సినిమా క్విజ్-93

0
2

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

పరభాషల నుండి డబ్ చేయబడ్డ తెలుగు చిత్రాలపై ప్రశ్నలు.

ప్రశ్నలు:

  1. ఆర్. పట్టాభిరామన్ దర్శకత్వంలో రజనీకాంత్, శ్రీదేవి నటించిన ‘గాయత్రి’ (1977) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  2. షాజీ కైలాస్ దర్శకత్వంలో మలయాళ హీరో సురేష్ గోపి, గోపిక నటించిన ‘ది టైగర్’ (2005) సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  3. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఊర్మిళ మటోంద్కర్ నటించిన ‘రంగీలా’ (1995) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  4. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూర్య, సమీరా రెడ్డి, సిమ్రాన్ నటించిన ‘వారణం ఆయిరం’ (2008) సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  5. వి.ఎన్.రెడ్డి మరియు ఎ.ఎస్. ఎ. స్వామి దర్శకత్వంలో ఎం.జి. రామచంద్రన్, దేవిక నటించిన ‘ఆనంద జోది’ (1963) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  6. పి. సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో జెమినీ గణేశన్, రాజశ్రీ, ఆనందన్, విజయ నిర్మల నటించిన Aana Valarthiya Vanampadiyude Makan అనే మలయాళ చిత్రం – ‘Yaanai Valartha Vanambadi Magan’ (1971) పేరుతో తమిళ్‍లో డబ్ అయింది. జెమినీ గణేశన్ బదులుగా కాంతారావుని పెట్టి ఈ సినిమాని తెలుగులో ఏ పేరుతో తీశారు? (క్లూ: ‘కనులే చెప్పగల కథ ఉంది వింటావా’ అనే పాట తెలుగు వెర్షన్‍లోనిది)
  7. సి.వి. శ్రీధర్ దర్శకత్వంలో శివాజీ గణేశన్, కాంచన, ఎస్.వి.రంగారావు నటించిన ‘శివంద మన్’ (1969) సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  8. పెరారాసు దర్శకత్వంలో విజయ్, ఆశిన్, ప్రకాష్ రాజ్ నటించిన ‘శివకాశి’ (2005) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది? (ఇదే సినిమాని 2007లో కళ్యాణ్‍రామ్‍తో ‘విజయదశమి’గా తీశారు) (క్లూ: తెలుగు సినిమా పేరుతో రవితేజ ‘ధమాకా!’ సినిమాలో ఓ పాట ఉంది).
  9. సంగీత శివన్ దర్శకత్వంలో మోహన్ లాల్, ఊర్వశి, మధు నటించిన మలయాళ చిత్రం ‘యోద్ధ’ (1992) ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  10. ఆర్.కె. సెల్వమణి దర్శకత్వంలో విజయ్ కాంత్, రమ్యకృష్ణ, రూపిణి నటించిన ‘కెప్టెన్ ప్రభాకరన్’ (1991) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 జూన్ 18 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 93 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 జూన్ 23 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 91 జవాబులు:

1.రాజాధిరాజు కథ 2. వీర ఘటోత్కచ (1958) 3. గజిని (2005) 4. టిక్ టిక్ టిక్ (1981) 5. రా చిలక (2000) 6. రంగమహల్ రహస్యము (1979) 7. సిటిజన్ (2001) 8. ముల్లు పువ్వు (1979) 9. హంతకుడెవరు (1964) 10. వెయ్యి రూపాయల నోటు (1964)

సినిమా క్విజ్ 91 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి. రాజు
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సునీతా ప్రకాష్
  • శంబర వెంకట రామ జోగారావు
  • తాతిరాజు జగం‌

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here