[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘నేను లేనుగా’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]నే[/dropcap]ను ఎంతకైనా తగ్గుతా
ఎంతకైనా ఒదుగుతా
మరెంతకైనా దిగుతా
నిను గెలవటం కోసం
నేనుగా లేకపోతేనేం
నీవుగా నిలిచిపోతున్నాగా
వేరుగా లేకపోతేనేం
నేరుగా కలసిపోతున్నాగా
నేను ఎంత నీ ముందు
అంతా నీవయ్యాక
నాకు ఇహం లేదు అహం లేదు
నీవు తప్ప
రేపు లేదు మాపు లేదు
నీ వలపు తప్ప ఆ పిలుపు తప్ప