అద్భుతం కానీ సంక్లిష్టం – నాడీజాలం

0
3

[శ్రీమతి ఆర్. లక్ష్మి రచించిన ‘అద్భుతం కానీ సంక్లిష్టం – నాడీజాలం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

[dropcap]మె[/dropcap]దడు పొరలలో ప్రవహించే విద్యుత్తు మెదడు కార్యకలాపాలకు ముఖ్య కారణం. విద్యుత్ క్షేత్రం వాహకంగా పనిచేస్తుంది అనుకుంటే జ్ఞాపకం అన్నది నాడులు వెలువరించే సమాచారం. మెదడులోని వివిధ భాగాలకు ఇవి సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాయి. ఆ సమాచారాన్ని అనుసరించి తక్షణ స్పందనలు గాని, జ్ఞాపకాలుగా నిక్షిప్తం కావడం గానీ జరుగుతూ ఉంటుంది.

తేనెటీగలకు 9,60,000 న్యూరాన్స్ ఉంటాయని తెలిసింది. వాటికి సహజసిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన అంచనా, లెఖ్ఖ, దిశలను గుర్తుపెట్టుకోగల/గుర్తించగల సామర్థ్యంతో అవి ఎంత దూరమైనా వెళ్ళగలవు. ఏ మాత్రం పొరపాటు లేకుండా తిరిగి రాగలవు. అవే కాదు, ప్రకృతిలో పశుపక్షాదులు సైతం ఎంత దూరం వెళ్ళీనా నిర్ణీత సమయానికి తిరిగి తమ ఆవాసాలకు చేరుకోవటం చూస్తూనే ఉంటాం. వేల కిలోమీటర్లు ప్రయాణించే వలన పక్షులు కూడా సీజన్ పూర్తి కాగానే తిరిగి అన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ప్రాంతాలకు వెళ్లపోగలుగుతాయంటే అదంతా మెదడు మాయజాలమే. న్యూరోట్రాన్స్‌‍మిషన్ మహిత్యమే!

ఫ్రూట్ ఫ్లైస్‍పై శాస్త్రజ్ఞులు జరిపిన ఒక అధ్యయనం ప్రకారం మూడు ప్రత్యేకమైన నాడీసమూహాలు దిశానిర్దేశాలను ఖచ్చితమైన చర్యలుగా అనువదిస్తాయని తేలింది.

మనుషులతో సహా అనేక సంక్లిష్టమైన జీవజాతులలో ప్రవర్తనకు సంబంధించిన సర్దుబాట్లు, జ్ఞాపకశక్తి/స్థితిగతులు, దిశలకు సంబంధించిన అంచనాల వంటి కార్యకలాపాలకు ఆధారభూతమవుతున్న నాడీసమూహాలను గుర్తించడానికై కృషి జరుగుతోంది.

US లో 16 మిలియన్ల మంది ఆల్కాహాల్ తీసుకొనే అలవాటు వలన వచ్చే డిజార్డర్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఈ అలవాటు కారణంగా వారి మెదడులో కార్టెక్స్ భాగం పలుచబడటం జరుగుతోంది. A.U.D.కి కారణం అదే. అయితే ఆల్కాహాల్ తీసుకునే అలవాటు మానివేశాకా వారి మెడదులో మార్పు రావడం మొదలయింది. కార్టెక్స్ మొదటి నెలలో త్వరితంగా, తరువాత క్రమక్రమంగా సాంద్రత పెరుగుతూ వచ్చింది. కాని కొంతకాలం తరువాత ఆల్కహాల్ అలవాటు లేనివారిలో వలె సాధారణ స్థితికి వచ్చింది.

మెదడు లోని ఒక ప్రత్యేకమైన ప్రాంతం ‘క్లాస్ట్రమ్’. సెరెబ్రల్ కార్టెక్స్‌తో విస్తృతమైన, సుదీర్ఘమైన అనుసంధానాలను కలిగి ఉంటుంది. మెదడులో చేతనావస్థ రూపుదిద్దుకునే అతి ముఖ్యమైన ప్రక్రియలో ఈ అనుసంధానాలు కీలకమైన పాత్ర వహిస్తున్నాయి. ప్రొఫెసర్ కోచ్ బృందం అధ్యయనాలలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

డానిష్ న్యూరాలజిస్టులు జరిపిన పరిశోధనలలో స్త్రీల కంటే పురుషులలో బ్రెయిన్ సెల్స్ 16% ఎక్కువ ఉంటాయని తేలింది. సగటున – మగవారిలో 22.8 బిలియన్స్ మెదడు కణాలు ఉండగా ఆడవారిలో 19.3 బిలియన్స్ మాత్రమే ఉన్నట్లు తేలింది. అయితే అధిక మొత్తంలో ఉన్న గ్రే మేటర్ మగవారికి తెలివితేటలకు సంబంధించిన అదనపు ప్రయోజనాలేవి చేకూర్చటం లేదని వెల్లడయ్యింది. 20-90 సంవత్సరాల వయసుల నడుమ చనిపోయిన సుమారు 94 మంది డానిష్ పౌరుల మెదళ్ళపై జరుపబడిన అధ్యయనాలలో ఈ వివరాలు బయటపడినట్లు ‘కంపారిటివ్ న్యూరాలజీ’ జర్నల్ ప్రచురించింది.

వివిధ జీవులలో మెదడు పనితీరుకు సంబంధించి ఏకీకృత/సారూప్య సూత్రాలను కనుగొనడంలో, అర్థం చేసుకోవడంలో ఈ అధ్యయనాలు ఉపకరిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here