[శ్రీ మరింగంటి శ్రీకాంత్ రచించిన ‘ఓ నా ప్రియ నేస్తమా..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఓ[/dropcap] నా ప్రియ నేస్తమా
ఎలా కలిసి ఉన్నామో అలా విడిపోయాం
ప్రాణ స్నేహితులుగా ఒక దశలో
ఎదుగుదలలో దారులు వేరవుతూనే ఉన్నాయి
వర్ణ వర్గ విభేదాలా, వృత్తి పరమైన బాధ్యత లా
ఇంజినీరుగా దేశ విదేశాల్లో నీవు
నేనేమో స్కూల్ టీచర్‌గా పాఠాలు నేర్చుకుంటున్నాను
సంసారం, ఇల్లు పిల్లలు బాధ్యతలు
ఒకరి నుండి ఒకరిని దూరంగా విడదీసింది
నీ బిజీ వ్యవహారంలో నా కాల్
కుశల ప్రశ్నలకు మాత్రమే సరిపోతుంది
ఆరాటం ఇంకా ఇంకా మాట్లాడాలనే
నీ ఆత్మీయతా మాటలు నా కెప్పటికీ ప్రాణాధారాలే
సజీవంగా ఎప్పుడూ ఆ ఆనందంలోనే
నా కంటూ నిర్మించుకున్న నా లోకంలో అపశృతి
నన్నొంటరి చేస్తుందేమోనన్న భయం పట్టుకుంది
తెగిన గాలిపటంలా చూపుల వలలోకి ఎగిరి వస్తున్నా
చినిగి పోకుండా నీ కనుపాపలలో పొదువుకో నేస్తమా..