నా రుబాయీలు-9

0
3

[‘నా రుబాయీలు’ అనే శీర్షికతో రుబాయీలను అందిస్తున్నారు శ్రీ రెడ్డిశెట్టి పవన్‍ కుమార్.]

~
1.
రాజప్రాసాదాలు కదిలి నీకై భ్రమించాను
అష్టైశ్వర్యాలు వదిలి నిన్నే రమించాను
నా రేపంతా నీ నవ్వులోనే చిక్కుకుంది
నువు కాదన్నా నీ ఊసులతో తరించాను

2.
ఇంకా స్మృతులు పండాలి మరింత ముచ్చటిద్దాం
మరో జీవితం నిండాలి అంత ముచ్చటిద్దాం
మదిగదిలో ఊసులు సముద్రమంత దాగున్నాయి
గువ్వా గోరింకలు నేర్వ నింగంత ముచ్చటిద్దాం

3.
ఆమె నవ్వితే బాగుంటుంది చూడు
తేనె రువ్వితే హాయుంటుంది చూడు
పూలతీగలు నేలపై నడుస్తాయి
గుండె లాగితే ఎట్లుంటుంది చూడు

4.
లోకపు గ్రీష్మాన్ని ఓర్చింది మన బాసల పందిరి
కాలం ఎగదోసింది భరింపని ప్రశ్నల ఆవిరి
నా ప్రేమ చమురుతో నింపా నయనాల హారతులు
నీ రాక వరకు వెలుగ నే నిరీక్షిస్తాను తివిరి

5.
ప్రసూనమందలి మధువులు లాగిన వైనం
గుండెలోన చిత్తరువులు మారిన వైనం
నీ గువ్వ దొరికిందంటూ ఎదగూటిలో
మేళతాళాల స్వనములు మోగిన వైనం

(మళ్ళీ కలుద్దాం)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here