అందాల దీవులలో ఆహ్లాద యాత్రలు – లంకావి (మలేసియా)

0
3

[లంకావి (మలేషియా)లో జరిపిన తమ పర్యటన అనుభవాలు, అనుభూతులు వివరిస్తున్నారు డాక్టర్ నర్మద రెడ్డి.]

[dropcap]మా[/dropcap]వారి పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరినీ తీసుకొని మేము హైదరాబాద్ నుంచి మలేషియాలోని లంకావికి బయలుదేరాము. హైదరాబాద్ నుంచి 12 గంటలకు బయలుదేరితే నాలుగున్నర గంటలలో మేము కౌలాలంపూర్ చేరాము. తరువాత రెండున్నర గంటలు మేము మలేషియా ఎయిర్‌పోర్ట్‌లో ఉండి, అటు ఇటు తిరిగి; రెండున్నర గంటలలో మళ్ళీ మేము లంకావికి చేరుకున్నాము. మేము దిగేసరికి పదకొండున్నర అయింది. మేము ఒక కారు మాట్లాడుకున్నాము. మేము ఉన్న నాలుగు రోజుల కోసం కారు తీసుకున్నాము. ఆ కారు కూడా చాలా తక్కువలోనే వచ్చింది. మాకు నాలుగురోజులకి 300 రిగేట్స్‌కి వచ్చింది. సోమబాబు కారు నడిపిస్తూ చక్కగా మేము ఎయిర్ బిఎన్‌బి లో బుక్ చేసుకున్న ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ ఇంట్లో నాలుగు బెడ్రూమ్‍లు ఉన్నాయి. అందులో మావారు నేను ఒక రూమ్ తీసుకొని అందులో మా లగేజ్ అంతా సద్దుకొని, అక్కడికి దగ్గర ఉన్న ఒక రెస్టారెంట్లో చక్కటి అన్నం, బార్లిగింజలతో తయారు చేసిన సూపు, చికెన్ ఫ్రై తిని వచ్చాము. ఆరోజు బాగా అలసటతో ఉన్నాం కాబట్టి రూమ్ కొచ్చేసి అందరం నిద్రపోయాము. నాలుగున్నరకి లేచాము. ఎయిర్ బిఎన్‌బి లో కిచెన్ కూడా ఉంది కాబట్టి ఆ విల్లాలో మేము టీ ప్రిపేర్ చేసుకుని తాగి, లైట్‍గా బిస్కెట్స్ తిని అక్కడ నుంచి ఒక సీషోర్‍కి బయలుదేరాము.

అక్కడకి ఎంటర్ అవగానే లంకావి అని రాసి ఉన్న ఒక అక్షరాలతో రాసి ఉన్న బీచ్ స్లైడ్ కనిపించింది. మేము అందరము కలిసి అక్కడ ఫొటోలు దిగాము. ఆ బీచ్లోకి వెళ్ళగానే ఆ బీచ్ నుండి సూర్యాస్తమయము చాలా అందంగా ఉంటుందని అందరూ చెప్పారు. సో ఆ బీచ్ కూడా తెల్లటి ఇసుకరేణులతో ఎంతో అందంగా సంధ్యాసమయపు అరుణకాంతులను వెదచల్లుతోంది. సూర్యుని చూస్తూ మేము అలా మైమరచిపోయి ఆ బీచ్లో ఒక రెండున్నర గంటలు కూర్చున్నాము. ఆ రెండున్నర గంటలల్లో ఒక గంట ఆ బీచ్ చుట్టూ నడుస్తూ వెళ్ళాము. అక్కడే పేరాచూట్‍లో కూడా చక్కగా తీసుకు వెళుతున్నారు. పేరాచూట్‍లో విహరించడానికి చాలా అనువుగా ఉంది. అవన్ని చూస్తూ మేము సూర్యాస్తమయ అందాలను తిలకిస్తూ మమ్మల్ని మేము మరచిపోయాము. ఏడున్నరకి ఆ బీచ్ నుంచి బయటకి వచ్చాము. బయటకి వచ్చాక వేదు ఒక కైటు కూడా ఎగురవేసాడు. ఆయాన్, సమిత ఇద్దరు కలసి ఇసుక తోటి ఇళ్ళు కట్టారు. దాని చుట్టూ ఒక చిన్న బావిలాగా చేసి దాంట్లో నీళ్ళు పోసి దాంతో ఆడుకున్నారు. అది కాకుండా నీళ్ళల్లో చక్కగా ఒక గంటసేపు స్విమ్ చేసారు, పరిగెత్తారు, కేరింతలు కొడుతూ నీళ్ళు చల్లుకుంటు, ఎగురుతూ, ఆడుతూ తుళ్లింతలతోటి ఆ సాయంత్రం అంతా గడిచిపోయింది. వాళ్ళ ఆట పాటలు చూస్తూ నేను మైమరచిపోయాను. అలాగే అక్కడ మాకు ఇద్దరు జపాను వారు కలిసారు. ఆ ఇద్దరు ఒక టిక్టాక్ చేస్తూన్నారు వాళ్ళతో పాటు నేను కూడా కాసేపు పరిగెత్తాను. చాలా బాగా ఆనందించాము. రాత్రి ఎనిమిదింటికి అక్కడున్న చిన్న షాపింగ్ సెంటర్‌కు వెళ్లాము. అక్కడ ట్వయిన్ దారంతో అల్లిన బ్యాగ్లు, టోపీలు కొనుక్కున్నారు పిల్లలు. నేను కూడా ఒక టోపీ కొనుక్కున్నాను. రోటీ చికెన్ ఆర్డర్ చేసుకొని అలా తింటు కారులో కూర్చుని ఇంటికి చేరుకున్నాము. ఇంటికి చేరగానే పిల్లలంతా మరల ఆకలి, ఆకలి అని అనేసారు. సో అందరం కలసి ఒక రెస్టారెంట్‌కి వెళ్ళి హాయిగా తినేసి అక్కడే ఐస్‌క్రీమ్ కూడా తీసుకొని తినుకుంటూ ఇంటికి వచ్చి పడుకున్నాము. ఆ రోజు అలా గడిచిపోయింది.

లంకానీలో అతి విశిష్టత కలిగిన దీవులున్నాయి. అందులో 99 దీవులున్నాయి. మా ఆహ్లాదకరమైన దీవుల యాత్రలో ఈ 99 దీవులను కూడా చూడాలని నేను ఉవ్విళ్ళూరుతూ లంకావిలో అడుగు పెట్టాను. ఇందులో ‘పులావ్ దాయాంగ్ వంటి’  ముఖ్యమైనది. రెండవ అతి పెద్ద ద్వీపంగా పరిగణించబడుతుంది. ఈ పులావ్ దాయాంగ్ మంటింగ్‍లో మంచి నీళ్ళు సరస్సులు కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా ఇక్కడ అత్యంత అద్భుతమైన లక్షణ మేమిటంటే ఇల్లేమాట్ సరస్సు సముద్రం మధ్యలో ఉన్న కొన్ని రాళ్ళనుంచి విభజించబడింది. ఈ సరస్సు ద్వీపం మధ్యలో ఉంది. పులావ్, దాయాంగ్ వంటి – లంకావి తీరానికి దక్షిణగా ఉంది. మేము ప్రొద్దున్నే పడవలో పులావ్, దాయాంగ్ వంటికి చేరుకున్నాము. ఈ ద్వీపం పేరు వెనుక ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. పులావ్, చాయాంగ్ వంటి అంటే ఆంగ్ల భాషలో గర్భిణిస్త్రీల ద్వీపమని అర్థం. మామ్ బంగ్ చీరకు చెందిన యువరాణితో మత్ తేజ అనే వ్యక్తి ప్రేమలో పడ్డాడట. వారు వివాహం చేసుకున్నారు. వారికి ఒక కొడుకు కూడా కలిగి ఉన్నాడు. కాని ఆ కుమారుడు త్వరలోనే మరణించాడు. అయితే ఆ యువరాణి కుమారుడి మృతదేహాన్ని నదిలో ఉంచాలని నిర్ణయించుకుందట. అప్పటి నుండి ఎవరైనా గర్భం దాల్చినప్పుడో, లేదా గర్భస్రావాలకు గురైనప్పుడో – వారు ఆ సరస్సులో స్థానం చేస్తే గర్భధారణ సమస్యలు ఎప్పటికి రావు. ప్రెగ్నెంట్ మైడన్ ద్వీపం నుండి పలావ్, దాయాంగ్ వంటి పేరు వచ్చింది. ఈ ద్వీపానికి మేము చేరుకోవటానికి ఒక పడవను మాట్లాడుకున్నాము.

ఈ ద్వీపము పులావ్, ప్యారా అనేది చాలా అందమైన ద్వీపము. ఇవి నాలుగు ద్వీపాలలో చాలా అతి పెద్దదైనది అని చెప్పారు. అయితే మేము స్పీడ్ బోట్‍లో ప్రయాణం చేస్తూ ఈ ద్వీపం దగ్గరకు వెళ్ళాము. ఇవి పచ్చని రాయిలాగా కనిపిస్తుంది. అంటే అంతా గ్రీన్.. అంతా పచ్చగా కనిపిస్తుందంటే నీటి అడుగున ఉన్న చిన్ని చిన్ని రాళ్ళు గాని ఏవైనగాని చక్కగా కనిపిస్తున్నాయి అద్దంలాగా. పులావ్ ప్యారా ద్వీపము ప్రధాన ద్వీపం నుంచి మనకు 30 కిలోమీటార్ల అగ్నేయదిశగా ఉంది. ఇక్కడ చేరుకోడానికి ఒక గంట పట్టింది మాకు. ఈ పులావ్ ప్యారా అంతా ఒక ఫారెస్ట్, అభయారణ్యం. ఇది చుట్టు ప్రక్కల ఉన్న సముద్ర జీవులన్నింటిని రక్షిస్తుంది. అయితే ఇక్కడ మెరైన్ పార్క్ ఉంది. ఈ మెరైన్ పార్క్ విశేషం ఏంటంటే మనం చక్కగా సముద్రపు అడుగునకు వెళ్ళి సముద్ర జీవులను చూడవచ్చు. ఈ స్పీడ్ బోట్ వెళ్ళి కెడమెరిన్ తీసుకొని స్కూబా డైవింగ్ ద్వారా ఈ ద్వీపంలో మనము ఈ చిన్ని చిన్ని చేపలను అన్నింటిని చూడవచ్చు. కాని ఇది సమ్మేరియన్ అయితే మేము తీసుకోలేదు. జస్ట్ పైన ఆ అబ్బాయి మాకు చెప్పాడు బ్రెడ్ ముక్కలను తీసుకురండి అని. మేము దగ్గర ఒక నాలుగు, ఐదు, ఆరు, ఏడు ఫ్యాకెట్స్ పట్టుకొని వెళ్ళాము. ఆ బ్రెడ్ వేసిన వెంటనే అక్కడ చక్కటి చేపలన్ని మేము చూడగలిగాము. ఈ ద్వీపంలో, నిజంగా, ఎంత అందమైన చేపలంటే.. చాలా అందంగా ఉన్నాయి. అవన్ని చూస్తూ మమ్మల్ని మేము మరచిపోయాము. చిన్న పిల్లలలాగా ఆడుకున్నాము. దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాలు అక్కడే ఉండి, తర్వాత బయలుదేరాం.

పులావ్ సింగ్, సింగా బీనర్ ద్వీపము ఈ లంకావి ద్వీపానికి నైఋతి దిశలో ఉంది. ఇది 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పడవలోని మేము పులావ్ సింగ్ ద్వీపానికి చేరుకున్నాము. ఇవి వన్యప్రాణుల అభయ అరణ్యం. ఈగలు, కోతులు, మౌస్ డీర్, పాములు, మానిటర్స్, బల్లులు, నెమళ్ళు ఇట్లా రకరకాల జంతువులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ ద్వీపంలో అన్ని మృగాల గురించి అన్వేషించాలంటే ప్రతి ద్వీపానికి మనము వెళ్ళవలసిందే. ఇక్కడ ఈగిల్ ఫిడింగ్ కూడా చేస్తారు. అందరు అక్కడ చిన్న చిన్న చేపల్ని, మాంసం ముక్కలను తీసుకొని నీటిలోకి ఎగరేస్తూ ఉంటే ఎన్నెన్నో డేగలు ఆ మాంసం ముక్కలని, ఆ చేపలని తినడానికి ఎగురుకుంటు వస్తున్నాయి. సో మేము అక్కడ కూడా దగ్గర ఒక అరగంట గడిపాము. వాటికి చేప ముక్కలను వేస్తూంటే ఆ డేగలన్ని మన దగ్గరకు వచ్చి వాలుతున్నయన్నమాట. అది ఒక వింతగా అనిపించింది. వందల డేగలు వచ్చేసాయి అక్కడకి.

 

పులావ్ లెంబు అనేది కాస్త ఎత్తులో ఉన్న ద్వీపం అన్న మాట. మేము అక్కడ నుంచి ఈ ద్వీపానికి వచ్చాము. ఈ ద్వీపం విశేషం ఏమిటంటే మా పిల్లలందరు చక్కగా అందులోని బీచ్ లో సముద్రంలోకి దూకి అక్కడ స్నానాలు చేసారు. నిన్న రాత్రి కొన్న ఒక గాలిపటం తీసుకొని ఎగరేసారు. ఇవి చాలా మన విహారయాత్రకి చాలా మంచి ప్లేస్ అని అక్కడ అందరు చెప్పారు. ఇక్కడే కొంతమంది చేపలు కూడా పడుతున్నారు.

పులావ్ కాక అనేది కూడా ఒక బీచ్ ప్రాంతము. ఈ బీచ్ దగ్గరకి మా పడవని తీసుకెళ్ళారు. దీని చుట్టూ అన్నీ ఫైవ్ స్టార్ హోటల్స్, చాలా పెద్ద పెద్ద రిసాట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న బీచ్ కూడా చాలా చక్కగా అసలు మురికి లేకుండా చక్కగా అన్నింటిని క్లీన్ చేస్తూ పెట్టినట్లున్నారు. ఎందుకంటే ఆ రిసార్ట్స్ ఉన్నాయి కాబట్టి. లేకపోతే నిజంగా అక్కడ అలాగే ఉందో తెలియదు. బట్ ఇట్స్ రియల్లీ వండర్‌ఫుల్ బీచ్. అక్కడ కాసేపు మేము తిరిగేసి ఇంటికి చేరుకున్నాము.

పులావ్ సెగంటాంగ్ అనే ద్వీపము మెరైన్ పార్క్ ఒక మైలు రాయి అడ్డం ఉంది. ఇది ఏంటంటే ఈ మెరైన్ పార్క్‌కి దగ్గరగా ఉంది. ఈ పులావ్ సెగంటాంగ్ రెండు రాతి ద్వీపలను కూడా కలిగి ఉంది. ఇవి 20 మరియు మీటర్ల 22 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. అయితే ఈ సెగంటాంగ్ బీచ్‍కి మేము వెళ్ళినప్పుడు అక్కడ చక్కటి బోట్ ఆకారంలో ఒక రాతితో కట్టిన ఈ బోట్‌లో ఎక్కి మేము చక్కగా ఫోటోస్ దిగాము. మరల అక్కడ నుంచి దగ్గర దగ్గర 5 కిలోమీటర్లు ఈ బీచ్ వెంబడి నడుస్తూ ఉంటే సడన్‍గా ఒక అబ్బాయి వచ్చి “మీరు ఈ బీచ్‍లో నడవడానికి వీలులేదు. ఎందుకంటే సెవన్ స్టార్ రిసార్ట్‌కి చెందినది ఈ మెరైన్ బీచ్. మీరు ఈ బీచ్‍లో నడిచినా, మీరు ఇటు సైడ్‌కి రాకుండా ఆ అంచు వెంబడి నేరుగా పైకి వెళ్ళండి. కాని బీచ్ నుంచి ఆ రిసార్ట్ లోకి వెళ్ళడానికి మాత్రం మీకు అనుమతి లేదు” అన్నాడు. సో మేము దాని ప్రకారమే అక్కడకి వెళ్ళకండా నేరుగా వెళ్ళుతూ ఉంటే మధ్యలో మాకు మధ్య జెల్లీ ఫిష్‍లు కనిపించాయి. అయితే అది జెల్లీ ఫిష్ కాదు అనేది మాకు అర్థం కాలేదు. ఎందుకనంటే అవి జెల్లీ లాగా దగ్గర దగ్గర ఒక రెండువందల గ్రాముల జెల్లీని బీచ్ ప్రక్కకి పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. చాలా జెల్లీ ఫిష్‌లు కనిపించాయి. ఫ్యాక్టరీ ద్వారా వచ్చిన కాలుష్యం తోటి వచ్చిన జెల్లీనా లేక, నిజంగా జెల్లీ ఫిష్ కూడా అర్థం కాలేదు. అక్కడ ఎవరు మాకు దాని గురించి చెప్పేవాళ్ళు కూడా లేరు. సో మేము ఫోటో తీసుకొని ఆశ్చర్యంగా చూస్తూ దగ్గర దగ్గర రెండు గంటలు నడిచి బీచ్ చుట్టూ ఇంటికి చేరుకున్నాము.

పులావ్ టిపోర్ దీవికి కూడా వెళ్ళాము. ఇది యూ షేప్ ఉన్న ఒక ద్వీపము. దీనికి దగ్గర దగ్గర 5 మీటర్ల నుంచి యాంకరేజ్ కూడా ఉంటుంది ఇక్కడ. అయితే పులావ్ టిపోర్‌లో చాలా చాలా మంచి మంచి హోటల్స్ ఉన్నాయి. తరువాత అక్కడ మంచి వసతి గృహాలున్నాయి. మనకు పక్కనే బీచ్ కూడా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్ని చూస్తూ మేము ఆ రోజు కూడా మేము చక్కగా ఈ దీవి చుట్టూ నడిచేసాము.

ఈ పులావ్ తుబాకి మేము ఎర్లీ మార్నింగ్ కారు తీసుకొని బయలుదేరాము. అక్కడకి వెళ్ళగానే వందల చిన్ని చిన్న బోట్లున్నాయి. ఇక్కడ చేపలు పట్టేవాళ్ళందరు అక్కడ వలలు వేసి ఉన్నారు. ఐదు ఆరు కిలోమీటర్ల రేంజ్లో చక్కటి చేపలు దొరుకుతాయట. మనము ఇక్కడ చాలా ప్రెష్‌గా చేపలు కొనుక్కోవచ్చు. మేము కొనలేదనుకోండి. అక్కడ ఒక పెద్ద రెస్టారెంట్ కనిపించింది. అందులో మేము కాఫీ, టీ బిస్కెట్స్ తీసుకొన్నాం. మా పిల్లలు ఆ ప్రదేశాన్నింతా ఆనందిస్తూ ఎగిరి గత్తులేస్తూ పరిగెత్తు కుంటూ చక్కగా ఆనందించారు. అక్కడ నుంచి మరల కారులో ఎక్కి మేము తరువాత ఒక ప్లేస్‌కి వెళ్ళాము. ఆ ప్లేస్ పేరు మీయుతుబా పులావ్. దాన్ని చూసుకుంటూ కేబుల్ కారు దగ్గరకు వెళ్ళాము. ఈ కేబుల్ కారుకి వెళ్ళాడానికి మనకు రెండువేల ఐదువందల రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంది. ఈ ఎంట్రీ ఫీజు చెల్లించి ఆ కేబుల్ కారు ఎక్కాము. ఆ కేబుల్ కారు ఎక్కినప్పుడు చక్కటి కొండలు ఈ పులావ్ తుబా, ఈ పులావ్ టిపోర్ ఎవేవి అయితే మనం ద్వీపాలు ఉన్నాయో పై నుంచి చక్కగా చూడవచ్చు. ఈ 99 ద్వీపాలు కూడా మనకు ఆల్మోస్ట్ పైనుంచి చక్కగా  కనబడతాయి. అవి ఎన్ని అని లెక్కపెట్టలేదు కాని చాలా కనిపించాయి. ఆ కేబుల్ కారులో వెళ్ళుతూ చక్కటి కొండలు, ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో మాకు ఆరోజు ఎండ కూడా లేదు. సంతోషంగా ఆ మబ్బులలో అలా వెళుతూ ఉన్నట్టుగా అనిపించింది. ఆ పైకి కేబుల్ కారులో వెళ్ళగానే ఒక చిన్న హాల్ట్ ఉంది. ఆ హాల్ట్ దగ్గర దిగిన తరువాత ఇంకా పైకి వెళ్ళి ఈగల్ బొమ్మ వద్ద చక్కగా అందరం ఫోటోలు దిగాము. ఆ ఈగిల్ బొమ్మను చూసిన తరువాత ఇంకొక సైడ్‍కి మనకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ చూసేసి బయల్దేరాము. మా పిల్లలంతా ట్రెకింగ్ చేస్తామని చెప్పి ఆ పైనుంచి కింద వరకు ఇంకొక కేబుల్ కారులో, నేను మావారు మాత్రమే ఆ కేబుల్ కారులో వెళ్ళాము. వాళ్ళు దగ్గర దగ్గర ఒక ఏడు వందల మెట్లు ఎక్కి దిగి వచ్చారు. మేము అక్కడకు వెళ్ళగానే ఆ బ్రిడ్జ్‌ని చూసి ఆనందించాము. ఎంతో అందంగా ఆ కొండల మధ్యలో చాలా బాగా కట్టారు. ఆ బ్రిడ్జ్ మీద మేము నడుచుకుంటూ దగ్గర దగ్గర ఒక మైలు దూరం వెళ్లాము. వెళ్ళి అక్కడ ఫోటోలు దిగేసి అక్కడ అందమైన ప్రదేశాలను చూస్తూ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ కేబుల్ కారుని, ఆ బ్రిడ్జ్‌ని చూస్తూ మమ్మల్ని మేము మై మరచిపోయం. అక్కడ నుంచి మరల అదే కేబుల్ కారులో మేము క్రిందికి దిగాము. క్రిందికి దిగేటప్పుడు మాకు చక్కటి వాటర్ ఫాల్స్ కనిపించాయి. కాని ఆ వాటర్ ఫాల్స్ ఇప్పుడు సీజన్ కాదేమో అన్ని నీళ్ళు లేవుగాని సన్నటి ధారల్లాగా పడుతూ ఉన్నాయి. మా కేబుల్ కారులో కూర్చున్న వారు డెన్మార్క్ నుంచి వచ్చారట. డెన్మార్క్ నుంచి వచ్చి ఈ ఎనిమిది దీవులను చూసారు వాళ్ళు. 15 రోజులు ఒక్క లంకావిలోనే ఉన్నారు. మలేషియాలో కూడా ఓ 10 రోజులుండి డెన్మార్క్ వెళ్ళిపోతామని చెప్పారు. చూడముచ్చటగా అనిపించింది వాళ్ళు వచ్చి ఆ మలేషియా మొత్తం చూడడము. వాళ్ళను చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఆ కేబుల్ కారు దిగే వరకు వాళ్ళతోటే మాట్లాడుకుంటూ కిందికి దిగాము.  మేము తరువాత రోజు ఒక స్పీడ్ బోట్ తీసుకొని అక్కడ ఉన్న గబ్బిలాల గృహాలు – కేవ్స్‌కి  వెళ్ళాము. కేవ్స్‌‌లో అదొక ద్వీపమన్నమాట. ఆ ద్వీపంలో కొన్ని వేల గబ్బిలాలు కనిపించాయి. ఆ గుహాలన్ని చుట్టూ చూస్తూ ఆ గబ్బిలంతో ఉన్న ఒక ఫోటో కూడా దిగాము.

అక్కడ నుంచి ఆ గబ్బిలాలను చూస్తూ మాంగ్రోస్‌కు వెళ్ళాము. మాంగ్రోస్ అంటే చెట్లు నీళ్ళలో ఉండి ఆ వేర్లు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ చెట్లు పెరుగుతూ ఉంటాయి వీటిని అభయారణ్యలని అంటారు. మొత్తమంతా మాంగ్రోస్స్ ఉండే దీనిని కూడా మాంగ్రోస్ ట్రిప్ అని కూడా అంటారు. అవన్నీ చూసి ఆ ద్వీపం నుంచి ఇంకొక ద్వీపానికి వచ్చాము. అక్కడ అన్ని కోతులున్నాయి. వందల కోతులు. మాకు చాలా భయం వేసింది. మా పర్సులు, బ్యాగ్‌లు అన్ని చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని పరిగెత్తుకొంటు వచ్చాము. తరువాత అక్కడ నుంచి మేము ఫిష్ ఫాండ్స్.. అంటే చేపలన్ని పెంచుతున్న దీవికి వెళ్ళాము. ఈ చేపలను ఎలా పెంచుతారో అక్కడ చూపిస్తున్నారు. అవన్ని చూస్తూ మా పిల్లలంతా ఎంజయ్ చేశారు. అక్కడ నుంచి బయలుదేరి మరల ఒక సీషోర్‌కి వెళ్ళాము అక్కడ పిల్లలంతా స్నానాలు చేశాకా, ఆ బోట్‌లో సాయంత్రానికి మేము ఇంటికి తిరిగి వచ్చాము.

ఆ రోజు రాత్రి మా అల్లుడు విశాల్ చికెన్ తీసుకొచ్చాడు. చక్కగా చికెను, అన్నం వండుకొని హాయిగా అందరం కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసాము.

డ్రీమ్ ఫారెస్ట్ అని రాత్రి 7 నుంచి 10 వరకు ఉంటుంది. అదే రోజు రాత్రి మేము ఈ డ్రీమ్ ఫారెస్ట్ కి వెళ్ళాలని ప్లాన్ చేసుకొని మా బాబు అజయ్, పిల్లలందరం కలసి కారులో వెళ్ళాము. ఈ డ్రీమ్ ఫారెస్ట్‌కి వెళ్ళగానే అక్కడ టిక్కెట్స్ అమ్ముతున్నారు. అందరం టిక్కెటు కొనుక్కొని లోపలికి ప్రవేశించాం. ఈ డ్రీమ్ ఫారెస్ట్ ఎంత బాగుదంటే మొత్తం ఫారెస్ట్ లోపల ఆ చెట్లలల్లో రాత్రి.. మనము చిన్న పిల్లలప్పుడు ఏవైతే కలలు కంటామో.. అవి తీరినట్టు అనిపిస్తాయి. ఒక సీతాకోక చిలుకలాగా ఎగరడం, ఎక్కడో వెళ్ళి ఎనెన్నో ఆ చుట్టూ చిన్ని చిన్ని మెరుగుడు పురుగులతోటి ఒక అభయారణ్యం చూస్తే ఎలా ఉంటుందో అలాగా ఆ అరణ్యాన్ని తయారుచేసారు. సో వాటిలోంచి మనము వెళ్ళుతూ ఉంటే సడన్‌గా మనకు ఒక పెద్ద తలుపు కనిపిస్తుంది. ఆ తలుపు కూడా చిన్ననాటి రాజసౌధంలోకి లోపలకి అడుగుపెడుతున్నట్టుగా అనిపిస్తుంది. సడన్‌గా ఆ తలుపు తెరుచుకొన్న చప్పుడు మనకు ఆ రాత్రి పూట చాలా భయంకరంగా వినిపిస్తుంది. సో ఆ లోపలకి అడుగుపెట్ట గానే మనకు ఒక దేవలోకంలోకి అడుగుపెట్టామా అన్నట్లుగా అనిపించడమే కాదు, నిజంగా మనము అనుభవిస్తాం దాన్ని. అలాగా లోపలకి వెళ్ళుతూ ఉంటే మనకు చక్కటి కథ కూడా చెప్పుతూ వాళ్ళు మనకు బొమ్మలతోటి అంటే లైట్స్ తోటి బీమ్స్ తోటి చక్కగా వివరిస్తారు. లోపల వరకు వెళ్ళాచ్చు. ఆ లోపలకి వెళ్ళాగానే ఒక స్టూడియోలాగా ఉంది. ఆ స్టూడియోలో చక్కటి సినిమా చూపిస్తారు. సినిమా అంటే సినిమా కూడా కాదు మనము అందులోనే ఉండిపోయమా అన్నంత ఫీల్ కనిపిస్తుంది. నిజంగా డ్రీమ్ ఫారెస్ట్ మాత్రం లంకావికి వెళ్ళితే తప్పని సరిగా చూడవలసిన ప్రదేశం.

అక్కడ నుంచి మళ్ళీ లోపలకి వెళ్ళితే విలేజ్ లాగా విలేజ్ సెట్టింగ్ తోటి చిన్ని చిన్న ద్వీపాలు, రాళ్ళు, రప్పలు కనబడతాయి. పూర్వ కాలపు మనుషులగా అన్ని డప్పులు అక్కడ అన్ని పెట్టేసి అక్కడ ఆ శబ్దలతోటి అక్కడ కూర్చుని ఆస్వాదించవచు. ఎంతో ఎత్తులో ఉన్న చెట్ల మధ్యలో మనం వెళ్ళుతూ ఉంటే ఘీంకారాల ధ్వని. భయంకర అభయారణ్యంలో మనం ప్రయాణిస్తూన్న అనుభూతి భలే ఉంటుంది. అక్కడ నుంచి లోపలకి వెళ్ళాకా మనకు ఒక కథ వినిపిస్తారు. రాజు, అమ్మాయి కథ.. ఫస్ట్ చెప్పుకున్నం కదా, ఆ తేజ రాజు గురించి వాళ్ళ కథ అంతా మనకు అక్కడ వినిపిస్తాడు. అది కూడా చాలా వింత అయిన అనుభవం. పిల్లల తోటి నిజంగా చాలా బాగా ఆనందించాము మేము. అక్కడ నుంచి బయల్దేరి 11 గంటలకు ఇంటికి వచ్చాం.

తరువాత రోజు మా పిల్లలందరు అన్నారు కదా ఈ ఏరియా అంతా చూసేసాము, నెక్స్ట్ ఒక సీషోర్ దగ్గరకి వెళ్దామని అన్నారు. ఇంకో సైడ్‍కి వెళ్ళాము. ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్‍తో ఉన్న ఒక రిసార్ట‌‍లో మేము 4 బెడ్ రూమ్స్ తీసుకున్నాము.

పిల్లలు చక్కగా ఒక 2, 3 గంటలు ఆ సిమ్మింగ్ పూల్లో స్నానాలు చేసారు. ఆ రోజు సాయంత్రం ఈ బీచ్ దగ్గర. ఇంకో బీచ్ దగ్గర, తుబా బీచ్ దగ్గర తిరుగుతూ హ్యాపీగా గడిపేసాము. ఆ రోజు సాయంత్రం ఇంటికి వస్తూ టమోట, ఎగ్స్, రైస్ తెచ్చుకున్నాం. చిన్ని చిన్ని చేపలు కూడా దొరికాయి. రాత్రికి అవన్ని వండుకొని తినేసాం. ఆ రోజు రాత్రి అలా గడిచిపోయింది.

తరువాత లంకావి నుంచి ఫ్లైట్‌లో కౌలాలంపూర్ వచ్చాము. కౌలాలంపూర్ నుంచి మేము గెటింగ్ ఐల్యాండ్స్ వెళ్ళాం. మేము బస్సు తీసుకొని కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్ నుంచి గెటింగ్ ఐ ల్యాండ్ వరకు వచ్చాం. అక్కడ మేము ఎయిర్ బిఎన్‌బి వారి 3 బెడ్ రూం హౌస్ తీసుకున్నాము. కరెక్ట్‌గా గెటింగ్ ఐల్యాండ్స్‌కి దగ్గరలో ఉందన్నమాట. కాని ఇక్కడకి వచ్చేసరికి మొత్తం వాతావరణం అంతా మారిపోయింది. అప్పటి వరకు ఎండగా అనిపించిన ప్లేస్ అంతా మేఘల తోటి చక్కటి చెట్లు ఆకాశాన్ని తాకే చెట్లు తోటి నిండిపోయింది, ఎంతో అందమైన ఆ ప్రదేశానికి రాగానే.

ఆ రోజు సాయంత్రం క్యాబ్ తీసుకొని పై వరకు వెళ్ళాము. క్యాబ్ కూడా చాలా తక్కువలో వచ్చింది. అంటే అక్కడ అమౌంట్ 20 రూపాయలు. పైకి వెళ్ళిన తరువాత అక్కడ కేబుల్ కారు తీసుకొని ఆ కేబుల్ కారులో గెటింగ్ ఐల్యాండ్‌లో అడుగు పెట్టాం. గెటింగ్ ఐల్యాండ్‌లో అడుగు పెట్టగానే వేరే ప్రపంచానికి వచ్చామా అన్నంత అబ్బురంగా అనిపించింది. ఆశ్చర్యంగా అనిపించింది. గెటింగ్ ఐల్యాండ్ అంతా మొత్తం కెసినోస్. అతి అద్భుతమైన లైటింగ్ తోటి పిల్లలకి చక్కటి గేమ్స్ ఉన్నాయి. ఇంకా, ఫుడ్ కోర్ట్స్, షాఫింగ్ మాల్స్‌తో చాలా అందంగా ఉంది. ఆ రాత్రంతా ఆ ప్రాంతం మొత్తం తిరిగి ఒక ఓలెన్ టవర్ చూసేసి వెంటనే పిల్లలతో పాటు కిందికి వచ్చేసాం. పిల్లలకి కూడా కంప్యూటర్ గేమ్స్, వర్చువల్ గేమ్స్ ఉన్నాయి. పిల్లలు చక్కగా ఎంజయ్ చేశారు. అక్కడ నుంచి ఇంటికి వచ్చి పడుకున్నాము. మర్నాడు ఉదయం అక్కడి అడ్వెంచర్ ట్రిప్స్‌ ని పేకెజ్ లాగా తీసుకున్నాము. ఉదయం 9గంటలకి వెళ్తే రాత్రి 8 వరకు అడ్వంచర్స్ పార్క్‌లో తిరగవచ్చు. అడ్వంచర్స్ పార్క్ ఒక ఒక్కొటి ఒక విధమైన క్రీడ. ఆ క్రీడ అంటే ఆట. ఆట లాగా కాదు అది. ఇప్పుడు మనము రంగులరాట్నం లాగా ఎనెన్నో ఉన్నాయి. అందులో మనుషుల మొత్తాన్ని తిప్పి పడేసే ఆ రంగుల రాట్నంలాంటి దాంట్లో కూర్చుంటే మరో లోకంలోకి వెళ్తాము. ఆ తరువాత మేము ఒక స్నో వరల్డ్‌కి వెళ్ళాము. ఆ స్నో వర్డల్ కూడా మొత్తం జంతువుల తోటి బొమ్మలతోటి ఉంది. ఒక ట్రైన్లో కూర్చుని లోపల వరకు వెళ్ళిన తరువాత మన మీద వాటర్ పడుతుంది అదొక అనుభూతి. అందులోంచి బయటకు రాగానే చక్కటి పూల తోటి, ఒక పూలవనం లాగా అన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి తయారుచేసిన మరో లోకంలోకి అడుగు పెట్టాము. అక్కడ నుంచి మేము ఒక వర్చువల్ గేమ్‌కి వెళ్ళాము.

ఇండిపెండెన్స్ డే అనే ఒక భవనంలోకి అడుగుపెట్టాము. అందులోకి అడుగు పెట్టగానే పెద్ద లైన్ ఉంది. ఆ లైన్‌లో వెళ్ళి లోపల కూర్చోగానే గొప్ప అనుభవం ఎదురవుతుంది. స్పేస్ లోకి వెళ్ళాలంటే ఒక కుర్చీలో కూర్చుంటే మన బాడీని గట్టిగా బెల్టులతోటి టైట్‌గా బిగిస్తారు. సో ఆ కుర్చీలో కూర్చోగానే ఇండిపెండెన్స్ డే వీడియోని చూపించడం మొదలు పెట్టారు. ఆ వీడియో నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే మనం అంతరిక్షంలోకి వెళ్ళి ఎక్కడో 110 అంతస్తుల బిల్డింగ్ లోపల నుంచి పైనుంచి కింద పడుతున్నటుగా, గట్టిగా పట్టేసుకొని మనం నిజంగా అందులోంచి పడుతున్న అనుభూతి కలుగుతుంది. ఆకాశంలోకి ఎగిరిపోయినటుగా అనుభూతి, నిజంగా ఇండిపెండెన్స్ డే అనుభవం మాత్రం ప్రతి ఒక్కరు పొందాలసింది. చాలా ఆశ్చర్యకంగా ఉంది. లేటెస్ట్ బీమ్ లైట్స్ తోటి, ఫోటోగ్రఫి టోటి ఆ విజవల్స్ తోటి మనల్ని మనం మరచిపోయేటట్టుగా ఆ మరో ప్రపంచంలోకి అడుగిడతాం. ఎంతో ఆనందంతో కేకలు వేస్తూ ఎంతో హ్యాపీగా ఆ ఇండిపెండెన్స్ డే వర్చవల్ ప్రయాణం సాగుతుంది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది.

ఇక్కడే ఆ రోజు మొత్తం చక్కటి ప్రయాణాలు అంటే కనులకు ఇంపుగా అడ్వెంచరస్ అంటే చాలా సాహసోపేతమైన క్రీడలతోటి ఎంతో అల్లరిగా చిన్న పిల్లల్లాగా బాగా ఎంజయ్ చేసాము. ఆ తరువాత అక్కడ నుంచి కౌలాలంపూర్ వచ్చాం. కౌలాలంపూర్‌లో మా అల్లుడు విశాల్ చక్కటి 4 బెడ్రూం హౌస్ – ట్విన్ టవర్స్‌కి ఎదురుగా బుక్ చేసాడు. అది కూడా చాలా చౌకగా దొరికింది. 8 వేల రూపాయలకి 4 బెడ్రూమ్ హౌస్. అది 53 అంతస్తులుంది. ఆ అంతస్తుల పైవరకు వెళ్ళితే చక్కటి స్విమ్మింగ్ పూలు, ఆ స్విమ్మింగ్ పూల్‌లో నీళ్ళు జారి పడుతున్నట్టుగా ఎంతో అందంగా కట్టారు. అందులో పిల్లలు చక్కగా స్విమ్మింగ్ చేసారు. నేను మాత్రం ఆ ట్విన్ టవర్స్‌ వద్ద 53 అంతస్తుల నుంచి ఫోటో దిగేసి కిందికి దిగివచ్చాను.

తర్వాత ట్విన్ టవర్స్‌కి వెళ్ళాము ఆ రోజు. వెళ్ళి ఒక గంట స్పెండ్ చేసి భోజనం చేసేసరికి మా ఫ్లైట్ టైం అయింది. ఇంటికి తిరిగి వచ్చాం.

ఇంతకు ముందు వెళ్ళాం గాని పిల్లలతో పాటు వెళ్ళిన సంతోషం బావుంది. మా కోడలు ప్రియాంక చక్కటి ప్లానింగ్, మా బాబు అజయ్ రెడ్డి కారు తీసుకొని ఊరంతా తిప్పటం, మా అల్లుడు విశాల్ చక్కటి వసతి గృహాలను ఎంతో బాగా రీసెర్చి చేసి చక్కగా చాలా చౌకగా చక్కటి అకామిడేషన్ బుక్ చేయడం చక్కగా కుదిరాయి. ఇవన్ని కూడా మాకు చాలా తక్కువ ధరలో వచ్చాయి. మేము ఎంతో సంతోషంగా గడిపాం. పిల్లలతో ఈ ట్రిప్‍ చాలా చాలా బాగుంది మాకు. మా పిల్లలతో, మనవలతో ఆడుకుంటూ పాటుకుంటూ ఎంతో అల్లరిగా హాయిగా తిరిగొచ్చాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here