప్పడైత్తాన్ మగనే – నందగోపుని పెద్ద కుమారుడా

అరివురాయ్ – మేల్కొనుము

ఊత్త ముడైయాయ్ – అత్యంత ప్రాచీనమైన, అపౌరుషేయాలు అయిన వేదములచేత చెప్పబడిన విదంగా స్థిరముగనుండువాడవు

పెరియాయ్ – ఓ పెద్దవాడా! లేదా వేదములకు కూడా అందని వాడు, అంతటి ప్రాచీనుడు

తోత్తమాయ్ నిన్ఱ – నిలిచి కనిపించే

శుడరే – దేదీప్యమానమైన కాంతి

తుయిలెழாయ్ – మేల్కొనుము

మాత్తర్ – నీ శత్రువులు

ఉనక్కు వలి తొలైందు – నీ శక్తి సామర్థ్యముల ముందు తేలిపోతారు/నిలువజాలరు

ఉన్ వాశర్కణ్ – నీ ఇంటి ముంగిట

ఆత్తాదువందు – వేరే ఎవరిని శరణు వేడకుండా

ఉన్నడి పణియుమాపోలే – నీ దివ్య చరణములనే శరణు వేడుటకు (వేడుతూ)

యామ్ – మేము

పోత్తి – నీకు మంగళాశాసనము చేయుటకు

వందోమ్ – నీ ఇంటి ముందరకు వచ్చియున్నాము

తిరుప్పావైలో 21వ పాశురం. ఇందులోనే పెరియాయ్ అనే సంబోధన ఆండాళ్ చేసింది. అంటే పెద్దవాడా అనే కాదు. నిజానికి పైన తెలిపినట్లు ఆద్యంతములు తెలియజాలనంత ప్రాచీనుడా అని. విష్ణువు గురించి వేదములలో ఎక్కడా కనపడదు అనే మాట వినవస్తుంటుంది. నిజానికి వేదములకు కూడా అందని వాడు, సర్వభూతములకు ఆది అయిన వాడు (అంటే ఆయన/ఆ శక్తి నుంచీ సర్వమూ ఆవిర్భవిస్తాయి) శ్రీమహావిష్ణువు. మరి అలాంటి వాడి గురించి వేదములలో ఏ విధంగా ఉంటుంది?

కొడుకు లేదా కూతురు పుట్టిన సందర్భం గురించి తల్లి లేదా తండ్రి డైరీలో (లేదా ఙ్ఞాపకాలలో) ఉంటుంది కానీ కొడుకు/కూతురు డైరీలో తల్లిదండ్రుల పుట్టుక గురించి ఎలా ఉంటుంది? కేవలం వారి జన్మదినాల వివరం మాత్రమే ఉంటుంది. అలాగే ఆ భగవచ్ఛక్తి యొక్క ఔన్నత్యము జీవులకు తెలిసి ఉంటుంది తప్ప వారి గురించి ప్రస్తావన జీవులకు దారి చూపే వేదములలో తక్కువగానే ఉండటంలో ఆశ్చర్యము లేదు.

ఆద్యంతములు లేని ఆ శ్రీహరి ద్వాపర యుగంలో (28 – ప్రస్తుత మహాయుగంలో గడచిన ద్వాపర యుగంలో) శ్రీకృష్ణుడిగా ఆవిర్భవించాడు. ఆ ఆవిర్భవించిన విధానం కూడా ఆయన భగవానుడే అని చాటి చెప్పేవిధంగా ఉంటుంది. పంచాయుధాలతో, చతుర్బాహువులతో శ్రీమన్నారాయణ స్వరూపంలోనే ఆయన ఆవిర్భవించి తరువాత బాలుడిగా మారతాడు. ఈ విషయం భాగవతంలో సుస్పష్టం.

అంటే ఆద్యంతములు లేని ఆ జగన్నాథుడే చిన్న బాలుడిగా మారాడు. అంటే దేవకీ వసుదేవులకు మొదట సగుణ దర్శనమిచ్చి ఆ పైన వారి బిడ్డలుగా పసివాడిగా మారాడు. అంటే అటు గరిమ, ఇటు అణిమ అనే తన శక్తులను చాటాడు. He’s the biggest among all the big. And he’s the smallest but even powerful among all when the situation demands.

మొదటి పాశురంలో యశోదై ఇళం సింగం (యశోదాదేవి ఒడిలోని చిన్ని సింహపు కూన) అని సంబోధింపబడిన ఆయనే ఇక్కడ పెరియాయ్ అని సంబోధింపబడ్డాడు.

అత్యంత సూక్ష్మమైనదీ ఆయన విభూతే! అత్యంత పెద్దదైనది కూడా ఆయన విభూతే.

He’s the matter (that comes from energy – నృసింహావతారం), he’s the composition of the matter (its constituents).. molecules. He’s the atoms which combine to form those molecules. He’s the nucleus of the atom. He’s the protons that reside inside the atomic nucleus – that decides the type of element (1 proton – hydrogen, 2 protons – helium, 3 protons – lithium..), gives it the identity of atomic number, forms part of the atomic mass (number of protons + number of neutrons – సాకార నిరాకార బ్రహ్మమే సంపూర్ణ పరబ్రహ్మము). He’s also the electrons that decide what atom combines with what type of other atom to form various compounds. He’s the space inside the atom. And the space outside the atom.

ఈ అణువులు, పరమాణువులు వాటియందుండే ప్రాథమిక కణాలనబడే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అన్నీ ఆయన విభూతే. వీటితో నిర్మితమైన ఆ బ్రహ్మాండమైన విశ్వము కూడా ఆయనే.

విశ్వమ్! ఆ విశ్వ నిర్మాణంలో భాగాలైన ఆ సూక్ష్మ పరమాణు అంతర్గతములైన ఆ సూక్ష్మాతి సూక్ష్మ కణాలు కూడా ఆయన విశ్వరచనలో భాగాలే. ఆ యా సూక్ష్మాతి సూక్ష్మ కణాలైన ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఏర్పడటానికి కారణమైన క్వార్క్ లు కూడా ఆయనే.

The Higgs Boson is called the God Particle. కారణం?

హిగ్స్ బోసాన్ గురించి:

హిగ్స్ బోసాన్, దైవ కణం అని కూడా పిలువబడేది, ఒక (విశ్వ సృష్టికి) మూలభూతమైన కణం. ఇది విశ్వంలోని అన్ని పదార్థాలకు ద్రవ్యరాశిని ఇస్తుంది. అంటే చరాచర సృష్టికి, అందులోఉండే జీవులకు, జీవములేకుండినను ప్రాధానం వహించే పదార్థములకు అవసరమైన శక్తిని ఇచ్చేది ఆ పరమాత్మే కదా.

2012లో లార్జ్ హాడ్రాన్ కొలైడర్ (LHC) లో శాస్త్రవేత్తలు దీనిని అనేక సంవత్సరాలు ప్రయత్నం చేసి కనుగొన్నారు. ఈ కనుగొనడం భౌతికశాస్త్ర చరిత్రలో అతి ముఖ్యమైన మైలురాయి. ఎందుకంటే ఇది Standard Model అనే సిద్ధాంతాన్ని ధృవీకరించింది. ఇది పదార్థం మరియు శక్తిని నియంత్రించే ప్రాథమిక శక్తులను వివరించే సిద్ధాంతం.

హిగ్స్ బోసాన్ యొక్క లక్షణాలు:

ద్రవ్యరాశి: 125.11 GeV/c² (ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కంటే 133 రెట్లు ఎక్కువ) – eV అంటే electron volts. Unit of energy.

స్పిన్: 0

విద్యుత్ చార్జ్: 0

రంగు చార్జ్: 0 (doesn’t participate in the strong nuclear force)

అస్థిరత: చాలా అస్థిరంగా ఉంటుంది, ఇతర కణాలుగా క్షయిస్తుంది.

అంటే భగవానుడు స్థాణుః – స్థిరంగా ఉంటాడు. అస్థిరంగా ఉంటాడు. కానీ ఈ దైవకణమనబడేది కేవలం అస్థిరంగా మాత్రమే ఉంటుంది. భగవచ్ఛక్తిలో ఒక పార్శ్వాన్ని మాత్రమే చూపుతుంది. ఆ ఒక్క పార్శ్వమే సృష్టికి కారణం అవుతోంది.

విష్ణువు స్థిరంగా ఉంటాడు (శుద్ధ సత్వం). బ్రహ్మ అస్థిరుడు (రజోగుణం). అందుకే ఆయన సృష్టి చేయటానికి నియమితుడయ్యాడు. బ్రహ్మగారు కూడా నారాయణుడిలో అంశ కాబట్టి ఆ గోవిందుడు కూడా అస్థిరుడుగా కూడా ఉంటాడు.

కనుగొన్న ప్రదేశం: LHC at CERN lab, a combined land governed by Switzerland, France, and Germany

హిగ్స్ బోసాన్ ప్రాధాన్యత:

ద్రవ్యరాశి యొక్క మూలం: హిగ్స్ బోసాన్.. కణాలు హిగ్స్ ఫీల్డ్ తో సంకర్షణ చెందడం వల్ల ద్రవ్యరాశిని పొందుతాయని వివరిస్తుంది.

స్టాండర్డ్ మోడల్ ధృవీకరణ: హిగ్స్ బోసాన్ యొక్క కనుగొనడం స్టాండర్డ్ మోడల్ ను ధృవీకరించింది, ఇది విశ్వనిర్మాణంలో కీలకపాత్ర వహించే పదార్థాల, శక్తుల వివరాలను తెలిపే సిద్ధాంతం.

విశ్వం యొక్క మూలం: హిగ్స్ బోసాన్ యొక్క ఉనికి మొదటి విశ్వం యొక్క మూలం మరియు పరిణామం గురించి మన అవగాహనను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. సృష్టికి ముందు ఏమి జరిగిందనేది చెప్పలేక పోయినా సృష్టి ఎలా జరిగిందో వివరించగలదు. అర్థ సంపూర్ణం.

కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఆ హిగ్స్ బోసాన్ లేదా మరే ఇతర దైవకణం మానవులు కనుగొన్నారని అనుకున్నా అది మాత్రమే మూలమైనది కాదు. అక్కడికే విశ్వవిజ్ఞానం అంతం కాదు. 1890ల చివరి కాలంలో జేమ్స్ క్లార్క్ మేక్స్వెల్ (James Clark Maxwell) అనే శాస్త్రవేత్త విద్యుత్తు, అయస్కాంత శక్తులను కలిపి విద్యుదయస్కాంత శక్తిగా (సూత్రాలను లెండి – Maxwell’s Electromagnetic Equations) ఏకీకృతం చేశాక (James Clark Maxwell unified electricity and magnetism into electromagnetism and most of everyone thought that’s the end of physics) అసలు కథ అక్కడే మొదలైంది.

అంత వరకూ కాంతి కణ రూపంలో ఉంటుందా? తరంగ రూపంలో ఉంటుందా అన్న సమస్య తేలక రెండున్నర శతాబ్దాలు గడచినా చివరకు కాంతి అటు తరంగ రూపంలోను, కణ రూపంలోను ఉంటుందని అవగాహనకు వచ్చారు శాస్త్రవేత్తలు. ఆ పైన Wave Particle duality కూడా బైటపడింది. ఇంక అక్కడి నుంచీ జరిగిన పరిశోధనలు సాధారణ భౌతికశాస్త్ర సూత్రాలు, నియమాలు అత్యంత సూక్ష్మ కణాల దగ్గర వర్తించవని వాటి కోసం ప్రత్యేక సిద్ధాంతాలను రూపొందించారు.

హైజన్బర్గ్ సూత్రం (Heisenberg Uncertainty Principle) అనిశ్చితి గురించి వివరిస్తుంది.

హైజన్బర్గ్ సూత్రం, హైజన్బర్గ్ యొక్క అనిశ్చితి సూత్రం అని కూడా పిలువబడుతుంది. ఇది క్వాంటం మెకానిక్స్ లో ఒక ప్రాథమిక సూత్రం. ఒక క్వాంటం వ్యవస్థ యొక్క రెండు పరస్పర పూరక లక్షణాలను ఒకేసారి ఎంత ఖచ్చితంగా తెలుసుకోవచ్చో, దానికి సంబంధించిన పరిమితులు ఏమిటో ఈ సూత్రం తెలియజేస్తుంది. ఈ సూత్రం యొక్క అత్యంత ప్రసిద్ధ ఉదాహరణ ఒక కణం యొక్క స్థానం మరియు దాని వేగాన్ని కొలవడం గురించి.

సూత్రం యొక్క వివరణ:

అనిశ్చితి: ఈ సూత్రం ప్రకారం, ఒక క్వాంటం వ్యవస్థ యొక్క రెండు పరస్పర పూరక లక్షణాలను ఒకేసారి ఖచ్చితంగా కొలవడం అసాధ్యం. ఒక లక్షణాన్ని ఎంత ఖచ్చితంగా కొలిస్తామో, మరొక లక్షణం యొక్క ఖచ్చితత్వం అంత మేరా తగ్గుతుంది.

ఉదాహరణకు..

స్థానం మరియు వేగం: ఒక బంతిని ఊహించుకోండి. బంతి యొక్క స్థానం ఖచ్చితంగా తెలుసుకోవాలంటే (బౌలర్ బాల్ విసిరాడు), బంతి యొక్క వేగం (బంతి ఎంత వేగంగా కదులుతోంది) గురించి ఖచ్చితంగా తెలుసుకోవడం సాధ్యం కాదు.

అదేవిధంగా, బంతి యొక్క వేగం ఖచ్చితంగా తెలుసుకోవాలంటే (ఉదాహరణకు, నిర్ణీత వేగంతో బంతిని విసరడం ద్వారా), బంతి యొక్క ఖచ్చితమైన స్థానం గురించి తెలుసుకోవడం సాధ్యం కాదు.

హైజన్బర్గ్ సూత్రం గణిత రూపంలో ఈ క్రింది విధంగా వ్యక్తీకరించబడుతుంది:

Δs x Δv ≥ h / (2π)

Δs: స్థానంలో అనిశ్చితి

Δv: వేగంలో అనిశ్చితి

h: ప్లాంక్ స్థిరాంకం.

ఈ స్థిరాంకాల గురించి ఇంతకు మునుపు స్థిరాంకాలలో చివరి అంకె అనే 16వ భాగంలో చూశాము.

ఈ స్థిరాంకాల విలువలు ఎందుకు అలాగే ఉన్నాయి? వాటిలో అన్నిటికన్నా చిన్న స్థిరాంకం ఏది? అన్నిటికన్నా పెద్ద స్థిరాంకం ఏది? ఆ స్థిరాంకాల విలువలు సంపూర్తిగా అంతు చిక్కిన వారు ఉన్నారా?

We always talk about taking the values on approximations. The approximate values may be highly nearer to the original and authentic value but they’re not absolute. Either you take Planck’s constant whose value is h = 6.62607015×10−34 JHz−1 or Avogadro number whose value is 6.02214076×1023 mol-1 (one of the smallest and one of the biggest physical constants), we always talk about some sort of approximation. Some claim they might be absolute values. But they are not.

It may be

99.999999999999999999999999999999999999999999999999999999999…

but it was never 100%, it is never 100%, and will never be 100%.

ఈ హైజన్బర్గ్ అనిశ్చితి సూత్రం ఎందుకు ముఖ్యం?

ఈ సూత్రం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది క్వాంటం స్థాయిలో కణాలను ఎలా చూడాలనే దానిపై మన భావనను మార్చివేస్తుంది. రోజువారీ వస్తువులకు భిన్నంగా, క్వాంటం కణాలు కొన్ని లక్షణాలకు ఖచ్చితమైన విలువలను కలిగి ఉండవు. వాటి ఉనికి సంభావ్యతతో వివరించబడుతుంది, దీనిని తరంగ విధులుగా వివరిస్తారు. హైజన్బర్గ్ సూత్రం ఈ సంభావ్య స్వభావాన్ని మరియు క్వాంటం ప్రపంచంలో కొలతల యొక్క పరిమితులను ప్రతిబింబిస్తుంది. అంటే మానవ దృక్కోణంలోని పరిమితులను ఎత్తి చూపుతుంది.

స్థానం మరియు వేగం మాత్రమే కాదు:

The Heisenberg’s uncertainty principle applies to other pairs of properties as well, as long as they are considered complementary or “canonically conjugate” variables. For instance, you can’t know a particle’s exact energy and the time it spends in that state with perfect accuracy.

అంటే ఒక కణం యొక్క శక్తి, అది ఆ స్థితిలో ఎంత సమయం ఉంటుందనేది ఒకేసారి వివరించలేము.

శ్రీమహావిష్ణువు అవతారాలను ఎత్తుతాడు అని మనకు తెలుసు. దాదాపు ఎలాంటి సందర్భాలలో అవతరిస్తాడు అన్నది శాస్త్రాలను బట్టీ చెప్పవచ్చు కానీ, ఆయన ఆ యా అవతారాల్లో ఎంత కాలం ఉంటాడు అన్నది ఆయనకు మాత్రమే తెలిసిన విషయం. ప్రత్యేకంగా ఎవరైనా మహర్షులు దర్శిస్తే తప్ప. పైగా ఆ యా అవతారాల సమయంలో ఆయన ఈ మర్త్య మండలంలో ఉన్నా, ఆయన సర్వత్రా వ్యాపించి ఉంటాడు. దానికి తోడు వైకుంఠంలో కూడా ఉంటాడు.

అందుకే ఆయన భూతాధిః

ఆయన లోపలా ఉంటాడు. బైటా ఉంటాడు. పైనా ఉంటాడు. కిందా ఉంటాడు. అన్ని దిక్కుల్లో ఉంటాడు. అంతటా తానే కనుక ఏ దిక్కు కూడా లేకుండానే ఉంటాడు. అందుకే అందరికీ ఆయనే దిక్కు అవుతాడు.

స్థాణుః – అంతటా ఆయనే ఉంటాడు కనుక ఆయన స్థిరంగా ఉంటాడు. లేదా మనకు అగుపిస్తాడు. కానీ, అంతటా వ్యాపించే గుణం చూపించే విష్ణువు కనుక ఆయన స్థిరంగా ఉండక కదలికను చూపుతూ కూడా ఉంటాడు. He’s both the particle and the path taken by the particle. He’s both the wave and the particle. He appears as none of them and both of them at once. But humans cannot comprehend this thanks to the limitation imposed by the uncertainty principle.

కానీ ఆయన అలాగే ఉంటాడు.

క్షణం కూడా ఆగకుండా కురిసే వర్షధారల మాదిరి ఆవుల పొదుగుల నుండి క్షీరధారలు వస్తున్నాయి. ఆ క్షీరధారల కింద పాత్రలు ఎన్ని ఉంచినా అంచులు దాటి పొంగిపోతూనే ఉంటాయి పాలు. అలాంటి శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన పెద్ద పెద్ద ఆవుల మందలను కలిగి ఉన్న నందగోపుడికి కుమారుడిగా అటు బలభద్రుడైనా, ఇటు శ్రీకృష్ణుడైనా ఉన్నారు. అంతటి దేవాదిదేవుడు పుత్రులుగా ఉండటానికి ఎన్నుకోబడిన వ్యక్తి ఎంత ఉన్నతుడై ఉండాలి?

గోవిందుడు పెరిగే చోట ఎలాంటి గోవులు ఉండాలి? అవి ఎంతటి గోవులు?

అంత గొప్ప గోవులకు అధిపతి అయిన నందగోపుడి కుమారుడా అని సంబోధిస్తుంటే గోదాదేవి. ఆ నంద గోపుడి (ఆనందగోపుడి) కుమారుడు పెరియాయ్. అతడే భూతములన్నిటికి ఆది.

అందుకే ఆయన

నిధిరవ్యయః

ఇక్కడ ద్వైత వ్యాఖ్యలో

నిధి, అవ్యయః అని విడదీశారు.

ఇక్కడ ఈ ద్వైత వ్యాఖ్య బాగా ఒప్పుతుంది. కారణం.. ఈ భూతములన్నిటికీ ఆది అయిన వాడు – తననుంచీ వాటిని సృష్టించే వాడు ఒక గొప్ప నిధి. ఆ నిధి ఎలాంటిది అంటే అవ్యయమైనది. ఎన్నటికీ తరగనిది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here