[శ్రీమతి పుట్టి నాగలక్ష్మి రచించిన ‘స్నేహ బాంధవి – చలువపందిరి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఆ[/dropcap]రు పదుల అలిసి సొలిసిన బాల్యంలో!
ఉద్యోగ బాధ్యతలు తీరిన తరుణంలో!
కలిసిందో నేస్తం..
అందించింది స్నేహహస్తం..
మాటలు కలిపిన స్నేహం.
మనసులు కలిసిన నెయ్యం..
కనువిందు చేసే చిరునవ్వులు మరుమల్లెలే!
వీనుల విందు చేసే నవ్వులు గోదారి గలగలలే!
కనురెప్పల మాటున తడిని గ్రహించే చురుకుదనం
ఆ స్నేహానుభూతి, సహానుభూతులకు లేదు కొలమానం
ఆత్మీయతానురాగాల స్నేహబాంధవి
ఊతమిచ్చిన స్నేహలతే చలువపందిరి